రేపు నిర్మల్‌లో బీఆర్‌ఎస్ జిల్లా దశాబ్ది వేడుకలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..
నిర్మల్, పున్నమి ప్రతినిధి: జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా దశాబ్ది వేడుకలు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10:30 గంటలకు కొండాపూర్‌లోని బీఆర్‌ఎస్ నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు ఇతర కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై జిల్లా దశాబ్ది వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యాలయం కోరింది.









