శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ!
జిల్లాలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రచారంలో ఉన్న జాబితా ప్రకారం నెల్లూరు కార్పొరేషన్ జనరల్, కావలి బీసీ జనరల్, వెంకటగిరి జనరల్ మహిళ, గూడూరు ఎస్టీ మహిళ, సూళ్లూరుపేట ఎస్సీ మహిళకు కేటాయించే అవకాశముంది. నాయుడుపేట బీసీ మహిళ, ఆత్మకూరు బీసీ జనరల్, బుచ్చిరెడ్డిపాళెం జనరల్ మహిళ, అల్లూరు ఎస్టీ జనరల్‌గా పేర్కొన్నారు. అయితే అధికారిక ధ్రువీకరణ లేకపోవడంతో ఆశావహులు తుది ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు మొదలయ్యాయి.
