Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Nellore District

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోటి గొంతుకల కోవూరు

నెల్లూరు జిల్లాలో చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక ప్రత్యేకత కలిగిన నియోజకవర్గం కోవూరు. ఒకప్పుడు ఎర్రజెండాలు ఎగిరిన ఈ నేల కార్మిక, కర్షక ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచింది. దక్షిణ భారత ఉద్యమ సూర్యుడిగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య జన్మించిన అలగానిపాడు ఈ నియోజకవర్గంలోనే ఉంది. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి వంటి ప్రముఖులకు కూడా కోవూరు ప్రాంతంతో అనుబంధం ఉంది. పచ్చని మాగాణులు, సారవంతమైన పంట పొలాలు కోవూరు ప్రత్యేకత. పెన్నా నది, పైడేరు, మాలిదేవి వాగులు ఈ ప్రాంత వ్యవసాయానికి జీవనాధారాలుగా నిలుస్తున్నాయి. ఆక్వా సాగు, చేనేత, మత్స్యకార వృత్తులు కూడా ఇక్కడి జీవన విధానంలో కీలకం. జొన్నవాడ, రామతీర్థం, గంగపట్నం వంటి పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక గుర్తింపును తెచ్చాయి. ఇందుకూరుపేట ప్రాంతం పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. తమలపాకు, అరటి పంటలు, పాటూరు చీరలు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతాయి. జాతీయ రహదారి, రైల్వే మార్గం, సాగర తీరం కోవూరుకు అదనపు బలం. ఉద్యమాలు, వ్యవసాయం, సాహిత్యం, రాజకీయం, ఆధ్యాత్మికత కలగలిసిన కోటి గొంతుకల నేల కోవూరు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెళ్లి పీటలపై గిరిజన ఆడపడుచుకు ‘పెద్దన్న’ అండ!

రూ.10,116 నగదు.. పట్టు వస్త్రాలతో వివాహ కానుక వధూవరులను ఆశీర్వదించిన కంచి పరమేశ్వర రెడ్డి ఆత్మకూరు, సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి): గిరిజన ఆడపడుచుల వివాహాలకు అండగా నిలుస్తూ శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఆత్మకూరు మున్సిపాలిటీ 2వ వార్డు వెంకట్రావుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన బొమ్మ ఉమాదేవి వివాహానికి ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి పెద్దదిక్కుగా నిలిచారు. ‘గిరిజన ఆడపడుచులకు పెళ్లి కానుక’ కార్యక్రమంలో భాగంగా రూ.10,116 నగదు చెక్కుతో పాటు నూతన పట్టు వస్త్రాలను స్వయంగా అందజేసి వధూవరులను ఆశీర్వదించారు. తమ కుమార్తె వివాహానికి తండ్రి స్థానంలో నిలిచి ఆర్థిక సాయం చేయడంతో ఉమాదేవి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనై కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాల నివారణకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పరమేశ్వర రెడ్డి తెలిపారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో అన్నప్రసాద కార్యక్రమాలను కూడా ట్రస్ట్ కొనసాగిస్తోంది.