Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Local

మహబూబాబాద్

అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దారం సుప్రియకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఘన నివాళులు

మహబూబాబాద్, అక్టోబర్ 11:* ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దారం సుప్రియ భౌతికకాయం నేడు మహబూబాబాద్‌లోని వారి నివాసానికి చేరుకుంది ఈ సందర్భంగా *మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* సుప్రియ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం సుప్రియ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ కుమారి బిందు ఆంగోత్ గారు, మహబూబాద్ పట్టణ మాజీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గద్దె రవి గారు, 35 వ వార్డు కౌన్సిలర్ నీరజ రవి గారు, బొడ శ్రీను గారు, కొదుమూరి శంకర్ లింగం గారు, కొదుమూరి సురేష్ గారు, పాల్గొని సుప్రియకు నివాళులర్పించారు* *మహబూబాబాద్, అక్టోబర్ 11:* ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దారం సుప్రియ భౌతికకాయం నేడు మహబూబాబాద్‌లోని వారి నివాసానికి చేరుకుంది ఈ సందర్భంగా *మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* సుప్రియ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం సుప్రియ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ కుమారి బిందు ఆంగోత్ గారు, మహబూబాద్ పట్టణ మాజీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గద్దె రవి గారు, 35 వ వార్డు కౌన్సిలర్ నీరజ రవి గారు, బొడ శ్రీను గారు, కొదుమూరి శంకర్ లింగం గారు, కొదుమూరి సురేష్ గారు, పాల్గొని సుప్రియకు నివాళులర్పించారు

మహబూబాబాద్

మహిళా పంచాయతీ కార్యదర్శి పై దురుసుగా ప్రవర్తించిన మాజీ సర్పంచ్ భర్త గుగులోతు నెహ్రూ నాయక్.

మహిళా పంచాయతీ కార్యదర్శి పై దురుసుగా ప్రవర్తించిన మాజీ సర్పంచ్ భర్త గుగులోతు నెహ్రూ నాయక్…… మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రధాన అనుచరుడుగా ఉంటూ అనేక అవినీతి కార్యక్రమాలు చేసిన నెహ్రూ నాయక్….. నా చిట్టా బయట పెడితే నిన్ను కురవి లో తిరగనివ్వను అంటూ ప్రాణహాని బెదిరింపులకు గురి చేసిన ఆడియో వైరల్ కురవి మండలం చంద్య తండా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గా చేసిన గుగులోతు పద్మ నెహ్రూ నాయక్ అధికారంలో ఉన్నప్పుడు భారీగా నిధులు గోల్ మాల్ — ఉపసర్పంచ్ సంతకం లేకుండానే దొంగ బిల్లులు ఎత్తుకున్న బిఆర్ఎస్ మాజీ సర్పంచ పద్మ నెహ్రూ నాయక్ భార్య భర్తలు కలిసి పంచాయతీ కార్యదర్శి పై బెదిరింపులు — నువ్వు తండా దాటి ఎట్ల వెళ్తావో అంతు చూస్తాం అంటూ బెదిరింపులు ఇలాంటి వారి పై పోలీసులు,జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న Uploaded Video:

మహబూబాబాద్

లింగ్యాతండా (బలపాల)లో విషాదం..

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండా (బలపాల)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు బానోత్ అనూష (35), కుమారుడు విశాల్ కృష్ణ (09), కూతురు వర్షిణి (05) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహబూబాబాద్

అంధకారంలో బతుకమ్మ సంబరాలు

పెద్దనాగారం గ్రామంలో విద్యుత్‌ అంతరాయంతో చీకట్లోనే బతుకమ్మ వేడుకలు మహబూబాబాద్ జిల్లా, నరసింహుల పేట మండలం పెద్దనాగారం గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంధకారంలో జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, యువతులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే వేడుకల సమయంలో విద్యుత్‌ లేకపోవడంతో గ్రామంలో చీకట్లు అలుముకున్నాయి. దీంతో మహిళలు, యువతులు చీకట్లోనే బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పండుగ వేళల్లోనైనా అధికారులు స్పందించి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మహబూబాబాద్

గిరిజన మహిళకు న్యాయం చేయాలి

డబ్బులు తీసుకొని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి బాధ్యులను అరెస్టు చేయకపోతే వేలాది గిరిజనులతో ధర్నా ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు భూక్యా రామ్మూర్తి నాయక్‌ మరిపెడ:మరిపెడ మండల కేంద్రంలో గిరిజన మహిళను మాయమాటలతో నమ్మించి రూ.25 లక్షలు తీసుకొని మోసం చేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు భూక్యా రామ్మూర్తి నాయక్‌ డిమాండ్‌ చేశారు. బాధితురాలికి న్యాయం చేయకపోతే ఎల్‌హెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో వేలాది మంది గిరిజనులతో మండల కేంద్రంలో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.శనివారం మరిపెడ మండల కేంద్రంలో ఎల్‌హెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని హాని రెస్టారెంట్‌ వెనుక ఉన్న చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ప్రభుత్వ భూమిని తమ సొంత భూమిగా నమ్మించి, పట్టా ఉందని, రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని చెప్పి నీలుకుర్తి పరకాజాల తండాకు చెందిన నేతావత్‌ యకమ్మ నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.భూమిపై అనుమానం వచ్చి అది ప్రభుత్వ చెరువుకు సంబంధించిన భూమి కాదా అని బాధితురాలు ప్రశ్నించగా, ఆమెను కులం పేరుతో దూషించి అవమానించినట్లు తెలిపారు. అధికార పార్టీలో పదవిలో ఉన్నానని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించిందన్నారు. అమాయక గిరిజన మహిళను మోసం చేయడం దారుణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఘటనపై బాధితురాలు మరిపెడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు రామ్మూర్తి నాయక్‌ తెలిపారు. అయితే, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని తొర్రూరు డీఎస్పీని కోరారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ సంఘం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.మరిపెడ మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూములను గుర్తించి, ఆక్రమణలు జరిగినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, నిర్లక్ష్యం వీడి భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు.బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోతే ఎల్‌హెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

మహబూబాబాద్

సర్ ను రద్దు చేయాలి-ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ

2025 కి ముందు ఉన్న ఓటర్ జాబితాలను పునరుద్ధరించాలి.* – *జ్ఞానేశ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలి*. – *ఓట్ రద్దు కుట్రకు మోడీ, షా లు బాధ్యత వహించాలి*. *ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేసి 2025 కి ముందు ఉన్న ఓటర్ జాబితాలను పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు ఏ. మురళీకృష్ణ, బలాస్టి రమేష్, టి. దేవేందర్ రాజు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆ సంఘం అధ్యర్వంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో వారు మాట్లాడారు. అధికార బీజేపీ కి అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే ఓటర్ల జాబితాలో ఉంచి ఇతర పార్టీల ఓటర్లను తొలగించే కుట్ర జరిగిందని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు తెలియజేస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ సంస్థల్లో రాజకీయ జోక్యం పెంచి వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్న బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయజూస్తుందని ఆరోపించారు. నోట్ రద్దు, నీట్ రద్దు, ఓట్ రద్దు ఇలా అన్ని రద్దులే తప్ప ప్రజలకు కల్పించేది ఏమి లేదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థ కు మూలమైన ఓటును పౌరులకు దూరం చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని, ఈ మొత్తం వ్యవహారానికి మోడీ, అమిత్ షా లు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు*. *ఇంకా ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిడాల సత్యనారాయణ టి పి టి ఎఫ్ ఫోర్ ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు రిటైర్డ్ సంఘం గౌరవ అధ్యక్షులు మైస నాగయ్య మాజీ ఎంఈఓ పీజీ వివేకానంద యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ కే యాకుబ్ టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ చీకటి ఉపేందర్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్ హరి నాయక్ అజ్మీర భీముడు గుడిబోయిన వెంకటేశ్వర్లు బందెల రాజు కే వెంకటేశ్వర్లు వై యాకయ్య బావుసింగ్ ఎస్కే ఇమామ్ ప్రవీణ్ కుమార్ సంజీవ ధైద వెంకటేశ్వర్లు జవహర్లాల్ సంజీవ అక్కెనపల్లి బాబురావు మంగీలాల్ కుమార్ ప్రసాద్ గణపురం బిక్షపతి స రెడ్డి రామలింగారెడ్డి అనుమాండ్ల గోవర్ధన్ చిందం శ్రీనివాస్ నరసింహారావు బాలు తదితరులు పాల్గొన్నారు.*

మహబూబాబాద్

పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!

పౌరసరఫరాల శాఖలో జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న అధికారి ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులను కూడబెట్టారు. అది కూడా.. ఇన్‌చార్జి మేనేజర్‌గా అదనపు బాధ్యతల్లో ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌ కావడం గమనార్హం. పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు! Mahabubabad ACB raids నరసింహారావు నివాసాల్లో ఏసీబీ సోదాలు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తింపు అధికారిక లెక్కల్లోనే రూ.9.41 కోట : పౌరసరఫరాల శాఖలో జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న అధికారి ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులను కూడబెట్టారు. అది కూడా.. ఇన్‌చార్జి మేనేజర్‌గా అదనపు బాధ్యతల్లో ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌ కావడం గమనార్హం. మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న వాసంశెట్టి నరసింహారావు.. అవినీతి, అక్రమ మార్గాల ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(1)(బి) రెడ్‌విత్‌ 13(2) కింద ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.ఈ మేరకు శుక్రవారం ఆయన నివాసంతోపాటు మహబూబా బాద్‌లోని కార్యాలయం, బంధువులు, బినామీలకు సంబంధించిన ఏడు చోట్ల సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఆస్తుల విలువ రూ.9,41,06,975 ఉంటుందని ఏసీబీ డీజీ చారుసిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కీలక పోస్టులో పనిచేసిన నరసింహారావుకు ఆ జిల్లాలోని బల్లెపల్లి, రఽఘునాథపాలెం, వెలుగుమట్లలో ఐదు ఓపెన్‌ ప్లాట్లు 1,230.16 గజాల విస్తీర్ణంలో ఉన్నాయని, వీటి డాక్యుమెంట్‌ విలువ రూ.30,72,000 అని వెల్లడించారు. బినామీ పేరిట భారీగా ఆస్తులు.. సూర్యాపేట జిల్లా కల్మలచెరువు వద్ద 1.08 ఎకరాలు, నిజామాబాద్‌ జిల్లా సిరికొండలో 21.3 ఎకరాలు, నమవరంలో 5.31 ఎకరాల చొప్పున రెండు పొలాలు నరసింహారావు పేరిట, ఆయన మామ పేరిట ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. వీటి డాక్యుమెంట్‌ విలువ రూ.1,17,01,895గా పేర్కొన్నారు. సిరికొండలోని 21.3 ఎకరాల భూమి డాక్యుమెంట్‌ విలువ రూ.76 లక్షలు కాగా, దీని అగ్రిమెంట్‌ విలువ రూ.6,54,75,000 అని వెల్లడించారు. నమవరంలో ఒక్కో భూమి డాక్యుమెంట్‌ విలువ రూ.19,25,000 కాగా, అగ్రిమెంట్‌ విలువ రూ.1.92 కోట్లు అని తెలిపారు. ఖమ్మం జిల్లా కవిరాజ్‌నగర్‌లో జీ-ప్లస్‌ 2 భవనం, జీ-ప్లస్‌ 4 ఆర్‌సీసీ భవనం, హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌, బైరామల్‌గూడ సాగర్‌ ఎన్‌క్లేవ్‌లో మూడు అంతస్తుల ఇల్లు నరసింహారావు, ఆయన భార్య, మామ పేరిట ఉన్నాయని ఏసీబీ అధికారులు వివరించారు. వీటి డాక్యుమెంట్‌ విలువ రూ.1.58 కోట్లు అని పేర్కొన్నారు. నరసింహారావు ఇంట్లోని మూడు వాహనాల విలువ రూ.20 లక్షలు ఉంటుందని, గృహోపకరణాల విలువ రూ.33.48,400గా గుర్తించామని తెలిపారు. అంతేకాకుండా ఆయన ఇంట్లో రూ.9,39,321 విలువ చేసే 360 గ్రాముల బంగారు ఆభరణాలు, 331 గ్రాముల వెండి వస్తువులను గుర్తించామని, వీటి విలువ రూ.9,39,321 ఉంటుందని వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ డాక్యుమెంట్‌ ప్రకారం రూ.9,41,06,975 ఉందన్నారు. టెక్నికల్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరి.. నరసింహారావు అదనపు ఆస్తులు, బినామీ లెక్కలపై విచారణ జరుగుతోందని, బినామీ పేరిట ఒక రైస్‌మిల్లును కూడా ఆయన కొన్నట్లు అనుమానిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. నరసింహారావు బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాల పరిశీలన కొనసాగుతుందన్నారు. కొన్ని వ్యాపారాల్లోనూ నరసింహారావుకు లావాదేవీలు ఉన్నట్లుగా గుర్తించామని ఏసీబీ ఖమ్మం డీఎస్పీ రమేష్‌ ప్రకటించారు. కాగా, 2011లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరిన నరసింహారావు ఖమ్మం, నిర్మల్‌ ప్రాంతాల్లో పనిచేశారని, 15 ఏళ్లుగా విధుల్లో ఉంటూ ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించామపి తెలిపారు. ఖమ్మంలోని నివాసంలో కొంత నగదు, బంగారంతోపాటు ఖరీదైన మద్యం బాటిళ్లు కూడా గుర్తించామని, ఇంకా అన్ని చోట్ల తనీఖీలు పూర్తయిన తరువాత వివరాలు వెల్లడిస్తామని అన్నారు.