భూ రీసర్వే తెచ్చిన తంట
భూ రీసర్వే తెచ్చిన తంటా! పాసుపుస్తకాల జారీలో తప్పిదాలు.. గ్రామాల్లో మళ్లీ భూ వివాదాలు రైతుల్లో ఆందోళన – సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తుల డిమాండ్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన భూ రీసర్వే, కొత్త పాసుపుస్తకాల జారీ ప్రక్రియలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తప్పిదాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూమి లేని కొందరి పేర్లపై రెండు ఎకరాల భూమికి పాసుపుస్తకాలు జారీ కావడం, వాస్తవంగా రెండు ఎకరాల భూమి కలిగిన రైతులకు మాత్రం ఒక ఎకరాకు మాత్రమే పాసుపుస్తకం రావడం వంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా, ఒక రైతు పేరు మీద ఉండాల్సిన భూమి మరొకరి పేరుపై నమోదవడం కూడా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిణామాల కారణంగా గ్రామాల్లో గతంలో సమసిపోయిన భూ వివాదాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. భూమి హక్కుల విషయంలో రైతుల మధ్య అపోహలు, వివాదాలు పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు
