Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Hospital

నంద్యాల

వైద్య ఆరోగ్యశాఖలో అన్ని క్యాడర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలి సిఐటియు

నంద్యాల-వైద్య ఆరోగ్యశాఖలో అన్ని క్యాడర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల డిఎం అండ్ హెచ్ ఓ శారదాబాయి మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు సిఐటియు జిల్లా కార్యదర్శి వెన్న, బాల వెంకట్ ఏపీ హెల్త్ సెక్రటరీల జిల్లా కార్యదర్శి కే పద్మావతి యూనియన్ నాయకురాల్లో వి సుధా శశికళ విజయలక్ష్మి విజయలక్ష్మీబాయి లతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు గారు మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని తల్లి బిడ్డలకు అందించే ప్రతి సర్వీసును యూడ్ (యు- విన్. అన్వల్. ఆర్. సి.హెచ్) యూప్ లలో కాకుండా ఓకే యూప్ లు కల్పించాలనీ అర్హులైన హెల్తు సెక్రటరీలకు ఎంపీహెచ్ఏ (ప్) లుగా ప్రమోషన్లు కల్పించాలని యాప్ lu సర్వేల పని భారాన్ని వెంటనే తగ్గించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి (ఎఫ్ ఆర్ ఎస్) నుండి మినహాయింపు ఇవ్వాలి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఈనెల 12వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో జిల్లాలో ఉన్నటువంటి హెల్త్ సెక్రెటరీలందరూ పాల్గొనాలని అలాగే 29/ 10 2026 తేదీన విజయవాడలో ధర్నా చౌక్ లో జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో హెల్త్ సెక్రటరీ అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు

నంద్యాల

లింగ నిర్ధారణ చేస్తే జైలుకే

నంద్యాల-జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ డీఎల్‌ఎస్‌సీ కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శారదాబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఆడబిడ్డలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్కానింగ్‌ కేంద్రాల్లో ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌, జిల్లా విస్తరణ, మాస్‌ మీడియా అధికారి మల్లేపల్లి పామన్న, డాక్టర్‌ సలీమున్నీసా బేగం, బర్డ్‌ ఎన్జీవో ప్రతినిధులు వినయ్‌బాబు, వంశీ పాల్గొన్నారు.

నంద్యాల

కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన ఉధృతం.. సెప్టెంబర్ 8 నుంచి విధుల బహిష్కరణ హెచ్చరిక

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మెడికల్, పారామెడికల్ ఉద్యోగుల నిరసనలు శనివారంతో ఆరో రోజుకు చేరాయి. నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టి తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు 100 శాతం గ్రాస్ వేతనం, ఈపీఎఫ్, హెల్త్ కార్డులు, బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 8 నుంచి విధుల బహిష్కరణకు దిగుతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.