Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Durgadevi

ASIFABAD

గోలేటిలో దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

రెబ్బెన: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెబ్బెన మండలం గోలేటిలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గాభవాని అమ్మవారిని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం మన సంప్రదాయమని, ఇలాంటి పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేసరి కిషన్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు చెన్న సోమశేఖర్, ఇంద్ర ఫెలోషిప్ కోఆర్డినేటర్ కోవా ఇంద్ర విజయ, రెబ్బెన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, మండల ఉపాధ్యక్షుడు బలరాం నాయక్, గంగాపూర్ టెంపుల్ డైరెక్టర్ అడప విమల, సీనియర్ నాయకులు సాంబ గౌడ్, ఇల్లూరి రాము, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఏలగల సాయికుమార్, స్థానిక ఉపసర్పంచ్ దుర్గం తిరుపతి, రెబ్బెన టౌన్ అధ్యక్షుడు దుర్గం రాజేష్, యువజన కాంగ్రెస్ వాంకిడి మండల అధ్యక్షుడు ఉప్పుల కృష్ణ, రెబ్బెన మండల ఉపాధ్యక్షుడు జటాంగుల సంజయ్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రెబ్బెన రవి, యువజన కాంగ్రెస్ నాయకులు పార్వతి సాయి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ASIFABAD

విజయదశమి సందర్భంగా కైరిగూడలో మహిళలకు చీరల పంపిణీ

విజయదశమి, దసరా పండుగను పురస్కరించుకొని కైరిగూడ గ్రామంలోని శ్రీ జగదంబ దుర్గామాత ఆలయం వద్ద గ్రామ మహిళలకు భారీ సంఖ్యలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులు, సమస్త గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా భక్తులు అమ్మవారికి సమర్పించిన నూతన వస్త్రాలను దసరా సందర్భంగా గ్రామ మహిళలకు అమ్మవారి చీరలుగా కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీర ఆత్మారాం నాయక్, సర్పంచ్ సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అజ్మీర హరి నాయక్, లౌడియ వస్త్రం నాయక్, అజ్మీర వసంతరావు నాయక్, లవ్డియ రాజు నాయక్, వార్డు సభ్యులు అజ్మీర సాయి, వసంతరావు, అజ్మీర సందీప్, ఎల్. ప్రదీప్, ఎల్. రాము, కిట్టు, ఎల్. సాయి, శ్రవణ్, నవీన్, అరుణ్, విజయ్, రాజేందర్, రవి, సంతోష్, గణేష్, రాము, చందులాల్, మిట్టు, కృష్ణ, శంకర్, ఎల్. శంకర్, వినాయక్, అనిల్, మింగు నాయక్, ఎల్. చందు, అజ్మీర తుకారాం, సీతారాం, రామ్ చంద్, పరశురాం, ఎల్. సీతారాం, గోపాల్, నాందేవ్, బానోత్ రవీందర్, అరవింద్, నరేష్, నితీష్, రాజేష్, జగదీష్, అజ్మీర చంద్రశేఖర్, అజ్మీర వినయ్, అజ్మీర ఔత్మాల్, అజ్మీర శ్రీకాంత్, అజ్మీర గణేష్, అజ్మీర చందులాల్, ఎల్. రామ్ కుమార్, అజ్మీర పరశురాం, రాథోడ్ బోర్లాల్, రాథోడ్ బాలు, పర్లాల్, విష్ణు, టు అజ్మీర వినోద్, అజ్మీర సురేష్, పాల్త్య రాజు తదితరులు పాల్గొన్నారు.