Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: ChandrababuNaidu

అమరావతి

రివ్యూలు కాదు.. రిజల్ట్స్ కావాలి: సీఎం చంద్రబాబు

8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రజాసేవకులుగా పనిచేయాలని, ఈగోలకు తావివ్వొద్దని సూచించారు. రివ్యూలకే పరిమితం కాకుండా ఫలితాలు చూపాలని స్పష్టం చేశారు. ఫైళ్లు, ప్రజా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటం అభివృద్ధి, న్యాయం పెండింగ్‌లో ఉన్నట్టేనన్నారు. Reactive Governance నుంచి Proactive Governance‌కు మారాలని పిలుపునిచ్చారు. సమస్యలను దాచకుండా వాస్తవాలను వెల్లడించాలని, ఫేక్ ప్రచారానికి వెంటనే కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారు. శాఖలు, జిల్లాలు ఉత్తమ పనితీరులో పోటీపడాలని పేర్కొంటూ **“One State–One Vision–One Team–One Mission”** స్వర్ణాంధ్ర లక్ష్యమన్నారు.

ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలు తేలిగ్గా వద్దు:సీఎం చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో నాయకుల మధ్య విభేదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ స్థానాల్లో సమర్థులైన మహిళా నేతలను గుర్తించాలని చెప్పారు. చిన్న సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలని, ఫ్లెక్సీలు, సోషల్ మీడియా పోస్టులపై అనవసర వివాదాలు కూటమికి నష్టం చేస్తాయని హెచ్చరించారు

విశాఖపట్నం

విశాఖలో అంతర్జాతీయ గురుకులం

విశాఖపట్నంలో అత్యాధునిక గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ స్వామినారాయణ గురుకుల ట్రస్ట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆగస్టు 22న విశాఖ నోవోటెల్‌లో జరిగిన బ్రిక్స్ మంత్రుల సమావేశంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. విలువలతో కూడిన విద్య, ఆధ్యాత్మిక జ్ఞానంతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు మెగా విజన్

మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కీలక ప్రతిపాదనలు చేశారు. అమరావతి–బెంగళూరు–చెన్నై బుల్లెట్ ట్రైన్, ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, విద్యుత్ గ్రిడ్, స్కిల్లింగ్ కన్సార్టియం ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం, విశాఖ–విజయవాడ మెట్రోలకు అనుమతులు, విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరగలదన్నారు.

అమరావతి

లోకేష్‌పై జగన్ ఫైర్

డీఎస్సీ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. పేపర్ లీకేజీలు, బేరసారాలు సహా మొత్తం డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన జగన్, 2018 గ్రూప్-1 నియామకాలపై చేస్తున్న విమర్శలను కూడా ఖండించారు.

ఆంధ్రప్రదేశ్

దక్షిణాది సమస్యలపై మహాబలిపురంలో కీలక మంతనాలు

నేడు మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం – కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనున్న సమావేశం – సమావేశానికి హాజరుకానున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు – సమావేశానికి హాజరుకానున్న సీఎంలు, సీనియర్ మంత్రులు, సీఎస్ లు, ఎల్జీలు – రూ.52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరనున్న సీఎం చంద్రబాబు – రాష్ట్రాలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంపై చర్చ – ఏపీ విభజన చట్టంలోని వివిధ అంశాలపై చర్చించనున్న ప్రతినిధులు -కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయమే సమావేశం లక్ష్యమన్న కేంద్ర హోంశాఖ.

అమరావతి

అసెంబ్లీకి రాకుండా రాజకీయాలెందుకు?: చంద్రబాబు నాయుడు

అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం తన రాజకీయ చరిత్రలో చూడలేదన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చిస్తేనే వాటికి విలువ ఉంటుందని పేర్కొన్నారు. గ్రూప్-1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే డీఎస్సీ-2025పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం తగ్గించిన బీసీ రిజర్వేషన్లను తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని తెలిపారు

అమరావతి

గురుకుల్‌కు స్థలం రిజిస్ట్రేషన్

అమరావతిలో శ్రీ స్వామినారాయణ గురుకుల్ క్యాంపస్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తుళ్లూరు మండలం నేక్కల్లులో కేటాయించిన 4.235 ఎకరాల స్థలానికి ఏపీ సీఆర్‌డీఏ అధికారులు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వం స్థలం అప్పగించడంపై హర్షం వ్యక్తం చేసిన పూజ్య సుఖ వల్లభ దాస్ స్వామీజీ, పూజ్య మంత్ర స్వరూప్ దాస్ స్వామీజీ, స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.