ఇందుపూరు జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా కోడూరు యమున గారు నామినేషన్
అల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా అల్లూరు మండలం,ఇందుపూరు ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా కోడూరు యమున గారు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సహకారంతో ఈ నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కావలి జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు , నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు , సీనియర్ నాయకులు బీదా గిరిధర్ గారు , అల్లూరు మండల కన్వీనర్ బండి శ్రీనివాసులుగారు , పలగాడి శ్రీనివాసులు గారు తదితరుల సహకారంతో ఈ నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా విశ్వసనీయత, విలువలు, నిజాయితీతో పనిచేసిన కోడూరు సాధక్ రెడ్డి గారు , కోడూరు హరికుమార్ రెడ్డి గారు ల కుటుంబానికి అల్లూరు మండలంలో మంచి పేరు ఉందన్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి కోడూరు యమున గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









