జిల్లా స్థాయి అండర్-20 పోటీల్లో గొల్లగూడెం జట్టు ఘన విజయం!
ఫైనల్లో ఇరవెండి జట్టుపై 50–12 తేడాతో గెలుపు.. క్రీడాకారులను అభినందించిన ఉప సర్పంచ్ బొల్లినేని గణేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దసరా పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరవెండి గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-20 క్రీడా పోటీల్లో అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఫైనల్ పోటీలో గొల్లగూడెం, ఇరవెండి జట్లు తలపడగా, గొల్లగూడెం జట్టు 50–12 పాయింట్ల తేడాతో ఇరవెండి జట్టుపై ఘన విజయం సాధించింది. తమ ఆటతీరుతో గొల్లగూడెం గ్రామానికి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చిన యువ క్రీడాకారులపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొల్లగూడెం గ్రామ ఉప సర్పంచ్ బొల్లినేని గణేష్ విజేతలైన క్రీడాకారులను అభినందించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలు, ఇతర నైపుణ్యాలపై దృష్టి సారించాలని, తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకొని ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విజేత జట్టు క్రీడాకారులు: బొబ్బాల హేమంత్ చెన్నబోయిన హేమంత్ పోతురాజు జస్వంత్ బొబ్బాల మనోజ్ చెరుకూరి నాగరాజు శివ శరత్ రాసాల ధనుష్ జట్టుకు విలువైన సూచనలు అందిస్తూ ముందుకు నడిపించిన గ్రామ సీనియర్ క్రీడాకారులు జక్కుల గణేష్, మల్లెబోయిన వెంకటేష్, దుబాకుల వినయ్, జక్కుల మనోజ్, గజ్జి లోహిత్ల సహకారం కూడా అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. గొల్లగూడెం గ్రామ యువకులు జిల్లా స్థాయిలో విజయం సాధించడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ విజేతలకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గొల్లగూడెం యువతకు అభినందనలు! 🏆💐








