Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

అరకు డిగ్రీ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైభారత్ విశాఖపట్నం, రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు అధ్యక్షతన దీపప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని ప్రిన్సిపల్ వివరించారు. ముఖ్య అతిథి యూత్ ఐకాన్ శివమణికంఠ రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ సంధ్యారాణి, ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు సుధీర్, విజయలక్ష్మి విద్యార్థులకు హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. వ్యాసరచన, చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులు, మైభారత్ సర్టిఫికెట్లు అందజేశారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

మహిళా సాధికారతకు ‘నయీ చేతనా 5.0’ ప్రచార కార్యక్రమం

పాడేరు, నవంబర్ 25: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు ‘నయీ చేతనా 5.0’ జాతీయ మహిళా సాధికారత ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. SERP ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మహిళల ఆర్థిక స్వావలంబన, ఆస్తి హక్కులు, సురక్షిత ప్రయాణం, సమాన అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. SERP సీఈఓ, ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కరుణ వాకాటి ఐఏఎస్ ఆదేశాల మేరకు విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అల్లూరి సీతారామరాజు

సైనిక్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పాడేరు, నవంబర్ 25: దేశవ్యాప్తంగా సైనిక్, నూతన సైనిక్ పాఠశాలల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6, 9వ తరగతుల ప్రవేశాల కోసం AISSEE–2027 ఆన్‌లైన్ దరఖాస్తులను ఎన్‌టీఏ ఆహ్వానించింది. డిసెంబర్ 2వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 వరకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష జనవరి 31, 2027న ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నారు. 6వ తరగతికి 150 నిమిషాలు, 9వ తరగతికి 180 నిమిషాల పరీక్ష ఉంటుంది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్⁠ సందర్శించాలని అధికారులు సూచించారు.

అల్లూరి సీతారామరాజు

ఐఏఎస్ కావాలన్నదే నా కోరిక: విద్యార్థిని అరుణ

“బాల్య వివాహాలపై మేడమ్స్ చెప్పినవి బాగా అర్థమయ్యాయి. బాగా చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పిన మాటలు బాగున్నాయి” అని గన్నెల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల పదో తరగతి విద్యార్థిని అరుణ తెలిపింది. పాఠశాలలో నిర్వహించిన బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో అల్లూరి జిల్లా జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ దంపతులను చూసి, తాను కూడా వారిలా ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పింది. కళాకారిణి గరివిడి లక్ష్మి, అరకులోయ సీడీపీఓ లక్ష్మీలావణ్య, గన్నెల పీహెచ్‌సీ వైద్యులు డా. జే.కే. నాయుడు, డా. ప్రియాంక, వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

అరకులో 28న మెగా జాబ్ మేళా; 10 కంపెనీలు హాజరు

అరకులోయ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 28న (శనివారం) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరిగే ఈ మేళాలో అపోలో ఫార్మసీ, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ సహా 10 కంపెనీలు పాల్గొంటాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి. ప్రశాంత్ కుమార్, ఐటీఐ ప్రిన్సిపాల్ ఉమాశంకర్ తెలిపారు. ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ మరియు ఆపై చదువు పూర్తిచేసిన నిరుద్యోగ యువతీ యువకులు పాన్ కార్డు, ఆధార్ కార్డు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు https://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు. సంప్రదించాల్సిన నంబర్లు: నవీన్ 7569923256, పవన్ 6302636174.

అల్లూరి సీతారామరాజు

అరకులోయలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన

అరకులోయలోని ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్‌సీసీ) చైర్‌పర్సన్ డా. కె. కృష్ణకుమారి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపాల్ జి. రామకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

నెట్ జీరో క్లీనప్ డేలో అల్లూరి విద్యాసంస్థల విశేష స్పందన

అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా నెట్ జీరో క్లీనప్ డే కార్యక్రమాన్ని శనివారం విస్తృతంగా నిర్వహించారు. ప్రభుత్వం, ఫారెస్ట్ బై హార్ట్‌ఫుల్‌నెస్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా 11 కేజీబీవీలు, 10 ఆశ్రమ పాఠశాలలు, 29 గురుకుల పాఠశాలలు పాల్గొన్నాయి. అరకు, చింతపల్లి క్లస్టర్లలోని 21 విద్యాసంస్థల గణాంకాల ప్రకారం 5,545 మంది పాల్గొని 717.46 కిలోల వ్యర్థాలను సేకరించారు. వీటిలో 495 కిలోల తడి, 189.80 కిలోల పొడి, 32.66 కిలోల ఇతర వ్యర్థాలు ఉన్నాయి. డుంబ్రిగూడ ఈఎంఆర్ఎస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ పరిమళ పాల్గొని పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు ఈ-వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల వేర్పాటు, పునర్వినియోగంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ ఇళ్లలో, గ్రామాల్లోనూ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణను పాటించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

అల్లూరి సీతారామరాజు

మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యాలు మెరుగుపర్చాలి

పాడేరు, నవంబర్ 21: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ కనెక్టివిటీని మెరుగుపర్చాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీఎస్ఎన్ఎల్, భారత్‌నెట్, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. సిగ్నల్ అందని గ్రామాలు, నెట్‌వర్క్ అంతరాయాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ సేవలు, వైద్యం, విద్య, డిజిటల్ లావాదేవీలు, అత్యవసర సమాచార మార్పిడికి మొబైల్ కనెక్టివిటీ కీలకమని పేర్కొన్నారు. ప్రతి మారుమూల గిరిజన ఆవాసానికి నాణ్యమైన నెట్‌వర్క్ అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో బీఎస్ఎన్ఎల్ విశాఖపట్నం డీజీఎం, భారత్‌నెట్ ఏజీఎం, పాడేరు పీఐయూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకులోయలో తొలిరోజు 54 నామినేషన్లు

అరకులోయ, నవంబర్ 21 (పున్నమి): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అరకులోయ మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో తొలిరోజు మొత్తం 54 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో సర్పంచ్ స్థానాలకు 20, వార్డు సభ్యుల స్థానాలకు 34 వచ్చాయి. సర్పంచ్ స్థానాలకు మాడగడలో అత్యధికంగా ఆరు నామినేషన్లు పడ్డాయి. సుంకరమెట్టలో మూడు; బస్కి, మాదల, పద్మాపురంలో చెరో రెండు వచ్చాయి. వార్డు సభ్యులకు బొండంలో ఎనిమిది; బస్కి, మాదలలో చెరో ఆరు; పెదలబుడులో ఐదు; మాడగడలో నాలుగు దాఖలయ్యాయి. గన్నెల, ఇరగాయి, లోతేరు, సిరగాంలో ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: టీడీపీ లో చేరిన సాగర వైసీపీ, కాంగ్రెస్ నాయకులు

డుంబ్రిగుడ, నవంబర్ 21 (పున్నమి): డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకు ఆనందరావు, పాలకి రఘు, తామర్ల సంజీవరావు, తామర్ల కుజాన్న, గెమ్మెలి సీతన్న, గెమ్మెలి మల్లన్న, తామర్ల ప్రసాద్ తదితరులు చేరిన వారిలో ఉన్నారు.