తెలంగాణ సంస్కృతి పర్యాటక వైభవం కల్చరల్ అవార్డు–2026 అందుకున్న బద్రి వెంకటరమణయ్య
హైదరాబాద్, అక్టోబర్ 5: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న నిర్వహించిన తెలంగాణ సంస్కృతి పర్యాటక వైభవం కల్చరల్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో బెస్ట్ సీనియర్ రిపోర్టర్‌గా బద్రి వెంకటరమణయ్య అవార్డును అందుకున్నారు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో నిర్వహించిన కల్చరల్ ఈవెంట్‌కు శ్రీ మల్లికార్జున అఖిల భారత మున్నూరు కాపు నిత్య అన్నదాన ట్రస్ట్ (కొమురవెల్లి) చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్ పద్మ పటేల్ ఆధ్వర్యంలో . ఈ కార్యక్రమ నీకి ముఖ్య అతిథిగా సిరిసిల్ల రాజయ్య, చిలుకూరు బాలాజీ టెంపుల్ శివాలయం ప్రధాన అర్చకులు, 59 సార్లు గిరి ప్రదక్షిణ చేసిన గురువులు ఆత్మారాం గురూజీ విచ్చేశారు వారి చేతుల మీదుగా బద్రి వెంకటరమణయ్య బెస్ట్ సీనియర్ రిపోర్టర్ అవార్డును అందుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవార్డు అందుకోవడం పట్ల బద్రి వెంకటరమణయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు తన వృత్తిపరమైన బాధ్యతలను మరింత నిబద్ధతతో కొనసాగించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారు సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ మొదలగు వారు పాల్గొన్నారు









