Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: భక్తి

నంద్యాల

మహానందిలో శ్రీ కామేశ్వరీ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

మహానంది: మహానంది క్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ కామేశ్వరీ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను గురువారం ఆలయ అధికారులు ఆవిష్కరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ నరాల చంద్రమౌళిరెడ్డి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తుల సహకారంతో వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

నంద్యాల

పూర్ణాహుతితో ముగిసిన వరుణయాగం

మహానంది: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో మహానంది క్షేత్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వరుణయాగం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా యాగ కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం వరుణ కలశంలో సేకరించిన పవిత్ర జలంతో మహానందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని యాగంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

నంద్యాల

మహానందిలో వైభవంగా నందీశ్వర అభిషేకం

మహానంది: భాద్రపద బహుళ త్రయోదశి సందర్భంగా మహానంది క్షేత్రంలో గురువారం ప్రదోషకాల నందీశ్వర అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి పంచామృతాలతో పాటు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నందీశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడింది.

నంద్యాల

దస శరన్నవరాత్రులకు ఏర్పాట్లు 11 నుంచి 20 వరకు వైభవంగా ఉత్సవాలు

నంద్యాల : శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ రామాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ విశాలాక్షి అమ్మవారు, సీతారామలక్ష్మణులు, ఆంజనేయస్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, అలంకార పూజలు, వస్త్ర సేవలు, ప్రసాద సేవలు, చండీ హోమాలు నిర్వహించనున్నారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఉత్సవాల పూజా కైంకర్యాల వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

నంద్యాల

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మహానందిలో వరుణయాగం ప్రారంభం

మహానంది: రాష్ట్రంలో నెలకొన్న అనావృష్టి, వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మూడు రోజుల ‘వరుణయాగం’ ఘనంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎన్. శ్రీనివాసరెడ్డి, పాలకమండలి చైర్మన్ నరాల చంద్రమౌళిరెడ్డిల ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ దీక్షను ప్రారంభించారు. మూడు రోజుల పాటు సాగే ఈ యాగానికి సంబంధించి పండితులు ప్రత్యేక జపాలు, హోమాలు, జలాభిషేకాలు నిర్వహించనున్నారు. శ్రీ కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామివారి అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆలయ అధికారులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు

నంద్యాల

నాగులకట్ట ఆలయంలో మంత్రి ఫరూక్ అన్నదానం

నంద్యాల:పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌ నాగులకట్ట శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తన సొంత ఖర్చులతో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. ఆకలి తీర్చే అన్నదానం మహోన్నతమైన సేవ అని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో సోదరభావాన్ని పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త పబ్బతి వేణు, ఆలయ కమిటీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

నంద్యాల

మహానంది దేవస్థానంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానం ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని గాంధీ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని అధికారులు పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు

నంద్యాల

గాంధీజీకి పోలీసుల నివాళి*—

నంద్యాల : మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిన గాంధీజీ దేశ ప్రజలకు ఆదర్శమన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, సహనం, సేవా భావం నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.కార్యక్రమంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆర్‌ఎస్‌ఐ కాళీ శ్రీచరణ్, పోలీసు సంఘం అధ్యక్షుడు స్వామినాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం

నంద్యాల : మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్‌, జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి అన్నారు.గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సత్యం, శాంతి, అహింస, జాతి సమైక్యత కోసం గాంధీజీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. రైతులు ఐక్యంగా శాస్త్రీయ పద్ధతులు పాటించి ఉద్యాన రంగ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారని తెలిపారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశ రక్షణ, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ‘జై జవాన్‌–జై కిసాన్‌’ నినాదాన్ని అందించారని గుర్తుచేశారు. ఇరువురు మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నంద్యాల

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నంద్యాలలో జనసేన నాయకుల ఘన నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు గల గాంధీజీ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు మరియు రాచమడుగు రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు రాచమడుగు చందు మాట్లాడుతూ:”సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన శాంతియుత పోరాట పంథా, సమాజ హితం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిదాయకం. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. సమాజంలో మంచి మార్పు కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, నీతివంతమైన పాలన దిశగానే సాగుతున్నాయి.” ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఠాగూర్, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.