మహానందిలో శ్రీ కామేశ్వరీ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
మహానంది: మహానంది క్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ కామేశ్వరీ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను గురువారం ఆలయ అధికారులు ఆవిష్కరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ నరాల చంద్రమౌళిరెడ్డి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తుల సహకారంతో వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.









