Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: పూజ

చిత్తూరు

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి

నియోజకవర్గ ప్రజలందరిపై శ్రీవారి కృపాకటాక్షాలు ఉండాలని ప్రత్యేక పూజలు కథనం: తిరుమల, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథరెడ్డి గురువారం ఉదయం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, అధికారులు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి కృపాకటాక్షాలతో పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.

చిత్తూరు

శ్రీవారికి రూ.25 లక్షల విలువైన బంగారు పగడాల హారాలు విరాళం

తిరుమల, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సుమారు రూ.25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలు విరాళంగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీమతి కమల గురువారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ఈ కానుకలను సమర్పించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాత శ్రీమతి కమల తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆభరణాలను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి లాంఛనంగా అందజేశారు. అనంతరం వేద పండితులు దాత కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.తిరుమల రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి బంగారు పగడాల హారాలను అందజేస్తున్న దాత శ్రీమతి కమల, కుటుంబ సభ్యులు.

చిత్తూరు

కేరళలోని ప్రసిద్ధ నవముకుంద ఆలయాన్ని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి

తిరుపతి, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి): కేరళ రాష్ట్రంలోని తిరునావాయలో వెలసిన అత్యంత ప్రాచీన, ప్రసిద్ధ శ్రీ నవముకుంద స్వామివారి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. కేరళలోని ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో కొలువైన శ్రీ మహావిష్ణువు స్వరూపమైన నవముకుంద స్వామివారిని దర్శించుకుని విశేష పూజల్లో పాల్గొన్నారు. పవిత్ర భారతపుళా నదీ తీరాన, భార్గవ తీర్థ సన్నిధిలో ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్న ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని ఆయన కొనియాడారు. ఆలయానికి విచ్చేసిన భాను ప్రకాష్ రెడ్డికి అక్కడి అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.

చిత్తూరు

శ్రీకాళహస్తికి విచ్చేసిన రాజు గురుస్వామి: రేపు అయ్యప్ప స్వామి 41వ రోజు కుంభాభిషేక మహోత్సవం

ఉత్తరా నక్షత్రం సందర్భంగా రేపు విగ్రహాభిషేకం, పడిపూజ, ఆర్కెస్ట్రాతో భజన కార్యక్రమం శ్రీకాళహస్తి, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి): శ్రీకాళహస్తిలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో రేపు (శుక్రవారం, అక్టోబర్ 9) నిర్వహించనున్న విశేష మండల పూజా కార్యక్రమాల నిమిత్తం ప్రముఖ గురుస్వామి రాజు గురుస్వామి గురువారం పట్టణానికి విచ్చేసారు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప సేవా బృందం, భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో రేపు ఉత్తరా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని 41వ రోజు కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శబరిమల మేయిల్ శాంతి శ్రీ శంకర నంబూద్రి చేతుల మీదుగా స్వామివారి విగ్రహాభిషేకం, సువర్ణ హస్తాలపై విశేష పడిపూజ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనున్నాయి. రాత్రి వేళ చంద్రగిరి అశోక్ స్వామి భజన బృందం ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రాతో కూడిన ప్రత్యేక భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేపు జరగనున్న ఈ వేడుకల్లో మాలధారణ చేసిన స్వాములు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని మురళి గురుస్వామి, ఆలయ భక్త బృందం విజ్ఞప్తి చేశారు.

చిత్తూరు

కల్లూరు ఘాట్‌లో ఘనంగా గురుదక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు

గురువారం సందర్భంగా శాస్త్రోక్తంగా హోమం, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు రాజశేఖర్ శర్మ) కల్లూరు, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి): కల్లూరు ఘాట్ పరిధిలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు గురుదక్షిణామూర్తి ఆలయంలో గురువారం ఉదయం విశేష పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. గురువార పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేష హోమ మహోత్సవాన్ని నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివార్లకు పుష్పాలంకరణ చేసి మహామంగళహారతి ఇచ్చారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్

పద్మావతి జూనియర్ కళాశాలలో ఘనంగా వినాయక చవితి పూజ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్థానిక పద్మావతి జూనియర్ కళాశాలలో వినాయక చవితి పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మరియు హాస్టల్ విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుని ప్రార్థించారు. ఉపాధ్యాయులు సైతం భక్తి నిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ –“వినాయక చవితి పండుగ మనందరికీ శుభ ప్రారంభానికి సంకేతం. విఘ్నేశ్వరుని ఆరాధనతో మన మార్గంలోని అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు ఈ పండుగ ద్వారా శ్రద్ధ, క్రమశిక్షణ, సద్గుణాలను అలవరచుకోవాలి. గణనాథుని ఆశీస్సులు అందరి జీవితాల్లో సుఖశాంతులు, విజయాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను” అన్నారు.పూజా కార్యక్రమం అనంతరం విద్యార్థులకు ప్రసాదం పంపిణీ చేశారు