పట్రపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం
గురుమూర్తి ఆధ్వర్యంలో నేత్రపర్వంగా విశేష పూజలు, అలంకరణ) సోమల, పట్రపల్లిలో అక్టోబర్ 12 (భాను ప్రసాద్ నాయుడు పున్నమి న్యూస్ ప్రతినిధి): సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ పరిధిలోని పట్రపల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా సోమవారం అమ్మవారు భక్తులకు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి దివ్యాలంకారంలో దర్శనమిచ్చారు. స్థానిక ప్రముఖులు గురుమూర్తి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు, మహా మంగళహారతులు నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలతో అమ్మవారిని నయనానందకరంగా అలంకరించారు. ఈ సందర్భంగా గ్రామం ఆధ్యాత్మిక శోభతో పునీతమైంది. పట్రపల్లితో పాటు పరిసర గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.





