Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్థానిక ఎన్నికల వేళ.. కాకాణితో మేకపాటి కీలక భేటీ!

నెల్లూరు లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి సమావేశమయ్యారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణిని ఆయన నివాసంలో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఎన్నికలు, పార్టీ బలోపేతం తదితర కీలక అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఎన్నికల అంశాలకు ప్రాధాన్యం లభించింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన ఆటో డ్రైవర్ అరెస్టు

కానిస్టేబుల్‌ను ఆటోతో ఢీకొట్టి, విధుల నిర్వహణకు ఆటంకం కలిగించిన ఆరోపణలపై ఆటో డ్రైవర్‌ను నవాబుపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యలను ఏఎస్పీ దీక్ష వివరించారు. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడిస్తూ, కేసుకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కూడళ్లకు కొత్త సొబగులు

నెల్లూరు నగర సుందరీకరణలో భాగంగా ప్రధాన కూడళ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని 14 కూడళ్లలో ఐలాండ్లు, ఫౌంటెన్ల అభివృద్ధికి రూ.5.26 కోట్లు కేటాయించారు. శనివారం మంత్రి పొంగూరు నారాయణ ఫౌంటెన్ పనులకు శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నగరంలోని ముఖ్య కూడళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ద్వారా నెల్లూరుకు మరింత సుందర రూపం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో రెండు నవలల ఆవిష్కరణ:డాక్టర్ కనుపూరు శ్రీనివాసులురెడ్డి

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, కథా–నవలా రచయిత డాక్టర్ కనుపూరు శ్రీనివాసులురెడ్డి రచించిన రెండు నవలల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరు దర్గామిట్ట రిత్విక్ ఎన్‌క్లేవ్‌లోని శ్రీ వేంకటేశ్వర విద్యాలయంలో సాహితీవేత్తలు, రచయితలు, పాఠకుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. సాహిత్యాభిమానులు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు ప్రత్యేకంగా కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు రూరల్‌లో ₹857 కోట్ల అభివృద్ధి: కోటంరెడ్డి

కూటమి ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.857 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ పరిధిలోని 36 డివిజన్లకు రూ.109 కోట్లు మంజూరయ్యాయని, వీటితో 625 అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలో నెల్లూరు నగర కార్పొరేషన్‌కు మరో రూ.300 కోట్ల నిధులు తీసుకురావడానికి మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆమంచర్లలో పారిశ్రామికవాడకు 500 ఎకరాలు, నరసింహకొండకు కేంద్ర నిధుల సాధనలో కలెక్టర్ హిమాన్షు శుక్లా సహకారం కీలకమన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

లారీ బీభత్సం: నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు

​”నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద అతివేగంతో వెళ్తున్న లారీ రెండు బైకులను, ఒక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి.”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆమంచర్లలో 500 ఎకరాల్లో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఆమంచర్ల వద్ద సుమారు 500 ఎకరాల్లో భారీ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి యువరాజ్ IAS శనివారం మధ్యాహ్నం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

10వ డివిజన్‌లో ప్రజా సమస్యలు తెలుసుకున్న అడిషనల్ కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ హిమబిందు శుక్రవారం 10వ డివిజన్ ఎన్‌డీఆర్ లేఅవుట్‌లోని అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులతో సమావేశమయ్యారు. డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్య సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హిమబిందు తెలిపారు. అధికారులు సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జ్ తిరుమల నాయుడు, శానిటరీ సూపర్‌వైజర్ షరీఫ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దోమల రహిత నెల్లూరే లక్ష్యం: నారాయణ

నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలో నిలిచిపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను తిరిగి ప్రారంభించామని, 2027 జూన్ 12 నాటికి వాటిని పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 13వ డివిజన్ యలమవారిదిన్నెలో ₹35 లక్షలతో పునర్నిర్మించిన స్వర్ణ వార్డు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అల్లీపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలువాయిలో తిరుపతి జిల్లా డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ పోలింగ్ స్టేషనులు పరిశీలన

సర్ పక్రియ లో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో తిరుపతి జిల్లా డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ పోలింగ్ స్టేషన్ లను పరిశీలించారు, అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సర్ పక్రియ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు 32వేల 323 ఓట్ల కు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు, వాటిలో ఇప్పటి వరకు 19 వేల 770 అప్లికేషన్ లను పరిశీలించడం జరిగిందన్నారు, 12 వేల 550 అప్లికేషన్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు,ఓటర్లు మీకు ఇచ్చిన నోటీసుల కు జతగా సరైన డాక్యుమెంట్స్ అదికారుల దగ్గరకు తీసుకోని వెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు, అవకాశం లేని వాళ్లకు పర్చూవల్ గా అయినా హాజరు అయ్యేందుకు అవకాశం కల్పించారాని తెలిపారు, ఈ కార్యక్రమం లో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. Uploaded Video: