Monday, 17 August 2026

Tag: గండేపల్లి

తూర్పు గోదావరి

కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సంక్షేమం

*కూటమి ప్రభుత్వంలోఅభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గండేపల్లి లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు…* కాకినాడ, గండేపల్లి, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 17 :రాష్ట్ర అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు వ్యాఖ్యానించారు. సోమవారం గండేపల్లి గ్రామంలో గ్రామ టిడిపి అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండేళ్ల కూటమి ప్రభుత్వం నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో పోతుల మోహన రావుముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మొదటగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేసి ప్రజల నుంచి సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహనరావు మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. సామాజిక భద్రతా పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, దీపం 2 పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలితే కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. గత రెండేళ్లలో గండేపల్లి గ్రామంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు రైతులకు , ఆటో డ్రైవర్లకు 15000అందజేయడం, సామాజిక పెన్షన్ లు4000, దివ్యాంగులకు 6000, 10000, 15000 తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 13000 అందజేయడం జరిగిందన్నారు. గ్రామంలో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, సీసీ ట్రైన్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పరుగులు పెడుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో వెంపాటి రాజు, ఆళ్ల సత్తిబాబు, ఇప్పర్ల సురేష్, పైల వెంకన్న, చిటికెల కన్నబాబు, ముంగర సూర్యరావు, తణుకు వీర వెంకట సత్యనారాయణ, ఇనుపకోళ్ల సంజీవయ్య, పెనుగాడి నాగరాజు, నాళం వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.