Saturday, 12 September 2026

Tag: ఎడ్యుకేషన్

BHUPALPALLE

సింగరేణి కాలరీస్ హైస్కూల్, భూపాలపల్లిలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

భూపాలపల్లి సింగరేణి కాలరీస్ హైస్కూల్‌లో శనివారం టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పి. విశ్రాంత్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పి. విశ్రాంత్ గారు ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి సూచనలు, సలహాలను పాటించాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ డి. నాంచారయ్య గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల కృషిని గుర్తించి, మంచి ఫలితాలు సాధించడం ద్వారా వారికి గౌరవం తీసుకురావాలని అన్నారు. టీచర్స్ డే సందర్భంగా పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంలో విశేషంగా కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ (SCES) తరఫున క్యాష్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల అంకితభావం, కృషి మరియు నిరంతర శ్రమను ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్యార్థుల ఉత్తమ ఫలితాల వెనుక ఉపాధ్యాయుల కృషి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయుల పట్ల తమ గౌరవాన్ని చాటుకుంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. టీచర్స్ డే వేడుకలు పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పనిచేస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

BHUPALPALLE

స్వయం పరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్

భూపాలపల్లి: సెప్టెంబర్ 5( పున్నమి ప్రతినిధి) బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్, భూపాలపల్లి నందు స్వయం పరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మరియు ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు వివిధ విభాగాల బాధ్యతలను స్వీకరించి ఒక రోజు పాటు పాఠశాల పరిపాలనను నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా, వివిధ శాఖల బాధ్యులుగా వ్యవహరిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తరగతులను నిర్వహించడం, విద్యార్థులకు పాఠాలు బోధించడం, క్రమశిక్షణను పర్యవేక్షించడం, పాఠశాల కార్యకలాపాలను సమన్వయం చేయడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు పరిపాలనా విధానాలు, బాధ్యతలు మరియు నాయకత్వం గురించి ప్రత్యక్ష అనుభవాన్ని అందించింది.ఈ సందర్భంగా బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, “విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు ఆచరణాత్మక జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రజినీకాంత్ మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వయం పరిపాలనా దినోత్సవం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే నాయకులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

BHUPALPALLE

భూపాలపల్లి ఎస్ ఆర్ డిజి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణ

భూపాలపల్లి: సెప్టెంబర్ 5: పున్నమి ప్రతినిధి: ఎస్ ఆర్ డిజి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. పాఠశాల ప్రిన్సిపల్ రసజ్ఞగా వ్యవహరించి, పదో తరగతి విద్యార్థి ఉపాధ్యాయుల పాత్రను పోషించారు. అన్ని సబ్జెక్టులను విద్యార్థులకు బోధించడం కార్యక్రమంలో ప్రధాన అంశంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నట్లు, ఆయన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను అధిరోహించిన విషయాన్ని వివరించారు. రాధాకృష్ణ గారు గొప్ప తత్వవేత్తగా ఉందని, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేవారిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

BHUPALPALLE

L. Lalitha Assumes Role as New Education Officer in Jayashankar Bhupalpally

Jayashankar Bhupalpally: L. Lalitha took charge as the new Education Officer of the district. On Tuesday, she respectfully met District Collector Rahul Sharma at the ID OC office’s Collector Chamber and presented him with a bouquet. The meeting marked the official handover of responsibilities in the education department, signifying a formal start to L. Lalitha’s tenure under the supervision of District Collector Rahul Sharma.

జయశంకర్ భూపాలపల్లి

బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు:-

భూపాలపల్లి, ఆగస్టు 29: బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత హాకీ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల ప్రాముఖ్యత, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించారు. వివిధ క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థులను ఉత్సాహంగా పాల్గొనేలా ప్రోత్సహించారు. స్థానిక ప్రిన్సిపాల్ రజినీకాంత్ మాట్లాడుతూ, “విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరం. క్రీడలు నాయకత్వ లక్షణాలను, ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను పెంపొందిస్తాయి” అని పేర్కొన్నారు.అలాగే మా పాఠశాల లో విద్యతో పాటు సహా పాఠ్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. *“క్రీడలతో ఆరోగ్యం – క్రీడలతో విజయం”* అనే సందేశంతో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

జయశంకర్ భూపాలపల్లి

ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ సంబరాలు

స్థానిక ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు విద్యార్థులకి రాఖీ కట్టి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమాని ఉద్దేశిస్తూ పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం కృష్ణ చైతన్య మాట్లాడుతూ అన్నా చెల్లెలు అక్క తమ్ముల అనుబంధానికి ప్రతిరూపకంగా సోదరి సోదరునికి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రేమతో కట్టే పట్టియే రాఖీ అని దీనినే రక్షాబంధన్ అని అంటారని రక్ష అంటే రక్షణగా బంధన్ అంటే బంధంగా కలకాలం ఉండేదని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు రాఖి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

జయశంకర్ భూపాలపల్లి

ఎస్ ఆర్ డి జి స్కూల్లో ఘనంగా ఇన్వెస్టిట్యూర్ వేడుకలు

భూపాలపల్లి, ఆగస్టు 20: (పున్నమి ప్రతినిధి): భూపాలపల్లిలోని ఎస్ ఆర్ డి జి స్కూల్లో ఇన్వెస్టిట్యూర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ బాధ్యతల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక మంచి నాయకుడికి క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైన ప్రవర్తన, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, ఇతరులను గౌరవించే గుణం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి లక్షణాలు ఎంతో అవసరమని తెలిపారు. నాయకత్వం అంటే కేవలం అధికారం కాదని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవడమే నిజమైన నాయకత్వమని విద్యార్థులకు సూచించారు. అనంతరం నూతనంగా ఎంపికైన విద్యార్థి నాయకులకు అధికారికంగా సాష్‌లు (Sashes) ధరింపజేసి, వారి బాధ్యతలను అప్పగించారు. విద్యార్థి నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో, నిబద్ధతతో నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలను పెంపొందించేలా ఉత్సాహభరితంగా సాగింది. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని నూతన విద్యార్థి నాయకులకు అభినందనలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.