Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

SIR ప్రక్రియపై కుతుకులూరులో సమీక్ష BLA-2లు, ముఖ్య నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే నల్లమిల్లి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
SIR ప్రక్రియపై కుతుకులూరులో సమీక్ష BLA-2లు, ముఖ్య నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే నల్లమిల్లి

కుతుకులూరు, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): SIR ప్రక్రియ రెండో దశ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కుతుకులూరులో శనివారం BLA-2లు, ముఖ్య నాయకులతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో SIR ప్రక్రియ పురోగతిపై ఎమ్మెల్యే నల్లమిల్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండో దశలో చేపట్టిన కార్యక్రమాల ప్రస్తుత స్థితిగతులు, గ్రామాల వారీగా ఎదురవుతున్న సమస్యలు, పూర్తి చేయాల్సిన పనులపై నాయకులు, BLA-2లతో చర్చించారు.

SIR ప్రక్రియకు సంబంధించి కార్యకర్తలకు ఉన్న సందేహాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి వాటిపై వివరణ ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు. తుది దశలో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా డోర్‌టు డోర్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసిన గ్రామాల నాయకులను నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి వేదికపైకి పిలిచి అభినందించారు.

సమావేశంలో BLA-2లు, గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SIR ప్రక్రియపై కుతుకులూరులో సమీక్ష BLA-2లు, ముఖ్య నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే నల్లమిల్లి

SIR ప్రక్రియపై కుతుకులూరులో సమీక్ష BLA-2లు, ముఖ్య నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే నల్లమిల్లి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *