Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ భవానిపురం గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విజయవాడ భవానిపురం గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

*విజయవాడ భవానీపురంలో ‘డూండి’ గణపతి నవరాత్రి ఉత్సవాలు*

*72 అడుగుల మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్*

విజయవాడ: విజయవాడ భవానీపురంలో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణహితంగా రూపొందించిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహా గణపతి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కమిటీ సభ్యులతో మంత్రి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డూండి గణేష సేవా సమితి వ్యవస్థాపకులు డూండి రాకేష్, ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, డూండి గణేష సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

విజయవాడ భవానిపురం గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

విజయవాడ భవానిపురం గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *