Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
గూడూరు

Harikrishna

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
Harikrishna

కాశీపురం లో సామూహిక అక్షరాభ్యాసం
అంగనవాడి కేంద్రం చిన్నారులతో పలకలు
బలపాలు పంపిణీ
హోమియో మందుల పంపిణీ
పున్నమి న్యూస్ వాకాడు హరికృష్ణ జులై 13
తిరుపతి జిల్లా వాకాడు మండలం కాశిపురం దళితవాడలోని అంగనవాడి కేంద్రం వద్ద సోమవారం నెల్లూరు జిల్లా కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రాధాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం
ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాశీపురం లోనే అంగనవాడి కేంద్రం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా అంగనవాడి కేంద్రంలోనే చిన్నారులకు అవసరమైన పలకలో బలపాలను ఏవే రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు.
తదుపరి వారిచే హిందూ సంప్రదాయానికి అనుగుణంగా సామూహిక అక్షర వ్యాసం కార్యక్రమం నిర్వహించారు.
తదుపరి గ్రామస్తులకు అంగనవాడి కేంద్రం చిన్నారులకు చికెన్ ఫాక్స్ అమ్మవారు సోకకుండా అవసరమైన ముందస్తు హోమియో మందులను ఫౌండేషన్ నిర్వాహకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి అంగన్వాడి కేంద్ర నిర్వాహకులు ఝాన్సీ నేలమ్మ గీత గ్రామస్తులు పాల్గొన్నారు.

Harikrishna

Leave a comment

Your email address will not be published. Required fields are marked *