Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

పదవులకు వీడ్కోలు.. ప్రజాసేవకు కాదు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పదవులకు వీడ్కోలు.. ప్రజాసేవకు కాదు!

వార్త ముఖ్యాంశాలు

  • ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఘన సత్కారం పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) అచ్యుతాపురం: ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న అచ్యుతాపురం మండల పరిషత్ అధ్యక్షురాలు కోన సంధ్య బుజ్జి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కో-ఆప్షన్ సభ్యులను ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా…
  • 2021–2026 పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులకు పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
  • ఎంపీడీవో చైతన్య, మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్ ఎం.

ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఘన సత్కారం

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

అచ్యుతాపురం: ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న అచ్యుతాపురం మండల పరిషత్ అధ్యక్షురాలు కోన సంధ్య బుజ్జి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కో-ఆప్షన్ సభ్యులను ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. 2021–2026 పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులకు పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో చైతన్య, మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్ ఎం. యశ్వంత్, మాజీ జెడ్పీటీసీ లాలం రాంబాబు, కో-జెడ్పీటీసీ నర్మాల కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు, కోన బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు భావోద్వేగానికి గురయ్యారు. “పదవికి మాత్రమే విరమణ.. ప్రజాసేవకు మాత్రం విరమణ లేదు” అంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఎంపీపీ కోన సంధ్య బుజ్జి మాట్లాడుతూ ఐదేళ్లపాటు తనకు సహకరించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో తన అనుబంధం ఎల్లప్పుడూ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *