Saturday, 25 April 2026

Blog

హైదరాబాద్

వృద్ధాప్యంలో బలమైన ఆరోగ్యం ఒక ఆశ్చర్యం

వృద్ధాప్యంలో బలమైన ఆరోగ్యం సాధించడం జీవితశైలిపై ఆధారపడుతుంది. సమతుల ఆహారం, తేలికపాటి వ్యాయామం, నియమిత నిద్ర శరీర సామర్థ్యాన్ని నిలుపుతాయి. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచడం ముఖ్యం. మానసిక చురుకుదనం కోసం పఠనం, సామాజిక సంబంధాలు ఉపయోగకరం. నియమిత ఆరోగ్య పరీక్షలు సమస్యలను ముందుగానే గుర్తిస్తాయి. ధూమపానం, మద్యపానం నివారణ దీర్ఘాయుష్షుకు దోహదం చేస్తాయి. సానుకూల దృక్పథం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకర అలవాట్లు వృద్ధాప్యాన్ని సంతోషకరంగా మార్చుతాయని World Health Organization సూచిస్తుంది.

హైదరాబాద్

ఎయిడ్స్ వల్ల అవయవ నష్టం

ఎయిడ్స్‌కు కారణమైన HIV వైరస్ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఫలితంగా శరీరం సంక్రమణలు, క్యాన్సర్లకు సులభంగా గురవుతుంది. ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం, జీర్ణవ్యవస్థ వంటి ముఖ్య అవయవాల పనితీరు దెబ్బతినవచ్చు. దీర్ఘకాలంలో బరువు తగ్గడం, అలసట, తరచూ జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. యాంటిరెట్రోవైరల్ చికిత్సను సమయానికి ప్రారంభించడం ద్వారా అవయవ నష్టాన్ని తగ్గించవచ్చు. నియమిత వైద్య పర్యవేక్షణ, పోషకాహారం ఆరోగ్యాన్ని కాపాడతాయి. అవగాహన, ముందస్తు పరీక్షలు వ్యాధి నియంత్రణకు కీలకమని World Health Organization సూచిస్తుంది.

హైదరాబాద్

పెంపుడు జంతువులు మరియు భావోద్వేగ ఆరోగ్యం

పెంపుడు జంతువులు మన భావోద్వేగ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. వాటితో గడిపే సమయం ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని పెంచుతుంది. పిల్లలు, వృద్ధుల్లో ఒంటరితనాన్ని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. జంతువుల సంరక్షణ బాధ్యత భావాన్ని పెంపొందిస్తుంది. నడక, ఆటల ద్వారా శారీరక చురుకుదనం కూడా పెరుగుతుంది. పరిశుభ్రత, నియమిత టీకాలు జంతువుల ఆరోగ్యానికి అవసరం. మానవ-జంతు అనుబంధం మానసిక శ్రేయస్సుకు దోహదమని World Health Organization పేర్కొంటుంది. ప్రేమ, సహచర్యం ఆరోగ్యకర జీవితానికి ముఖ్యమైన భాగాలు.

హైదరాబాద్

ఆహారం మరియు శారీరక వ్యాయామం అవసరం

సమతుల ఆహారం, క్రమం తప్పని శారీరక వ్యాయామం ఆరోగ్యానికి తప్పనిసరి. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం శరీరానికి శక్తి, రోగనిరోధక శక్తి అందిస్తుంది. నడక, యోగా, క్రీడలు గుండె, కండరాలు, ఎముకలను బలపరుస్తాయి. అధిక బరువు, మధుమేహం, రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. తగినంత నీరు, విశ్రాంతి కూడా అవసరం. ఆరోగ్యకర అలవాట్లు దీర్ఘకాల శ్రేయస్సుకు పునాది అవుతాయని World Health Organization సూచిస్తుంది. కుటుంబంతో కలిసి వ్యాయామం చేయడం ప్రేరణను పెంచుతుంది.

E-పేపర్

హైదరాబాద్‌లో పలు చోట్ల వడగాల వాన – ప్రజలు అప్రమత్తం ఉండాలని అధికారులు సూచన

హైదరాబాద్‌లో పలు చోట్ల వడగాల వాన – ప్రజలు అప్రమత్తం ఉండాలని అధికారులు సూచన పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 25 మార్చి 2026 హైదరాబాద్‌లో పలు చోట్ల వడగాల వాన – ప్రజలు అప్రమత్తం! హైదరాబాద్ నగరంలో ఈ రోజు పలుచోట్ల ఆకస్మికంగా వడగాల వాన కురిసింది. ఉదయం వరకు ఎండలు మండిపోతుండగా, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలమైన గాలులతో పాటు వాన పడటంతో రోడ్లపై ప్రయాణం కష్టమైంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం జరిగింది. వర్షంతో కొంత ఉపశమనం లభించినా, గాలుల తీవ్రత వల్ల ప్రజలు ఇబ్బందులు…. అధికారులు ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

E-పేపర్

హైదరాబాద్‌లో పలు చోట్ల వడగాల వాన – ప్రజలు అప్రమత్తం! అధికారులు సూచన

హైదరాబాద్‌లో పలు చోట్ల వడగాల వాన – ప్రజలు అప్రమత్తం! అధికారులు సూచన పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 25 మార్చి 2026 హైదరాబాద్‌లో పలు చోట్ల వడగాల వాన – ప్రజలు అప్రమత్తం! హైదరాబాద్ నగరంలో ఈ రోజు పలుచోట్ల ఆకస్మికంగా వడగాల వాన కురిసింది. ఉదయం వరకు ఎండలు మండిపోతుండగా, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలమైన గాలులతో పాటు వాన పడటంతో రోడ్లపై ప్రయాణం కష్టమైంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం జరిగింది. వర్షంతో కొంత ఉపశమనం లభించినా, గాలుల తీవ్రత వల్ల ప్రజలు ఇబ్బందులు…. అధికారులు ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎం చంద్రబాబు పర్యటనకు వింజమూరులో విస్తృత ఏర్పాట్లు – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమీక్ష

వింజమూరు మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన వింజమూరు మండల కేంద్రంలో ఏప్రిల్ 1న జరగనున్న “రైతన్న మీ సేవలో” కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమగ్రంగా పరిశీలించారు. పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు సభా ప్రాంగణం, వేదిక నిర్మాణం, హెలిపాడ్, ప్రజల రాకపోకల సౌకర్యాలు, పార్కింగ్, త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల , జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు , ఆర్‌డీవోలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ, సీఎం పర్యటనలో ఎలాంటి అంతరాయాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమం విజయవంతం కోసం అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శేష వాహన సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే – భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు

కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలో శ్రీ సీతారాముల స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శేష వాహన సేవలో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగు పరిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, సమయానికి వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు కోరుకున్నారు.

సూర్యాపేట

ఖాళీ కుర్చీల దర్శనం. హుజూర్ నగర్ ఎం.ఈ.ఓ కార్యాలయం..? అధికారులు ఎక్కడ.. అటెండర్లే దిక్కా..? ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు.. పర్యవేక్షణ శూన్యం..!

ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల సమస్యలు తీర్చడానికి ఉండాలి, కానీ హుజూర్ నగర్‌లోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం మాత్రం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఎన్ఎస్పీ క్యాంప్ పరిధిలో ఉన్న ఈ ఆఫీసులో అధికారుల జాడ లేక, కేవలం ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిస్తుండటంతో స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి ఏ పని మీద వెళ్లినా అధికారులు సీట్లలో ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఆఫీసు మొత్తం మీద కేవలం ఒక అటెండర్, డెప్యుటేషన్ మీద ఉన్న మరో సిబ్బంది తప్ప మరెవరూ కనిపించని పరిస్థితి. అసలు ఈ కార్యాలయంలో ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నారు? ప్రభుత్వం జీతాలు ఇస్తుంది కుర్చీలకు, బల్లలకా లేక విధి నిర్వహణలో లేని ఉద్యోగులకా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శలు వస్తున్నాయి.ఒకవైపు కార్యాలయం ఇలా ఉంటే, మరోవైపు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే, జూన్‌లో ప్రారంభం కావాల్సిన వచ్చే ఏడాది పాఠ్యపుస్తకాల అమ్మకాలను ఇప్పుడే మొదలుపెట్టాయి. ఈ దోపిడీని అరికట్టాల్సిన ఎంఈఓ కార్యాలయం మౌనం వహించడం వెనుక ఉన్న మర్మమేంటని పేరెంట్స్ కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మేము మా సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఆఫీసులో ఒక్క అధికారి కూడా ఉండరు. అసలు అధికారులు ఏ సమయంలో అందుబాటులో ఉంటారో చెబితే ఆ టైమ్‌కే వస్తాం,” అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పుస్తకాల అమ్మకాల వెనుక, కార్యాలయ గైర్హాజరీ వెనుక అధికారుల వాటాల హస్తం ఉందా అనే అనుమానాలను ప్రజా సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి, హుజూర్ నగర్ ఎంఈఓ కార్యాలయం తీరును మార్చాలని, విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.