Tuesday, 10 March 2026

Blog

వనపర్తి

మనిగిళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఇన్స్పెక్షన్ టీం

*మనిగిల్ల ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఇన్స్పెక్షన్ టీం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 29/ 01/2026* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనిగిల్ల, పెద్దమందడి మండలం, ఈరోజు పాఠశాలను జిల్లా ఇన్స్పెక్షన్ టీం సందర్శించడం జరిగింది అందులో ఆరవ తరగతి హిందీ రఫీ గారి బోధన అభ్యసన ప్రక్రియలను సందర్శించడం రికార్డులను తనిఖీ చేయడం పిల్లల్లో ద్విత్వాక్షర, సంయుక్తాక్షరముల పరిచయం, పిల్లలు హిందీ భాషలో ఆత్మ పరిచయం మొదలగు అభ్యసన ప్రక్రియ ద్వారా యాక్టివిటీస్ బోధన పద్ధతి ద్వారా హిందీ సులభంగా నేర్చుకోవచ్చని హిందీ రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయ కుమార్ తెలియజేశారు. అలాగే రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి కష్టపడి హిందీ భాష నైపుణ్యాలను పెంపొందించుకొని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.*

ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యి కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన వైసిపి :పెడన MLA కాగితకృష్ణప్రసాద్

గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఆర్థికపరం గా దోచుకోవడమే కాకుండా తిరుమల లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి కలిపి ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడిందని తీవ్ర విమర్శలు చేశారు పెడన MLA కాగిత కృష్ణప్రసాద్. బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాం లో లడ్డు ప్రసాదం లో 1.6కోట్ల కిలోల కల్తీ నెయ్యి కలిపి 235 కోట్ల అవినీతి చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో తీవ్ర చెలగాటం ఆడారని, దేశ వ్యాప్తం గా శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆట్లాడుకున్నారని ఆయన తెలియచేసారు.ఇప్పటికైనా జగన్మోహనరెడ్డి స్వామి వారిని వేడుకొని క్షమాపణ కోరాలని, ఆయన హితవు పలికారు. అలాగే వైసీపీ నాయకులు తిరుమల కొండ పై కాలీ బాటిల్స్ తీసుకువెళ్లి కొండ పై ఎదో జరిగిపోతుందని, ఇంతకు ముందులా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని అవన్నీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదని ఆయన తెలియపరిచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామo రోడ్డు ప్రారంభం

దుత్తలూరు మండలం తురకపల్లి నుంచి బైరవరం వరకు రోడ్డు నిర్మాణం చెపట్టారు అటుగా వెళ్లే ప్రయాణికులు,ఆ గ్రామం ప్రజలు ఎన్నో ఏళ్లుగా రోడ్డు కోసం.ఎదురుచూస్తున్నoదుకు కళ నెరవేరిందని చిన్న, పెద్ద తేడా లేకుండా రోడ్డు వేసిన అధికారులుకు వారు ధన్యవాదములు తెలిపారు అనఁతరo వారు హర్షo వ్యక్తo చెందారు

E-పేపర్

ఆంధ్ర టు తెలంగాణ ఇసుక అక్రమ దంద

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యః పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్న జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి ఫణిభూషణ్ రెడ్డి వారి ఆధ్వర్యంలో రవాణా శాఖకు చెందిన సాయంకేతిక సిబ్బంది స్థానిక రెవిన్యూ మరియు పోలీస్ శాఖ బృందాలతో కలిపి దేవరపల్లి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగినది అని భూగర్భ శాఖ అధికారి ఫణి భూషణ్ రెడ్డి తెలియజేశారు ఇతనికి సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏపీ 39 యు ఈ 4149 మరియు ఏపీ 39 యు బి 8555 నెంబర్లతో ఉన్న రెండు లారీలు గుర్తించి తనిఖీ చేయడం జరిగిందన్నారు వాహనాల డ్రైవర్లు చూపమని అడగగా తమ వద్ద ఇటువంటి బిల్లులు లేవని తెలిపారు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయ రికార్డు పరిశీలనలో రెండు వాహనాలు అంతర్రాష్ట్ర ఇసుక అక్రమ రవాణా కార్య కలాపాలలొ పాల్గొన్నట్లు నిర్ధారణ రావటంతో తెలంగాణ రాష్ట్రంలో ఆయా వాహనాలపై ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. వాహనాలను బ్లాక్ చేయడం జరిగింది అనంతరం అక్రమ ఇసుక రవాణా చేసినందుకు తదుపరి చర్యలు నిమిత్తం సదురు రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని దేవరపల్లి పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది. ఈ వాహనాలపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. END

కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి నాయకులు సింహం గుర్తుతో బరిలోకి!

జాగృతి మహిళా అధ్యక్షురాలు బి.వసంత కామారెడ్డి, 28 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఉత్కం ఠ రేపోతుండగా, జాగృతి మహిళా అధ్యక్షురాలు బి.వసంత ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ మార్గదర్శకత్వంలో జాగృతి నాయకులు, మహిళలు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ సింహం గుర్తుపై పోటీ చేస్తున్నట్లు ప్రకటించా రు.మీడియా సమావేశంలోజిల్లా జాగృతి మహిళా అధ్యక్షురాలు బి.వసంత మాట్లాడుతూ, పలు వార్డుల్లో మా అభ్యర్థులు సింహం గుర్తుతో బలంగా పోటీ పడుతామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం మా నాయకులు కట్టు బడి పోరాటం చేస్తారని స్పష్టం చేశారు.ఈ ఎన్నిక ల్లో పట్టణ ప్రజల అంచనాలనం అంగీకరిస్తూ, స్థాని క సమస్యలపై దృష్టి పెట్టి పోటీ చేస్తామని ధైర్యంగా ప్రకటించారు.ఈ కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్, జిల్లా రైతు అధ్యక్షుడు రాజు, మహిళా ఉపాధ్యక్షు రాలు శమంత, జాగృతి స్టూడెంట్ అధ్యక్షులు రాజేష్, రాము, శివ, వినోద్, అఫ్రిన్, కౌన్సిలర్ అభ్య ర్థి కురుమ సతీష్, మమత బేగం, ప్రియాంక, నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎ వీ జీ ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి – గణేష్*

*సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎ వీ జీ ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి – గణేష్* *21వ రోజు ఫంక్షన్‌లో రూ. 2016/- ఆర్థిక సహాయం* జనం న్యూస్ ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: 28 జనవరి 2026 మోటే మహేష్ దంపతులకు పాప (కూతురు) జన్మించిన శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటి ఆనందాన్ని తనదిగా భావిస్తూ **సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎ వీ జీ ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి – గణేష్**, నూతనంగా ప్రవేశపెట్టిన **మహాలక్ష్మి పథకం** ద్వారా మహేష్ పాప యొక్క **21వ రోజు ఫంక్షన్‌లో రూ. 2016/- ఆర్థిక సహాయం** అందించడం జరిగింది. ఇది మాటలకే పరిమితం కాని, చేతలతో చూపించే నిజమైన సేవా రాజకీయానికి స్పష్టమైన నిదర్శనం. ఈ కార్యక్రమంలో **మేడిపల్లి – నక్కర్త గ్రామ సర్పంచ్ సుగుణ – సంపత్**, **ఉప సర్పంచ్ దెంది మధుకర్ రెడ్డి **, **మాజీ సర్పంచ్ బాలరాజు గౌడ్ **, **మాజీ ఎంపీటీసీ మోటే శ్రీశైలం**, మరియు గ్రామ ప్రముఖులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. ప్రజల అవసరాలే అజెండాగా, మాటలకన్నా పనులకే ప్రాధాన్యం ఇస్తూ, పుట్టిన రోజు నుంచే ఒక ఆడబిడ్డ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా అమలవుతున్న ఈ మహాలక్ష్మి పథకం **సేవా భావనతో కూడిన బాధ్యతాయుత రాజకీయానికి దిశానిర్దేశం** చేస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి పునాది అవుతాయి. ప్రజలతో కలిసి, ప్రజల కోసమే పనిచేసే నాయకత్వం ఇదే అని మరోసారి నిరూపితమైంది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అతికారి పెద్దాయన వెంకటయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ని యోజకవర్గం సమాన్య కర్త శ్రీ అతికారి కృష్ణ అన్న రాజంపేట నియోజకవర్గం పి ఓ సీ శ్రీ అతికారి దినేష్ నాన్న జనసేన పార్టీ సీనియర్ నేత కీర్తి శేషులు అతికారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించార్, ఈ కార్యక్రమంలో మర్రిపాడు చిన్న జనసేన, మణి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా అగనంపూడి ఆర్టీఓ కార్యాలయ 9వ వార్షికోత్సవం

ఘనంగా అగనంపూడి ఆర్టీవో కార్యాలయం 9వ వార్షికోత్సవం… అగనంపూడి, జనవరి 28, పున్నమి ప్రతినిధి. వాహన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే మా ధ్యేయం ఆర్టీవో వి జయప్రకాష్ పీకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తీక్ మాట్లాడుతూ ఆర్టీవో అధికారులు క్రమశిక్షణ అంకితభావంతో పనిచేయడంతో స్కూల్ బస్సులు ట్రావెల్స్ ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారని అదే విధంగా విశాఖపట్నం జిల్లాలో వాహనాలు రద్దీకి అనుకూలంగా రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలని అన్నారు. అగనంపూడి లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్కరాజు గోవిందరాజు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాజువాక స్టీల్ సిటీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నెల్లి శ్రీనివాసరావు, టిడిపి సీనియర్ నాయకులు కొర్రాయి నాగార్జున, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స డిపి రంగారావు, ఎన్ శ్రీనివాస్, జి సత్యం నాయుడు, వై లలిత, జి సృజన ఆఫీస్ స్టాఫ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విందుల నర్సింగరావు (అందరివాడు) ముమ్మని అప్పారావు, ఎం శ్రీను, గొన్న తాతారావు, బొబ్బరి ప్రవీణ్ కుమార్, గోపిశెట్టి సత్య రావు, గొన్న గోపి, సలాది శ్రీనివాస, పినబాల మహేష్ తదితరులు పాల్గొనారు.

ఆంధ్రప్రదేశ్

గవర్నర్ చిత్రపటాన్ని బహూకరించిన మురళీమోహన్ రాజు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో విజయవాడ లోని లోక్ భవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ తేనేటి విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, యువ రచయిత, కవిరాజు మురళీమోహన్ రాజు పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మురళీమోహన్ రాజును గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చిత్రపటాన్ని మురళీమోహన్ రాజు చేతులమీదుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన పార్టీ క్యాలెండర్ అందజేసిన జనసేన పార్టీ ఆత్మకూరు

భారతీయ జనత పార్టీ మరియు అనఁతసాగరం మండలం నూతనమండలం అధ్యక్షులు గా ఎన్నికైనట్టు అల్లం పాటి సాంబ శివారెడ్డి ని మార్యద పూర్వకoగా కలిసి జనసేన పార్టీ క్యాలెండర్ అందజేసిన జనసేన పార్టీ నియోజకవర్గం ఆత్మకూరు ఉపధ్యక్షులు కంటే శ్రీనివాస్ హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ర్ వి రమణ రెడ్డీ ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నేత తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.