Tuesday, 10 March 2026

Blog

విశాఖపట్నం

అగనంపూడి జోన్ కి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి

అగనంపూడి జోన్ కి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి.. జెడ్స్ కి అఖిలపక్ష నాయకులు వినతి అగనంపూడి, జనవరి 29, పున్నమి ప్రతినిధి. అగనంపూడి జోనల్ కమిషనర్ మనిషా త్రిపాఠి ని జీవీఎంసీ 85 వార్డు టిడిపి అధ్యక్షులు కర్రి దశెంద్ర, ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు కలిసి శుక్రవారం జీవీఎంసీ లో జరిగే కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో విలీన గ్రామాలు అత్యధికం గా, జీవీఎంసీలో విస్తరణలో రెండో స్థానంలో ఉన్న అగనంపూడి జోనల్ కి అభివృద్ధి కొరకు ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. డొంకాడ నుండి అమ్మ అపార్ట్మెంట్, పెదమడక శివాలయం నుండి కొండయ్యవలస మరిడిమాంబ వరకు ఉన్న ప్రధాన రోడ్లు విస్తరణ, క్రీడ మైదానం, అగనంపూడి సిగ్నల్స్ నుండి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్డు విస్తరణ లైటింగ్ ఏర్పాటు నిమిత్తం, కొండయ్యవలస దానబోయినపాలెం మధ్య బొర్రమాంబ మాంబ గడ్డపై బ్రిడ్జి నిర్మాణం, సూది కొండ దిగుభాగం నివాస ప్రజలకు మంచినీటి కోళాయిలు ఏర్పాటు, జీవీఎంసీ 79, 85 వార్డుల అనుసంధానం గా ఉన్న అగనంపూడి స్మశాన వాటికలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు నిమిత్తం, అసంపూర్తిగా పూర్తిగా ఉన్న సామాజిక భవనాలను నిర్మాణం విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయాలని వినతి పత్రము అందజేయడం జరిగినది. జెడ్స్ మనిషా త్రిపాటి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన అగనంపూడి జోన్ కు అధికార పూర్వకంగా 8 జోన్ గా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని, అగనంపూడి జోన్ వార్డులు తక్కువైనప్పటికీ విస్తరణ ఎక్కువ అని ఈ జోన్ సిటీ జోన్ లో ఉన్న కంటే అభివృద్ధిలో వెనకబడి ఉండటం వాస్తవంని బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించమని ప్రతిపాదన చేస్తామని అదే విధంగా జీవీఎంసీ కి రెవెన్యూ సమకూర్చడంలో కూడా ప్రజలు సహకరించాలని హౌస్ టాక్స్, వెకెంట్ ల్యాండ్ టాక్స్, ట్రేడ్ టాక్సీలు కూడా నిర్ణీత టైంలో కట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరిసా రామచంద్రరావు, జనసేన పార్టీ నాయకులు బుదిరెడ్డి అప్పారావు, వైఎస్ఆర్సిపి నాయకులు బలిరెడ్డి శ్రీను, ఐఆర్సిహెచ్ అప్పారావు, బిజెపి నాయకులు కుమార్, టిడిపి నాయకులు గంతకోరు స్వరూప్, సిపిఐ నాయకులు సాయిన సన్యాసిరావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు,

కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలో బంగారం కొనుగోళ్లకు ‘నో స్టాక్.. నో బుకింగ్!’

కామారెడ్డి, 29 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి! జిల్లా పట్ట ణంలోని బంగారు షాపుల వద్దకు కస్టమర్లు ఆశల తో వెళ్తున్నారు, కానీ ‘నో స్టాక్.. నో బుకింగ్!’ అనే నినాదంతో తిరిగి వస్తున్నారు. ఒక్క రోజులో బంగారం రేట్లు గ్రాము 1000 వరకు పెరగడంతో షాపు యజమానులు స్టాక్‌లను దాచేసి, కొత్త బుకింగ్‌లకు దూరంగా పోయారు.పట్టణంలోని ప్రముఖ బంగారు దుకాణాల వద్ద కస్టమర్లు నిరాశలో మునిగారు. మా కుమార్తె వివాహానికి బంగారం కొనాలని వచ్చాం, కానీ రేట్లు ఎక్కువ అని స్టాక్ లేదని చెప్పారు. ఇక నెలల తరబడి ఎదురుచూడడమేనన్నారు!” సంతక్రాంతి మాసం లో సమయంలో ధరలు ఇంత పెరగడం బాధాక రం అంటున్నారు. షాపులు లాభాల కోసం కస్టమ ర్లను మోసం చేస్తున్నాయా?” అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా గోల్డ్ ట్రేడర్స్ అసోసియేషన్‌కు చెందిన ఒక యజమాని ప్రకారం, “అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత, ఇంపోర్ట్ ఖర్చులు పెరగడంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పు డు కొత్త స్టాక్ వచ్చే వరకు బుకింగ్ తీసుకోలేక పోతున్నాం అంటున్నారు. కస్టమర్ల అధిక డిమాం డ్‌కు సరిపడా సరఫరా లేదు” అని వివరించారు. పట్టణంలోని పెద్ద షాపుల్లో 22 క్యారెట్ గోల్డ్ గ్రామ్‌ కు ₹7,800 నుంచి ₹8,200 వరకు, 24 క్యారెట్‌కు ₹8,500 పైన టచ్ చేసింది.ఈ పరిస్థితి బంగారం కొనుగోళ్లకు ఆసక్తి కలిగిన మహిళలు, యువత మధ్య చర్చనీయాంశమైంది. కొందరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లిస్తున్నారు, కానీ నాటికీ ధరలు అందరికీ సరిపోకపోవడంతో స్థానిక షాపు లపైనే ఆశలు పెట్టుకున్నారు.ధరలు స్థిరపడే వరకు కస్టమర్లు ఎదురుచూడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం: రైతులకు తక్షణ చికిత్స మరియు నట్టల నివారణ మందులు అందజేత

అనకాపల్లి జిల్లా జనవరి 29 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : ఏటికొప్పాక గ్రామంలో ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 16 నుండి 31 వరకు ఉచిత పశు వైద్య శిబిరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ పశు వైద్య సేవల కొరకు నిర్వహించిన ఈ శిబిరంలో రోగ పశువులకు తక్షణ వైద్యం అందించడం ప్రధానంగా నిర్వహించబడింది. ఎ. డి డా CH. గంగాధర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన పశువులు రైతులకు అధిక పాల ఉత్పత్తి మరియు స్థిరమైన ఆదాయం ఇస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా గర్భకోష వ్యాధితో బాధపడుతున్న పశువులకు చికిత్సలు, దూడలకు నట్టల నివారణ మందులు రైతులకు పంపిణీ చేయబడ్డాయి. ఈ శిబిరంలో Dr. L. కన్నయ్య నాయుడు, వెటర్నరీ అసిస్టెంట్స్ సిబ్బంది, ఏటికొప్పాక గ్రామ సర్పంచ్ బజంత్రీల లక్ష్మీ, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, అన్నం బాబ్జి, గొంతు మూర్తి కొండయ్య నాయుడు, అన్నం సరోజిరావు వంటి కూటమి నాయకులు, అలాగే గ్రామీణ రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పశువుల ఆరోగ్య పరిరక్షణ, రైతుల సంక్షేమం మరియు గ్రామీణ పాలు ఉత్పత్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

హైదరాబాద్

గుండె ఆరోగ్యం: నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు

గుండె మన శరీరానికి ఇంజిన్ లాంటిది. కానీ గుండె ఆరోగ్యం పట్ల చాలామంది నిర్లక్ష్యం చూపిస్తారు. అధిక కొవ్వు ఆహారం, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి గుండె జబ్బులకు ప్రధాన కారణాలు. ప్రారంభ దశలో గుండె సమస్యలకు పెద్దగా లక్షణాలు కనిపించవు. ఛాతి నొప్పి వచ్చినప్పుడు మాత్రమే ఆసుపత్రికి వెళ్లడం చాలా ఆలస్యం అవుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయడం గుండెను బలంగా ఉంచుతుంది. ఉప్పు, నూనె వాడకం తగ్గించాలి. ధూమపానం, మద్యం గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయి. క్రమం తప్పకుండా బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులను చాలా వరకు నివారించవచ్చు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో పశు వైద్య ఆరోగ్య శిబిరాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశు వైద్య ఆరోగ్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా గురువారం మనుబోలు మండలంలోని కొలనకుదురు, వడ్లపూడ గ్రామాలలో శిబిరాలు నిర్వహించారు. కొలనకుదురులో పశు సంచాలకుల కార్యాలయం ఉపసంచాలకులు డా. వెంకట రామిరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 51 సాధారణ చికిత్సలు, 31 గేదెలకు గర్భకోస నివారణ, 36 గేదెలకు సూడి పరీక్షలు, 485 పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖమ్మం

గెలుపు మాదే… మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ధీమా – ఖమ్మం జిల్లాలో త్రిముఖ పోటీ!

ఖమ్మం జనవరి (పున్నమి దిన పత్రిక ఖమ్మం జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా రాజకీయ వాతావరణం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరింత వేడెక్కుతోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపుపై గట్టి ధీమాతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే కీలక పరీక్షగా మారాయి. అధికార కాంగ్రెస్ – పొత్తులపై దృష్టి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన వ్యూహంగా ముందుకు వెళ్తోంది. అదే సమయంలో తమ సంప్రదాయ మిత్ర పక్షాలు అయిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో (సీపీఐ, సీపీఎం) పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ పొత్తు సాధ్యమైతే పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలం మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ – అభివృద్ధే అస్త్రం ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం తమ పాలనా కాలంలో చేసిన అభివృద్ధినే ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. “అప్పుడు మా పాలన – నేడు కాంగ్రెస్ పాలన” అనే తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని, అదే తమకు అనుకూలంగా మారుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మున్సిపల్ సేవల పరంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను ప్రజల్లో గుర్తు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది. బీజేపీ – కూటమి రాజకీయాలు ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికలను తేలికగా తీసుకోవడం లేదు. పార్టీ తమ సహజ మిత్ర పక్షాలు అయిన తెలుగు దేశం, జనసేనలతో పొత్తు యోచనలో ఉంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు దేవకీ వాసుదేవారావు ఖమ్మం జిల్లాలోని టీడీపీ, జనసేన నాయకులతో సంప్రదింపులు జరుపుతూ కూటమి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కూటమి కార్యరూపం దాలిస్తే పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కొత్త ఉత్సాహం రావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఓటర్ల మనసులో ఏం ఉంది? ఈ ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధి, పాలన, స్థానిక సమస్యల పరిష్కారాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. నీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, పారిశుధ్యం, ఆస్తి పన్నులు వంటి అంశాలపై ఏ పార్టీ స్పష్టమైన హామీలు ఇస్తుందన్నదే కీలకంగా మారనుంది. త్రిముఖ పోటీ – ఎవరి విజయం? మొత్తం మీద ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే జరగనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తులు, స్థానిక నాయకుల బలం, ప్రజాభిప్రాయం… ఈ మూడు అంశాలే ఫలితాలను నిర్ణయించనున్నాయి. మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక పాలనకు మాత్రమే కాదు… రాబోయే రాష్ట్ర రాజకీయాల దిశను సూచించే సూచికగా మారనున్నాయా? అన్న ప్రశ్నకు సమాధానం ఓటర్ల చేతుల్లోనే ఉంది.

వనపర్తి

మనిగిళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఇన్స్పెక్షన్ టీం

*మనిగిల్ల ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఇన్స్పెక్షన్ టీం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 29/ 01/2026* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనిగిల్ల, పెద్దమందడి మండలం, ఈరోజు పాఠశాలను జిల్లా ఇన్స్పెక్షన్ టీం సందర్శించడం జరిగింది అందులో ఆరవ తరగతి హిందీ రఫీ గారి బోధన అభ్యసన ప్రక్రియలను సందర్శించడం రికార్డులను తనిఖీ చేయడం పిల్లల్లో ద్విత్వాక్షర, సంయుక్తాక్షరముల పరిచయం, పిల్లలు హిందీ భాషలో ఆత్మ పరిచయం మొదలగు అభ్యసన ప్రక్రియ ద్వారా యాక్టివిటీస్ బోధన పద్ధతి ద్వారా హిందీ సులభంగా నేర్చుకోవచ్చని హిందీ రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయ కుమార్ తెలియజేశారు. అలాగే రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి కష్టపడి హిందీ భాష నైపుణ్యాలను పెంపొందించుకొని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.*

ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యి కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన వైసిపి :పెడన MLA కాగితకృష్ణప్రసాద్

గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఆర్థికపరం గా దోచుకోవడమే కాకుండా తిరుమల లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి కలిపి ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడిందని తీవ్ర విమర్శలు చేశారు పెడన MLA కాగిత కృష్ణప్రసాద్. బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాం లో లడ్డు ప్రసాదం లో 1.6కోట్ల కిలోల కల్తీ నెయ్యి కలిపి 235 కోట్ల అవినీతి చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో తీవ్ర చెలగాటం ఆడారని, దేశ వ్యాప్తం గా శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆట్లాడుకున్నారని ఆయన తెలియచేసారు.ఇప్పటికైనా జగన్మోహనరెడ్డి స్వామి వారిని వేడుకొని క్షమాపణ కోరాలని, ఆయన హితవు పలికారు. అలాగే వైసీపీ నాయకులు తిరుమల కొండ పై కాలీ బాటిల్స్ తీసుకువెళ్లి కొండ పై ఎదో జరిగిపోతుందని, ఇంతకు ముందులా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని అవన్నీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదని ఆయన తెలియపరిచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామo రోడ్డు ప్రారంభం

దుత్తలూరు మండలం తురకపల్లి నుంచి బైరవరం వరకు రోడ్డు నిర్మాణం చెపట్టారు అటుగా వెళ్లే ప్రయాణికులు,ఆ గ్రామం ప్రజలు ఎన్నో ఏళ్లుగా రోడ్డు కోసం.ఎదురుచూస్తున్నoదుకు కళ నెరవేరిందని చిన్న, పెద్ద తేడా లేకుండా రోడ్డు వేసిన అధికారులుకు వారు ధన్యవాదములు తెలిపారు అనఁతరo వారు హర్షo వ్యక్తo చెందారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.