Tuesday, 10 March 2026

Blog

నిర్మల్

ఎడ్ బిడ్ తాండ లో కొనసాగుతున్న సమ్మక్క -సారలమ్మ జాతర

ముధోల్,జనవరి 29 (పున్నమి ప్రతినిధి నిర్మల్ ): ముధోల్ ఎడ్ బిడ్ తాండలో గ్రామం లో సమ్మక్క- సారలమ్మల జాతర గురువారం రెండో రోజు సమ్మక్క అమ్మవారు గద్దె పై చేరుకుంది. దీంతో సమ్మక్క వనం నుండి గద్దెపైకి చేరుకోని భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా సమ్మక్క – సారలమ్మ మొక్కులను తీర్చుకొని నిలు వెత్తు బంగారం (బెల్లం) ఓడి బియ్యం, మేకలు, కోళ్లతో భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. సందర్భంగా పోతరాజు మేకను గావ్ పట్టారు.సమ్మక్క సారలమ్మను భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. జాతర ప్రారంభమై రెండు రోజులు కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా దేవాదాయ స్థా పకులు రేణుకమ్మబోనాలను సమర్పించి దేవాలయ ధర్మకర్త జాదవ్ సతీష్ కుమార్ అమ్మవార్లకు పూజలు నిర్వ హించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమ్మక్క సారల మ్మ జాతర కు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారన్నారు. భక్తులు , కోరుకున్న కోరికలను అమ్మవారు తీరుస్తారన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తురకపల్లి HM సుధ రాణి అభినందనలు తెలిపారు క్క సుస్మిత ఏ ఏస్ ఓ గా ఎంపీకైoది,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 2 ఉద్యోగాలలో భాగంగా నెల్లూర్ జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన జోక్క సుస్మిత ఏ ఏస్ ఓ గా ఎంపీకైoది తాను పుట్టిన చిట్టేడు గ్రామానికి మరియు జన్మనిచ్చిన తల్లి దండ్రులకు, మా ఊరి గ్రామ ప్రజలకు ఏళ్ల వేళల నా వంతు సహాయం చేస్తానని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం – కాకాణి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). తేదీ 29-01-2026న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మనుబోలు మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి “డా. కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు మాట్లాడుతూ, జగనన్న సైన్యం ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి జిల్లాలో పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పాలనలో “వైఎస్ జగన్మోహన్ రెడ్డి”నాయకత్వమే భవిష్యత్తని స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పశువుల నట్టల నివారణకు పశుసంర్థక శాఖ

పశువుల నట్టల నివారణకు పశుసంర్థక శాఖ అధికారులు మందులు ఉచ్చితంగా అందజేశారు గురువారం దుత్తలూరు,మండలం, నర్రవాడ బీసీ కాలనీలో పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు నర్రవాడ ఇంచార్జి పశు విద్యాధికారి మధు మాట్లాడుతూ పశు భీమా ప్రాముఖ్యతను వివరించారు పాడి జీవలా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలాన్నారు.

విశాఖపట్నం

కొండయ్యవలస లో ఘనంగా భీష్మ ఏకాదశి పూజలు

ఘనంగా కొండయ్య వలస గ్రామంలో భీష్మ ఏకాదశి అగనంపూడి, జనవరి 29, పున్నమి ప్రతినిధి. జీవీఎంసీ 85 వార్డు కొండయ్య వలస గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మల్లపురెడ్డి చంద్రయ్య దాసు, భక్త తులసి దాసు జ్ఞాపకార్థం భీష్మ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిగినవి. శ్రీ మరిడిమాంబ మహిళా సమితి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం, వివిధ బృందాలు హరి భజన కార్యక్రమం కను రమ్యంగా జరిగినది. ఆలయ కమిటీ గ్రామ పెద్దలు ఐ ఆర్ సి హెచ్ అప్పారావు, విందుల వెంకటరమణ, బలిరెడ్డి సత్యనారాయణ, మరిసా రామచంద్రరావు, బలిరెడ్డి శ్రీను, సాయిన సన్యాసిరావు, విందుల మాణిక్యం, బుదిరెడ్డి అప్పారావు, బుదిరెడ్డి పైడ్రాజు, బుదిరెడ్డి కన్నారావు, మరిసా నాగేశ్వరరావు , బలి రెడ్డి వెంకటేష్ , విందుల కిషోర్, విందుల గణేష్, విందుల నవీన్ మరియు గ్రామ పెద్దలు భక్తులు మహిళలు విశేషంగా పాల్గొన్నారు.

విశాఖపట్నం

అగనంపూడి జోన్ కి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి

అగనంపూడి జోన్ కి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి.. జెడ్స్ కి అఖిలపక్ష నాయకులు వినతి అగనంపూడి, జనవరి 29, పున్నమి ప్రతినిధి. అగనంపూడి జోనల్ కమిషనర్ మనిషా త్రిపాఠి ని జీవీఎంసీ 85 వార్డు టిడిపి అధ్యక్షులు కర్రి దశెంద్ర, ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు కలిసి శుక్రవారం జీవీఎంసీ లో జరిగే కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో విలీన గ్రామాలు అత్యధికం గా, జీవీఎంసీలో విస్తరణలో రెండో స్థానంలో ఉన్న అగనంపూడి జోనల్ కి అభివృద్ధి కొరకు ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. డొంకాడ నుండి అమ్మ అపార్ట్మెంట్, పెదమడక శివాలయం నుండి కొండయ్యవలస మరిడిమాంబ వరకు ఉన్న ప్రధాన రోడ్లు విస్తరణ, క్రీడ మైదానం, అగనంపూడి సిగ్నల్స్ నుండి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్డు విస్తరణ లైటింగ్ ఏర్పాటు నిమిత్తం, కొండయ్యవలస దానబోయినపాలెం మధ్య బొర్రమాంబ మాంబ గడ్డపై బ్రిడ్జి నిర్మాణం, సూది కొండ దిగుభాగం నివాస ప్రజలకు మంచినీటి కోళాయిలు ఏర్పాటు, జీవీఎంసీ 79, 85 వార్డుల అనుసంధానం గా ఉన్న అగనంపూడి స్మశాన వాటికలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు నిమిత్తం, అసంపూర్తిగా పూర్తిగా ఉన్న సామాజిక భవనాలను నిర్మాణం విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయాలని వినతి పత్రము అందజేయడం జరిగినది. జెడ్స్ మనిషా త్రిపాటి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన అగనంపూడి జోన్ కు అధికార పూర్వకంగా 8 జోన్ గా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని, అగనంపూడి జోన్ వార్డులు తక్కువైనప్పటికీ విస్తరణ ఎక్కువ అని ఈ జోన్ సిటీ జోన్ లో ఉన్న కంటే అభివృద్ధిలో వెనకబడి ఉండటం వాస్తవంని బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించమని ప్రతిపాదన చేస్తామని అదే విధంగా జీవీఎంసీ కి రెవెన్యూ సమకూర్చడంలో కూడా ప్రజలు సహకరించాలని హౌస్ టాక్స్, వెకెంట్ ల్యాండ్ టాక్స్, ట్రేడ్ టాక్సీలు కూడా నిర్ణీత టైంలో కట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరిసా రామచంద్రరావు, జనసేన పార్టీ నాయకులు బుదిరెడ్డి అప్పారావు, వైఎస్ఆర్సిపి నాయకులు బలిరెడ్డి శ్రీను, ఐఆర్సిహెచ్ అప్పారావు, బిజెపి నాయకులు కుమార్, టిడిపి నాయకులు గంతకోరు స్వరూప్, సిపిఐ నాయకులు సాయిన సన్యాసిరావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు,

కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలో బంగారం కొనుగోళ్లకు ‘నో స్టాక్.. నో బుకింగ్!’

కామారెడ్డి, 29 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి! జిల్లా పట్ట ణంలోని బంగారు షాపుల వద్దకు కస్టమర్లు ఆశల తో వెళ్తున్నారు, కానీ ‘నో స్టాక్.. నో బుకింగ్!’ అనే నినాదంతో తిరిగి వస్తున్నారు. ఒక్క రోజులో బంగారం రేట్లు గ్రాము 1000 వరకు పెరగడంతో షాపు యజమానులు స్టాక్‌లను దాచేసి, కొత్త బుకింగ్‌లకు దూరంగా పోయారు.పట్టణంలోని ప్రముఖ బంగారు దుకాణాల వద్ద కస్టమర్లు నిరాశలో మునిగారు. మా కుమార్తె వివాహానికి బంగారం కొనాలని వచ్చాం, కానీ రేట్లు ఎక్కువ అని స్టాక్ లేదని చెప్పారు. ఇక నెలల తరబడి ఎదురుచూడడమేనన్నారు!” సంతక్రాంతి మాసం లో సమయంలో ధరలు ఇంత పెరగడం బాధాక రం అంటున్నారు. షాపులు లాభాల కోసం కస్టమ ర్లను మోసం చేస్తున్నాయా?” అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా గోల్డ్ ట్రేడర్స్ అసోసియేషన్‌కు చెందిన ఒక యజమాని ప్రకారం, “అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత, ఇంపోర్ట్ ఖర్చులు పెరగడంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పు డు కొత్త స్టాక్ వచ్చే వరకు బుకింగ్ తీసుకోలేక పోతున్నాం అంటున్నారు. కస్టమర్ల అధిక డిమాం డ్‌కు సరిపడా సరఫరా లేదు” అని వివరించారు. పట్టణంలోని పెద్ద షాపుల్లో 22 క్యారెట్ గోల్డ్ గ్రామ్‌ కు ₹7,800 నుంచి ₹8,200 వరకు, 24 క్యారెట్‌కు ₹8,500 పైన టచ్ చేసింది.ఈ పరిస్థితి బంగారం కొనుగోళ్లకు ఆసక్తి కలిగిన మహిళలు, యువత మధ్య చర్చనీయాంశమైంది. కొందరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లిస్తున్నారు, కానీ నాటికీ ధరలు అందరికీ సరిపోకపోవడంతో స్థానిక షాపు లపైనే ఆశలు పెట్టుకున్నారు.ధరలు స్థిరపడే వరకు కస్టమర్లు ఎదురుచూడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం: రైతులకు తక్షణ చికిత్స మరియు నట్టల నివారణ మందులు అందజేత

అనకాపల్లి జిల్లా జనవరి 29 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : ఏటికొప్పాక గ్రామంలో ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 16 నుండి 31 వరకు ఉచిత పశు వైద్య శిబిరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ పశు వైద్య సేవల కొరకు నిర్వహించిన ఈ శిబిరంలో రోగ పశువులకు తక్షణ వైద్యం అందించడం ప్రధానంగా నిర్వహించబడింది. ఎ. డి డా CH. గంగాధర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన పశువులు రైతులకు అధిక పాల ఉత్పత్తి మరియు స్థిరమైన ఆదాయం ఇస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా గర్భకోష వ్యాధితో బాధపడుతున్న పశువులకు చికిత్సలు, దూడలకు నట్టల నివారణ మందులు రైతులకు పంపిణీ చేయబడ్డాయి. ఈ శిబిరంలో Dr. L. కన్నయ్య నాయుడు, వెటర్నరీ అసిస్టెంట్స్ సిబ్బంది, ఏటికొప్పాక గ్రామ సర్పంచ్ బజంత్రీల లక్ష్మీ, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, అన్నం బాబ్జి, గొంతు మూర్తి కొండయ్య నాయుడు, అన్నం సరోజిరావు వంటి కూటమి నాయకులు, అలాగే గ్రామీణ రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పశువుల ఆరోగ్య పరిరక్షణ, రైతుల సంక్షేమం మరియు గ్రామీణ పాలు ఉత్పత్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

హైదరాబాద్

గుండె ఆరోగ్యం: నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు

గుండె మన శరీరానికి ఇంజిన్ లాంటిది. కానీ గుండె ఆరోగ్యం పట్ల చాలామంది నిర్లక్ష్యం చూపిస్తారు. అధిక కొవ్వు ఆహారం, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి గుండె జబ్బులకు ప్రధాన కారణాలు. ప్రారంభ దశలో గుండె సమస్యలకు పెద్దగా లక్షణాలు కనిపించవు. ఛాతి నొప్పి వచ్చినప్పుడు మాత్రమే ఆసుపత్రికి వెళ్లడం చాలా ఆలస్యం అవుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయడం గుండెను బలంగా ఉంచుతుంది. ఉప్పు, నూనె వాడకం తగ్గించాలి. ధూమపానం, మద్యం గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయి. క్రమం తప్పకుండా బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులను చాలా వరకు నివారించవచ్చు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.