Tuesday, 10 March 2026

Blog

వనపర్తి

పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి

*పదవ తరగతి విద్యార్థుల పై దృష్టి సారించాలి* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 30/01/2026* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘన్పూర్ మండలం ఈరోజు హిందీ కాంప్లెక్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసి అకాడమీ మానిటరింగ్ అధికారి మహానంది మరియు డిస్టిక్ టీం ప్రతాపరెడ్డి గారు మరియు డిసిఇబి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మద్దిలేటి గారు డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం లీడర్ బి .శ్రీనివాసులు మరియు సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్ గారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే మార్చి నెలలో జరగబోయే వార్షిక పరీక్షల్లో హిందీలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, తజుద్దీన్, శ్రీధర్, లతీఫ్, వెంకటేష్, రామ్ సింగ్, సురేష్ శ్రీనివాసులు అంజలయ్య ,గీత ,మేడం కవిత ,సులోచన, తదితరులు పాల్గొన్నారు*

విశాఖపట్నం

జీవీఎంసీ కౌన్సిల్‌లో రచ్చ.. మేయర్–వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట

విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి) జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్‌లో తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అది స్వల్ప తోపులాటకు దారితీసింది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించిన వైసీపీ సభ్యులు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కౌన్సిల్ హాల్‌లో నేలపై పడుకుని నిరసన తెలిపారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో కొంతసేపు కౌన్సిల్ సమావేశం గందరగోళంగా కొనసాగింది.

కామారెడ్డి

గొల్లపల్లి సర్పంచ్‌లు వెంటనే స్పందించి కొత్త బోరు మోటర్ బిగించారు.

– తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం కామారెడ్డి,30 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గొల్లపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్న బోరు మోటర్ కాలిపోవడంతో గ్రామస్తులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యను తెలు సుకున్న వెంటనే గ్రామపంచాయతీ పాలక వర్గం సభ్యులు స్పందించారు. పాత మోటర్‌ను తీసివేసి, కొత్త బోరు మోటార్‌ను త్వరగా బిగించి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తీర్చిపెట్టారు. గ్రామ స్తుల సౌకర్యం కోసం 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించిన పాలకవర్గానికి గ్రామవాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఇలాంటి త్వరిత చర్యలు గ్రామంలో అభివృద్ధికి మేలు కలిగిస్తాయని సర్పం చ్ కిషన్ యాదవ్ అన్నారు.ఈ సంఘటన గ్రామ పంచాయతీల్లో ప్రజా సంక్షేమానికి పాలకుల వెంట నే స్పందించామని అన్ఎంనారు.గొల్లపల్లి గ్రామస్తు లు ఇప్పుడు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కిషన్ యాదవ్, గ్రామ సెక్రటరీ జనార్ధ న్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

రామారెడ్డిలో ఘనంగా భీష్మ ఏకాదశి ఉత్సవాలు

కామారెడ్డి,30 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఘనంగా భీష్మ ఏకాదశి ఉత్సవాలు గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్త సమూహాలు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ ఉత్సవాలు మండలంలో ఆధ్యాత్మిక ఉత్సాహా న్ని మేల్కొలిపాయి. గంగపుత్ర సంఘం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. పురాణాల ప్రకారం భీష్మాచా ర్యుడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి దైవాత్మిక సంబుడిగా వెలుగొందినట్టు చెప్పబడుతుంది. ఈ రోజు ఉపవాసం, జపం, దాన ధర్మాలు చేస్తే పాపా లు తొలగి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతా రు.ఉదయం నుంచే మండల కేంద్రంలోని గణపతి ఆలయం, గంగా మాతా క్షేత్రాల వద్ద భక్తులు ఏకాదశి మహత్వం గురించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గంగాపుత్ర సంఘం సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించ డంతో పాటు, భక్తులకు ప్రసాదాలు,పంపిణీ చేశా రు. సాయంత్రం గభీర అర్చనలు, భజనా మండలి, హరతి మహోత్సవంతో ఉత్సవాలు సమాప్తి చెందాయి.ఈ సందర్భంగా గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ, “భీష్మ ఏకాదశి పవిత్ర త్వం, వ్రత పాలన ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మా సంఘం ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తోందని చెప్పారు. రామారెడ్డి మండలం లోని అందరూ ఈ వ్రతాన్ని పాటించి, జీవితంలో శాంతి, సమృద్ధి పొందాలని కోరుకుంటున్నాము” అని అన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడు తూ,ఈ ఉత్సవాలు మన సాంస్కృతిక వారసత్వా న్ని కాపాడుకోవడానికి ఒక అవకాశం. యువతను ఇటువంటి పండుగల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తామ ని తెలిపారు.స్థానికులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. రామారెడ్డి మండల పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు ఉత్సవాలకు సహకరించారు. ఈ ఏకాదశి రోజున మండలంలో అన్నదానం ఏర్పాట్లు బాగా చేశారు. గంగాపుత్ర సంఘం భవిష్యత్తులో ఇలాంటి ఆధ్యాత్మిక కార్య క్రమాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.ఈ ఉత్సవాలు రామారెడ్డి మండలంలో ఐక్యత, భక్తి భావాలను పెంచి, స్థానిక సాంస్కృతిక గుర్తింపును మరింత బలోపేతం చేశాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సత్యం, అహింస,సత్య గ్రహం సిద్దదాలంతో సడాలని సంఖల్పం

సత్యం, అహింస,సత్య గ్రహం సిద్దదాలంతో సడాలని సంఖల్పం అఖండ భారతమని ఏకం చేసి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యనికి చరమ గీతం పాడి దేశానికీ స్వాతంత్రo అందించి భారత మత ఒడిలో దిగిన మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుని శృతికీ ఘన నివాళులు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనఁతసాగరo పర్యటనీoచిన మంత్రి ఆనం రామనారాయణ

ఈ రోజు అనఁతసాగరo మండలం ప్రాజెక్ట్ ఏరియాలో గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డీ పర్యటించనున్నారు ఈ సందర్బంగా ఉదయం 10:30 గంటలకు సోమశిల ప్రాజెక్టు గెస్ట్ హౌస్ నందు శంకర నేత్రాలయ ఆద్యర్యలో నిర్వహిస్తున్న ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరాన్ని మంత్రివర్యులు సదర్శించనున్నారు అనంతరం హెల్పింగ్ హార్ట్స్ సామజిక సేవ సంస్థ అధ్యర్యoలో నిర్వాహం

E-పేపర్

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు హయత్ నగర్ తొర్రూర్ రోడ్డు లో ఉన్నా చెరువులో చెత్త నిత్యం చెత్త పడేస్తూ ఉన్నారు గత సంవత్సరము కలెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసినా స్థానిక అధికారులు ప్రజలకు కిందిస్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని అర్థమవుతుంది. చెత్త కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతుందని ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని, క్యాన్సర్ కి కారణం కూడా అవుతుందని ప్రభుత్వం హెచ్చరించినా గానీ కింది స్థాయి ఉద్యోగులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు. ట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు.

E-పేపర్

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు హయత్ నగర్ తొర్రూర్ రోడ్డు లో ఉన్నా చెరువులో చెత్త నిత్యం చెత్త పడేస్తూ ఉన్నారు గత సంవత్సరము కలెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసినా స్థానిక అధికారులు ప్రజలకు కిందిస్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని అర్థమవుతుంది. చెత్త కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతుందని ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని, క్యాన్సర్ కి కారణం కూడా అవుతుందని ప్రభుత్వం హెచ్చరించినా గానీ కింది స్థాయి ఉద్యోగులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు. ట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు.

తూర్పు గోదావరి

తాళ్లపూడి మండలంలో జూదం అడ్డుకట్ట – రూ.81,150 నగదు స్వాధీనం

తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామ శివారులో తాడిపూడి కాలువగట్టు సమీపంలో కొంతమంది వ్యక్తులు కోత-బంతి అనే జూదం ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు నిందితుల నుంచి రూ.81,150 నగదు మరియు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో జూదం, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఎప్పటికప్పుడు డ్రోన్ నిఘాతో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

కామారెడ్డి

కామారెడ్డి రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పని సరి!

కామారెడ్డి 30 జనవరి పున్నమి ప్రతినిధి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పరిధి లోని ప్రతి గ్రామల రైతులు పాత, కొత్త అని తేడా లేకుం డా ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల ని వ్యవసాయ అధికారి భాను శ్రీ స్పష్టం చేశారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తిగా నిరంత రం కొనసాగుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసు కున్న రైతులు మాత్రమే ప్రభుత్వ పథకాలు, సబ్సి డీలు సులభంగా పొందగలుతారని అన్నారు. అందుకే అందరూ త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసు కోవాలని అధికారి పిలుపునిచ్చారు.రైతులు ఇప్పు డే స్థానిక వ్యవసాయ కార్యాలయాలకు చేరుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్థానిక వ్యవసాయ కార్యాలయాల్లో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మీ భవిష్యత్తు కోసం ఇది గొప్ప అవకాశం అని చెప్పారు. కావాల్సిన పత్రాలు పట్టాదార్ ఫోన్ నెంబర్ లింక్ ఉన్న ఆధార్ జిరాక్స్లను, మీ మోబైల్ ను వెంట తీసుకు వెళ్లాలని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.