Tuesday, 10 March 2026

Blog

కామారెడ్డి

కస్తూర్బా పాఠశాల తనిఖీ చేసిన రామారెడ్డి సర్పంచ్..

– విద్యార్థినుల భవిష్యత్తుకు ప్రాధాన్యత! కామారెడ్డి, 31జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శుక్రవారం రామారెడ్డి గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.విద్యార్థినుల భోజ నం, విద్యా నాణ్యత, ఆరోగ్యం, సౌకర్యాలపై ఆధా రంగా పూర్తి పరిశీలన చేపట్టిన సర్పంచ్, పాఠశాల పరిపాలనకు కొత్త దిశా ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్, వంటశాల గది,పాత్రలు పరి శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థినులకు అధిక నాణ్యత కలిగిన భోజనం అందించాలని చెప్పారు. భోజనంలో ఏ కాస్త నాణ్యత లోపం వస్తే ఊరుకో మని హెచ్చరించారు.ఈ విషయంలో ఎట్టి పరిహా రాలు కావాలంటే చేస్తాము అని స్పష్టం చేశారు. పదవ తరగతి విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి సారిం చిన ఆయన,వారికి స్పెషల్ క్లాసులు నిర్వహించి విద్యలో రాణించేలా తయారు చేయాలని చెప్పా రు.మండలంలోని విద్యార్థినులు మంచిగా చదువు కొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గర్వకార ణంగా నిలబడాలని చెప్పారు. జిల్లా స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించాలి అని పిలుపునిచ్చా రు. పాఠశాలలో మిడ్ డే మీల్స్ వంటలు, గదుల పరిశుభ్రత, టాయిలెట్లు, తాగునీరు సౌకర్యాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రామారెడ్డి మండలంలో ఒకటి కస్తూర్బా పాఠశాల లు ఉండగా, ఇక్కడ వందల మంది బాలికలు చదువుతున్నారు. ఇటీవల పంచాయతీ సమావే శాల్లో ఈ పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వా లని ప్రతిపాదించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పం చ్ నవీన్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, పాఠ శాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*​యాదవ మహాసభ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా కొలుసు మోహన్ యాదవ్*

​విజయవాడ, జనవరి 27: అఖిల భారత యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో కీలక నియామకం జరిగింది. సంస్థ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (రాజకీయ వ్యవహారాల కమిటీ – పిఎసి ) చైర్మన్‌గా విజయవాడకు చెందిన ప్రముఖ నాయకులు శ్రీ కొలుసు మోహన్ యాదవ్ నియమితులయ్యారు. ​ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చింకా నారాయణరావు యాదవ్ గారు మోహన్ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేసి, బాధ్యతలు అప్పగించారు. ​ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చింకా నారాయణరావు యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవులను రాజకీయంగా చైతన్యపరచడానికి, సామాజికంగా వారి హక్కుల కోసం పోరాడటానికి మోహన్ యాదవ్ గారి అనుభవం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో యాదవ సామాజిక వర్గం రాజకీయంగా ఎదిగేందుకు ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ​నూతన చైర్మన్ కొలుసు మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాదవుల ఐక్యత కోసం, వారి రాజకీయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొని మోహన్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. ​ప్రచురణార్థం: చింకా నారాయణరావు యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారత యాదవ మహాసభ, ఆంధ్రప్రదేశ్.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బి.ఆర్.ఎస్ పార్టీ నుండి 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మమతరాజు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బి.ఆర్.ఎస్ పార్టీ నుండి 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మమతరాజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఐదో వార్డు టిఆర్ఎస్ అభ్యర్థిగా జెర్కోని మమతరాజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : పున్నమి న్యూస్ ప్రతినిధి జనవరి 30 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జెర్కొని రాజు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి గా 5వ వార్డు కౌన్సిలర్ గా నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు.ప్రజా సమస్యలు తెలుసుకొని నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

విశాఖపట్నం

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన కూటమి నాయకులు

అగనంపూడి, జనవరి ౩1, పున్నమి ప్రతినిధి జీవీఎంసీ 85 వార్డు కొండయ్య వలస స్వర్ణ వార్డు పరిధిలో వయోపరిమిత వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ శనివారం ఉదయం నుంచి కూటమి నాయకులు పంపిణీ చేయడం జరిగింది. విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం వచ్చినందున జనవరి 31 పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగిందని. వితంతువులకు నూతన పెన్షన్స్ పంపిణీ పరిశీలన జరుగుతుందని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచి డబ్బులు అందజేయడం జరుగుతుందని, త్వరలో వీడ్కో ఇల్లు కూడా అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుందని, ఈ ప్రాంత ప్రజలకు సౌలాభ్యంగా అగనంపూడి 8వ జోన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఏవైనా సమస్యలు ఉంటే సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొండయ్యవలస స్వర్ణ వార్డు అడ్మిన్ మళ్ళ కోమల సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు పిల్లా శ్రీనివాసరావు, వెల్ఫేర్ కార్యదర్శి అనకాపల్లి హైమ, ఏఎన్ఎం రొంగలి వరలక్ష్మి పెన్షన్స్ దారులు పాల్గొన్నారు.

హెల్త్ టిప్స్

క్యారెట్‌తో సంపూర్ణ ఆరోగ్యం

క్యారెట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు? → కంటి చూపును మెరుగుపరుస్తుంది → రక్తపోటును నియంత్రిస్తుంది → జుట్టు పాడవకుండా కాపాడుతుంది → రోగనిరోధక శక్తిని పెరుగుతుంది → ఎముకలు దృఢంగా మారతాయి → కిడ్నీ నొప్పులు తగ్గుతాయి → తక్షణ శక్తిని అందిస్తుంది → చర్మ సమస్యలను నివారిస్తుంది తినే విధానం: రోజూ ఉదయం క్యారెట్‌ను ముక్కలుగా తినడం లేదా క్యారెట్ జ్యూస్‌గా తీసుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి.

తూర్పు గోదావరి

లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్‌ను తక్షణం రద్దు చేయాలని సీఐటీయూ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎం. సుందరబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తాళ్లపూడి రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సింహాద్రి జనార్ధన్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను హరించి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేవిగా ఉన్నాయని విమర్శించారు. పని గంటల పెంపు, మహిళలతో రాత్రి షిఫ్టులు చేయించడం వంటి నిబంధనలను వ్యతిరేకించారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రైస్‌మిల్ హమాలి కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కార్మిక హక్కుల పరిరక్షణ కై ఐఎన్టియుసి ధర్నా

స్టీల్ ప్లాంట్, జనవరి 30, పున్నమి ప్రతినిధి. కార్మిక హక్కుల పరిరక్షణ, ఉక్కు కార్మిక లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉక్కు ఐఎన్టియుసి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఉక్కు బి.సి. గేట్ ధర్నా నిర్వహించారు. ఉక్కు ఐఎన్టియుసి అధ్యక్షులు పి.వి. రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా లో కార్మిక సమస్యలు అయిన నవంబర్ 15 సర్కిలార్ ని విత్డ్రా చేస్తూ ఉత్పత్తికి తో సంబంధం లేకుండా పూర్తి జీతాలు చెల్లించాలి, వేతన బకాయిలు సకాలంలో చెల్లించాలి, నిలుపుదల చేసిన హెచ్ఆర్ఏ ను యధాతధంగా కొనసాగించాలి, టౌన్షిప్ లో కరెంట్ బిల్లును తగ్గించి పూర్వ పద్ధతిలో కొనసాగించాలి, ఎంప్లాయిస్ షఫ్లింగ్ అదే డిపార్ట్మెంట్కు పరిమితం చేయాలని, ఉక్కును సెయీల్ లో విలీనం చేయాలనీ , తొలగించి న కాంట్రాక్ట్ వర్కర్స్ ను తిరిగి తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఉ కార్యక్రమం లో ఉక్కు ఐఎన్టియుసి నాయకులు నీరుకొండ రామచంద్ర, మంత్రి. గోపి నారాయణ, పోలీస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

హెల్త్ టిప్స్

రోజువారీ ఆహారంలో నువ్వులు ఎందుకు అవసరం?

రోజువారీ ఆహారంలో నువ్వులు ఎందుకు అవసరం? శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, కాల్షియం అందిస్తాయి ఎముకలు బలంగా మారేందుకు సహాయపడతాయి డయాబెటిస్‌ను నియంత్రించడంలో ఉపకరిస్తాయి రక్తస్రావం సమస్యలను తగ్గిస్తాయి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి తినే విధానం: రోజూ ఉదయం 1–2 చెంచాల నువ్వులను నానబెట్టి లేదా పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అనకాపల్లి

గ్రామ ప్రజల ఆరోగ్యానికి చేయూత – ఏటికొప్పాకలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ..!

అనకాపల్లి జిల్లా, జనవరి 30 పున్నమి న్యూస్ ప్రతి నిధి ఆనంద్ : ఏటికొప్పాక గ్రామపంచాయతీ పరిధిలో వేదంతా మహాశక్తి ఫౌండేషన్ సహకారంతో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో అపోలో డాటర్స్ వైద్య బృందం ఏర్పాటు చేసింది. శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు, ఈసీజీ పరీక్షలు, కంటి సమస్యలు, మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, వార్డు మెంబర్ నాయుడు మాస్టారు, ఈసరుపు శ్రీను, అన్నం సరోజీరావు, పంచాయతీ గుమస్తా నాగరాజు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు వివరించారు. దాదాపు 200 మంది వరకు ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ మెడికల్ క్యాంపును గ్రామ సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. గ్రామ ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని నిర్వాహకులు తెలిపారు.

తిరుపతి

మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జనసైనికులు

శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీ కాళహస్తి జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ తమ మిత్ర బృందంతో కలసి స్థానిక మండల కార్యలంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా జనసైనికులు మాట్లాడుతూ.. బాపూజీ భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి, సత్యం, అహింస, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, అంటరానితనం, అనేక సిద్ధాంతాల మీద పోరాటం చేసి, బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేసి మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేసి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజి అని ప్రతి ఒక్కరు న్యాయమార్గంలో నడిచే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ, ప్రదీప్ కుమార్, నవీన్, హరి, చందు, జానీ, రాజా, భాను, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.