తిరుపతి
శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెల 04వ తేదీన బుధవారం నాడు శ్రీకాళహస్తి పట్టణంలోని లోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్, సీడప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడునని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం, విక్రమ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పట్టాభిలు సంయుక్తంగా ప్రకటద్వార తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో తిరుపతి జిల్లాలోని చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం, శ్రీ సిటీ, మేనకూరు సెజ్ , ఈఎంసి క్లస్టర్, తిరుపతి, చెన్నైలోని 12 బహుళ జాతీయ కంపెనీలలో 700 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు చేపట్టననున్నారు. ఈ మేళాలో ఐదవ తరగతి పైన పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ జాబ్ మేళా కు అర్హులన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరని రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 3-2-2026, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదని ఇతర వివరములు కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెం. 8919889609,7989509540,9988853335. (కాల్ సెంటర్) గమనిక: జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో బిల్డ్ యువర్ రెస్యూమ్(Build Your Resume) పైన క్లిక్ చేసి ఆధార్ ఓటిపి తో ( Registration) రిజిస్ట్రేషన్ చేసుకొని, సిటిజెన్ లాగిన్ ద్వారా మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి ప్రస్తుతం జరిగే జాబ్ మేళా పైన క్లిక్ చేసి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి తెలిపారు.