Wednesday, 22 April 2026

Blog

విశాఖపట్నం

ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతం

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతం -దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జిల్లా అధ్యక్షులు, గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతం అయ్యింది అని గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలోని ఆ హబ్ లో ప్రకృతి ఆధారిత పంటల సంత నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారిత పంటలను మాత్రమే ఆహారం గా తీసుకోవడం మంచిదని అన్నారు. ఈ ప్రకృతి ఆధారిత పంటల సంత ప్రతి ఆదివారం ఇక్కడే జరుగుతుందని వివరించారు. ప్రకృతి ఆధారత పంటలను కోరుకునే వారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతులకు, నగరం లోని వినియోగదారులకు ఇది ఒక వేదికగా అవకాశం కల్పించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులకు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం బెంగళూరు వంకాయ మొక్కలు పంపిణీ చేయడం ఆనందదాయకం అన్నారు. రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు వినియోగించకుండా పండిన పంటలను ప్రోత్సాహం విధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి పాలేం నేచురల్స్ అశోక్, రైతులు రిషీ, తులసీ నేచురల్స్ సత్యన్నారాయణ, సంకల్ప ఆర్ట్ విలేజ్ నుంచి చలపతి రావు, అవని ఆర్గానిక్స్ నుంచి ఉషాగజపతి రాజు, శ్రీకాకుళం జిల్లా నుంచి దార్లపూడి రవి, వనమాలి, సిటిజి, మన కూరగాయల తోట సంస్థల ప్రతినిధులు, విభిన్న జిల్లాల రైతులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ప్రజల సొత్తు… * ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం!

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ప్రజల సొత్తు… * ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం! * వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ… * హాజరైన సౌత్ ఇన్చార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల సొత్తు అని, వాటిని పిపిపి పద్ధతిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను అడ్డుకుందామని మాజీ ఎమ్మెల్యే సౌత్ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్ ఆధ్వర్యంలో 34 వార్డులో ఆదివారం మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసుపల్లి హాజరై కరపత్రాలు అందజేసి ప్రజల నుండి సంతకాలు సేకరించారు. రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి వరకు 45 రోజులు పాటు కోటి సంతకాల సేకరణ విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు ఈ ఉద్యమం జోరుగా కొనసాగుతుందన్నారు. ఈ సేకరణ లో నలుగు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలతోపాటు విద్యార్థులు అధిక సంఖ్యలో భాగస్వాముల అవ్వాలని కోరారు. విద్యార్థి విభాగం వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షుడు గరికన వెంకటేష్ చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు సీనియర్ నాయకులు లండ రమణ, లింగం శ్రీను, దూడ అప్పారావు, కారి దానియమ్మ, సిహెచ్. జ్యోతి, పిల్లి సత్తిబాబు, గాలి పార్వతి, కేబుల్ చిన్న, నర్సింగరావు, దుర్గారావు, యు. రాజేష్, దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

తుఫాన్ ప్రభావంతో ప్రత్యేక అధికారుల నియామకం

*అమరావతి.. పున్నమి ప్రతినిధి తుఫాన్ ప్రభావంతో ప్రత్యేక అధికారుల నియామకం – జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. – 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులు – శ్రీకాకుళం- చక్రధర్ బాబు – విజయనగరం – రవి సుభాష్. – మన్యం – నారాయణ భరత్ గుప్తా – విశాఖపట్నం – అజయ్ జైన్ – అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లా – వాడ్రేవు వినయ్ చంద్ – తూర్పుగోదావరి – కన్నబాబు – కాకినాడ – కృష్ణ తేజ – కోనసీమ – విజయరామరాజు – శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇంచార్జిగా అజయ్ జైన్ – పశ్చిమగోదావరి – ప్రసన్న వెంకటేష్ – ఏలూరు – కాంతి లాల్ దండే – కృష్ణా జిల్లా – ఆమ్రపాలి – ఎన్టీఆర్ జిల్లా – శశి భూషణ్ కుమార్ – గుంటూరు – ఆర్పీ సిసోడియా – బాపట్ల – వేణు గోపాల్ రెడ్డి – ప్రకాశం – కోన శశిధర్ – నెల్లూరు – యువరాజ్. – తిరుపతి – అరుణ్ బాబు – చిత్తూరు – గిరీషా – పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇంఛార్జిగా ఆర్పీ సిసోడియా

E-పేపర్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత రూ.4.5 కోట్ల విలువ చేసే 4.5 కేజీల విదేశీ గంజాయి సీజ్ చేసిన డీఆర్ఐ లగేజి బ్యాగ్‌లో దాచి తరలించేందుకు యత్నించిన బ్యాంకాక్ ప్రయాణికుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న డీఆర్ఐ సిబ్బంది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

290 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు ప్రోత్సాహాలు

రాజోలు మండలం శివకోడు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన 290 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.12 లక్షల నగదు ప్రోత్సాహాలు అందించారు. రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ, ఉద్యోగ అవార్డులు అందుకున్న వారిని ఘనంగా సత్కరించారు. రాజోలు తాలూకా తెలగా ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగ భైరవ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు

E-పేపర్

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతిదినది రైల్వేకోడూరు వైఎస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కువైట్ వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ నందు పార్టీ నాయకులు ,కార్యకర్తలతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి . ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి , గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు ,గల్ఫ్ అడ్వైజర్ నాయని మహేశ్వర్ రెడ్డి ,గల్ఫ్ ప్రతినిధి కోర్ కమిటీ నాగిరెడ్డి , కువైట్ కో కన్వీనర్ మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, పూలపుతూరు సురేష్ రెడ్డి, ఆరం సుబ్బారెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి, బీసీ నాయకులు బత్తల లక్ష్మయ్య,రమతుల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నీటిపారులను మెరుగుపరిచిన అధికారులు

రాజోలు గ్రామ పంచాయతీ పరిధిలో స్తంభించిన నీటిపారుదల వ్యవస్థను భారీ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా మరమ్మతులు చేశారు. సర్పంచ్ రేవు జ్యోతి, కార్యదర్శి రెహమాన్ సారథ్యంలో నీటి సరఫరాను మెరుగుపరిచారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు అహర్నిశలు కృషి చేస్తూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు

E-పేపర్

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతిదినది రైల్వేకోడూరు వైఎస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కువైట్ వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ నందు పార్టీ నాయకులు ,కార్యకర్తలతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి . ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి , గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు ,గల్ఫ్ అడ్వైజర్ నాయని మహేశ్వర్ రెడ్డి ,గల్ఫ్ ప్రతినిధి కోర్ కమిటీ నాగిరెడ్డి , కువైట్ కో కన్వీనర్ మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, పూలపుతూరు సురేష్ రెడ్డి, ఆరం సుబ్బారెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి, బీసీ నాయకులు బత్తల లక్ష్మయ్య,రమతుల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మొంథా తుఫాను కారణంగా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమలాపురం ఆర్డివో కొత్త మాధవి తెలిపారు. ఆదివారం సఖినేటిపల్లి మండలం లోని తీర ప్రాంత గ్రామాల్లో ఆమె పర్యటించారు. కేశవ దాసుపాలెం, పల్లిపాలెం గ్రామాలలో గల తుఫాను ఆశ్రమ భవనాలను స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, పూరి గుడిసెలో నివసించే వారిని సోమవారం మధ్యాహ్ననానికి తుఫాను ఆశ్రమ భవనాలకు, లేదా అధికారులు గుర్తించిన ప్రదేశాలలో ఆశ్రమం పొంది అధికారులకు సహకరించాలని ఆమె తెలిపారు. రానున్న తుఫాను తీవ్రత దృష్ట్యా, ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే దిశగా ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. మొంథా తుఫాన్ తీవ్రత కారణంగా సముద్రం ఆలోకల్లోలంగా ఉంటుందని అంతర్వేది పల్లెపాలెం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆమె సూచించారు. సఖినేటిపల్లి మండల తహసీల్దార్ ఎం.సత్యనారాయణ, రాజోలు సిఐ టీవీ నరేష్ కుమార్, ఎస్సై దుర్గా శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఒడుగు శ్రీను, మాజీ సర్పంచ్ మూలస్వామి తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

న్యూ కృష్ణ నగర్ నందు నందు కాలనీ వాసులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు:మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ న్యూ కృష్ణ నగర్ నందు నందు కాలనీ వాసులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రత్నమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నందా బాల, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుబ్బరామరాజు, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, ఎంపీటీసీ మహేష్ రెడ్డి, సర్పంచ్ రామకృష్ణ,కొప్పల శంకరయ్య, కొన్నిపాటి ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్, ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, ఎంపీటీసీలు బండారు మల్లికార్జున, పుష్పలత, ఎక్స్ ఎంపిటిసి బత్తిన ఆనందయ్య యాదవ్, రవిశంకర్ యాదవ్, ప్రతాప్ రెడ్డి, వార్డు మెంబర్లు వినోద్ కన్నా, కరిముల్లా, ఫరూక్, సుబ్బరాయుడు, బాబి, ఎర్ర తొట్టి బాబు, సిద్దయ్య, డివి రమణ, రాజగోపాల్,రమణ రెడ్డి,ఇనమాల చైతన్య,మహిళా నాయకురాళ్లు అరుణమ్మ, గౌసియా, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.