Monday, 9 March 2026

Blog

E-పేపర్

కళ్లెం నవజీవన్ రెడ్డి ని పద్మావతి కాలనీవాసులు ఘనంగా సన్మానం

కళ్లెం నవజీవన్ రెడ్డి ని పద్మావతి కాలనీవాసులు ఘనంగా సన్మానం కార్పొరేటర్‌గా 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని పద్మావతి కాలనీవాసులు ఘనంగా సన్మానించారు పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 హయత్‌నగర్ డివిజన్ హయత్‌నగర్ డివిజన్ అభివృద్ధి కోసం గత ఐదు సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తూ, కాలనీలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజ్, మౌలిక వసతులు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు కృతజ్ఞతగా కాలనీ ప్రజలు ఈ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, పద్మావతి కాలనీ ప్రజల ప్రేమాభిమానాలు తనకు మరింత సేవ చేయాలనే ప్రేరణనిస్తాయని, భవిష్యత్తులో కూడా కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, కాలనీ అధ్యక్షులు అమర్నాథ్ గౌడ్ , కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మధు భూపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి , కృపాకర్ రావు, భాస్కర్, సురేష్ రావు, సురేష్ రెడ్డి, రఘుపతిరావు,చంద్ర శేఖర్, యాదిరెడ్డి, నర్సిరెడ్డి, జయచందర్ వెంకటేశ్వర్లు,వెంకటేశ్వర్ రెడ్డి, బాలాజీ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు…

రాజన్న సిరిసిల్ల

కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకుల ఘాటు నిరసన

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి రోజు ముస్తాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో పట్టణ మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోమ్మేట రాజు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి సంయుక్తంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేటీఆర్ గారిపై చేసిన అహంకారపూరితమైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వెంటనే కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక వహించిన గొప్ప నాయకుడని, ఐటీ మంత్రిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తిపై అసభ్యంగా మాట్లాడటం తగదని అన్నారు. దయాకర్ దళిత సమాజం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కసారి కూడా స్పందించలేదని విమర్శించారు. అలాగే దళితులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిధులు కోరే విషయంలో ఆయన ఎలాంటి చొరవ చూపలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముక్క మల్లయ్య, యండి. జహంగీర్, సుంచు కృష్ణ, శీలం వెంకటేష్, తలారి గొండయ్య, నర్సయ్య, శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో అగ్నిప్రమాదం.. మూడు లక్షల నష్టం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కోదండరాంపురంలో సురేష్‌కు చెందిన ఫ్యాన్సీ దుకాణం మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. దుకాణం మూసి ఇంటికి వెళ్లిన అనంతరం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో యజమాని అక్కడికి చేరుకుని వారి సహాయంతో మంటలను అదుపు చేశారు. గూడూరు ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది. సుమారు మూడు లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు.

ఖమ్మం

మధిర లో ఓటు హక్కు వినియోగించు కున్న భట్టి

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ సందర్భంగా ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

విశాఖపట్నం

రంజాన్

*🌙రంజాన్ నెల సందర్భంగా ఈనెల 18వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఉపవాసాల సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు (ఉపాధ్యాయులతో సహా) తమ డ్యూటీ నుంచి ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.*

హైదరాబాద్

ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాల లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం

అఫ్జల్ గంజ్ , హైదరాబాద్ : (పున్నమి ప్రతినిధి): ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో జేసీఐ ఇండియా సంస్థ నుండి జేసీఐ సికింద్రాబాద్ వాళ్ల ఆధ్వర్యంలో ఎన్‌పవర్ యూత్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీఐ హైదరాబాద్ చాంపియన్స్ సెక్రటరీ ప్రేమ్ చంద్ పులిగిల్ల గారు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు, లీడర్షిప్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలు కూడా అలవర్చుకుంటే భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు సాధించగలరని తెలిపారు. మంగళవారం ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాలలో నిర్వహించిన ‘ఎంపవర్ యూత్ శిక్షణ – 2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభలను వెలికితీసి, ఉపాధి అవకాశాలకు దారి చూపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం జేసీఐ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ జెసి రవళి సోమా గారు ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీఐ హైదరాబాద్ నవ అధ్యక్షుడు జెసి శ్రీధరస్వామి , కో ట్రైనర్స్ జెసి మహేష్ కుమార్ గారు, జెసి రాజు గౌడ్ గారు, కోఆర్డినేటర్ జెసి ప్రతీక్ గారు, స్కూల్ ప్రిన్సిపాల్ గారు, యాజమాన్యం ,తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం – ప్రశాంతంగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రత

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఎదులాపురం మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభమని పేర్కొంటూ ప్రతి అర్హత గల ఓటరు తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం – ప్రశాంతంగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రత

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఎదులాపురం మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభమని పేర్కొంటూ ప్రతి అర్హత గల ఓటరు తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 🗳️

కడప

మోసం మరియు బెదిరింపు కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లను అరెస్ట్ చేసిన పొద్దుటూరు 2 టౌన్ పోలీసులు.

ప్రొద్దుటూరు 2 టౌన్ U/G PS CR No. 07/2025 U/s 318(4),308(5),rlw3(5), భారతీయ న్యాయ సంహిత – BNS) ➡️ పొద్దుటూరు 2 టౌన్ పోలీసులు రూ. 33 లక్షల మోసం మరియు ప్రాణ హానితో బెదిరించి డబ్బులు తాకున్న కేసులో పాల్గొన్న అంతర్రాష్ట్ర ముకాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా డబ్బు రెట్టింపు పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఆధారాలతో బెదిరించి నగదు లాక్కునే విధంగా నేరాలు చేస్తోంది. ఈ కేసులో పోలీసులు రూ. 8,50,000 నగదు, ఒక బ్రీఫ్ కేస్ మరియు నేరానికి ఉపయోగించిన ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ➡️ నిందితుల వివరాలు: 1. కొమ్మడి గంగులయ్య, వయస్సు: 39 సంవత్సరాలు, తండ్రి: లేట్ వెంకటేష్, కులం: రజక, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: డోర్ నెంబర్ 1 /16 పెద్ద రంగాపురం గ్రామం, పులివెందుల మండలం, వైయస్సార్ కడప జిల్లా -(A 2) 2. పటాన్ సత్తార్ , బాషా, వినోద్, వయస్సు: 38 సంవత్సరాలు, తండ్రి: హుస్సేన్ పీరా, కులం: ముస్లిం, వృత్తి: రాపిడో డ్రైవర్ నివాసం: డోర్ నెంబర్ 176, భారతీయ నగర్, హుసన మరహల్లి, బెంగళూరు నగరం, కర్ణాటక రాష్ట్రం-(A3) 3. అంకం నాగేష్ గుప్త, వయసు: 42 సంవత్సరాలు, తండ్రి: లేట్ చిన్న రావు, కులం: దేవాంగ, వృత్తి: డ్రైవర్, నివాసం: డోర్ నెంబర్ 13/131, పుచ్చల వీధి, రాజాం గ్రామం & మండలం, శ్రీకాకుళం జిల్లా-(A4) 4. మల్రెడ్డి గోపాల్ రెడ్డి,:28 సంవత్సరాలు, తండ్రి: వెంకటరెడ్డి, కులం: రెడ్డి,వృత్తి: లిఫ్ట్ మెకానిక్, శాశ్వత నివాసం: డోర్ నెంబర్. C -12-124/1, రెడ్డి బజార్, వెంకట్రాంపురం గ్రామం, మెల్ల చెరువు మండలం, సూర్యాపేట జిల్లా, ప్రస్తుతం నివాసం: SBI బ్యాంక్ లైన్, శాలివాసన నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం-(A5) 5. తిరుపతి పెంచలయ్య పెంచల నరసింహ, వయస్సు: 45 సంవత్సరాలు, తండ్రి: పెద్ద పెంచలయ్య, కులం: ఎస్సీ-మాదిగ, వృత్తి: మేస్త్రీ, నివాసం: డోర్ నెంబర్: 15/100, గాంధీ కాలనీ, అల్లూరు గ్రామం & మండలం, నెల్లూరు జిల్లా.

తిరుపతి

ముక్కంటీశునికి శ్రీశైల మల్లన్న పట్టువస్త్రాలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) ఎం. శ్రీనివాసరావు మంగళవాయిద్యాలు వేద మంత్రాల నడుమ పట్టువస్త్రాలను తలపై మోసుకుంటూ ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఆయనకు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపి రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శ్రీశైల దేవస్తాన ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ….శివరాత్రి పర్వదినం సందర్భంగా ఒక ప్రముఖ శైవ క్షేత్రం నుండి మరో క్షేత్రానికి పట్టువస్త్రాలు సమర్పించడం పురాతన ఆచారమని పేర్కొన్నారు. శ్రీశైల దేవస్తానం వారు సమర్పించిన ఈ పట్టువస్త్రాలను స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు మరియు కళ్యాణోత్సవం సమయంలో అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, వేద పండితులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.