Sunday, 8 March 2026

Blog

విశాఖపట్నం

వాహనాల బొగ్గు దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి…వైజంక్షన్ వద్ద గ్రామస్తుల ఆందోళన

విశాఖ…గాజువాక (పున్నమి ప్రతినిధి): భారీ వాహనాల నుంచి ఎగిసిపడుతున్న బొగ్గు,దుమ్ము,దూళి కారణంగా జీవనం దుర్భరంగా మారిందని కర్నవాణిపాలెం గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.గంగవరం పోర్ట్‌కు చెందిన గంగవరం పోర్టు మరియు స్టీల్ ప్లాంట్ కు రోజువారీగా వెళ్తున్న భారీ ట్రక్కుల రాకపోకలతో గ్రామం మొత్తం కాలుష్య మబ్బులో కూరుకుపోతుందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో గ్రామస్తులు వై-జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.బొగ్గు లోడుతో వెళ్తున్న ట్రక్కులను అడ్డుకుని కొంతసేపు రాకపోకలను నిలిపివేశారు.ట్రక్కులకు కవర్లు లేకుండా బొగ్గు రవాణా చేయడం,అధిక వేగంతో దూసుకెళ్లడం వల్ల బొగ్గు కణాలు గాలిలో వ్యాపించి ఇళ్లలోకి చేరుతున్నాయని తెలిపారు.దీంతో చిన్నపిల్లలు,వృద్ధులు శ్వాసకోశ సమస్యలు,అలర్జీలు,కంటి ఇబ్బందులతో బాధపడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో ఇప్పటికే అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని,వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.వెంటనే రోడ్లపై నీటిచల్లి దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టాలని,బొగ్గు రవాణా వాహనాలకు కవర్లు తప్పనిసరి చేయాలని,గ్రామం గుండా కాకుండా ప్రత్యామ్నాయ మార్గం కల్పించాలని డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు.సమస్యను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.అయితే తక్షణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

విశాఖపట్నం

అప్పు కోసం వెలిసిన క్షేత్ర మహిమ…చరిత్ర–పురాణ వైభవంతో వెలుగొందుతున్న అప్పికొండ సోమేశ్వరాలయం

విశాఖ…గాజువాక (పున్నమి ప్రతినిధి): బంగాళాఖాత తీరాన సముద్ర అలల మృదుస్వరాల మధ్య ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్ముతున్న అప్పికొండ సోమేశ్వరాలయం సుమారు 1400ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ప్రాచీన శైవక్షేత్రంగా విశేష ఖ్యాతి గడించింది.ప్రకృతి ఒడిలో,కొండచరియల నడుమ,సముద్రానికి అతి సమీపంలో వెలసిన ఈ దేవాలయం చారిత్రక ప్రాముఖ్యతతో పాటు పురాణగాథలతో భక్తులను ఆకర్షిస్తోంది.చాళుక్యుల కాలానికి చెందిన నిర్మాణశైలి ఈ ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.శిలా స్తంభాలపై చెక్కిన నాజూకైన శిల్పాలు,గర్భగుడి నిర్మాణ తీరు,ముఖమండప శైలులు ఆ కాలపు కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.గర్భగుడిలో స్వయంభూ సోమేశ్వరలింగం భక్తుల పూజలందుకుంటోంది.ఆలయ ప్రాంగణంలో కనిపించే శిలాశాసనాలు,శిల్పచిత్రాలు ఆ కాలపు సాంస్కృతిక,ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.శైవ సంప్రదాయం విశేషంగా అభివృద్ధి చెందిన కాలంలో ఈ క్షేత్రం ప్రధాన పూజా కేంద్రంగా వెలుగొందినట్లు పండితులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ మరింత ఆసక్తికరంగా నిలుస్తోంది.కపిల మహర్షి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు 101శివలింగాలను ప్రతిష్ఠించాలని ఘన సంకల్పం చేశారు.ఆయన తపోబలంతో ఒకదాని తరువాత ఒకటి లింగాలు వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి.అయితే 100లింగాలు ప్రతిష్ఠించగలిగినా చివరి ఒక లింగం మాత్రం దొరకలేదని కథనం.ఆ ఒక్క లింగం(అప్పు)కోసం మహర్షి లోకమంతా అన్వేషించినా ఫలితం లేకపోయిందట.దాంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ఈ కొండ అప్పు కొండగానే మిగిలిపోవాలని శపించారనే విశ్వాసం భక్తుల్లో ఉంది.అప్పటి నుంచి ఈ ప్రాంతం అప్పికొండగా ప్రసిద్ధి చెందిందని ఆలయ అర్చకుడు నాగరాజు వివరించారు.కాలగర్భంలో 100లింగాల్లో 95లింగాలు లీనమైపోయి ప్రస్తుతం ఐదు శివలింగాలు మాత్రమే దర్శనమిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఈ ఐదు లింగాలను దర్శించుకోవడం విశేష పుణ్యప్రదమని భక్తుల నమ్మకం.మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి రాత్రంతా జాగరణ,రుద్రాభిషేకాలు,లింగార్చనలు నిర్వహిస్తారు.పాలాభిషేకం,బిల్వార్చన,లఘురుద్ర,మహారుద్ర హోమాలు ఘనంగా జరుగుతాయి.కార్తీకమాసంలో దీపాలతో ఆలయ ప్రాంగణం ప్రకాశవంతమై ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మధురంగా మారుస్తుంది.సముద్రతీరానికి సమీపంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి.అలల శబ్దం మధ్య శివనామస్మరణ మార్మోగుతుంటే భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోతారు.ప్రకృతి,పురాతన శిల్పకళ,పురాణగాథలు కలగలిసి ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.వార్షిక ఉత్సవాలు,అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.చారిత్రకంగా,ఆధ్యాత్మికంగా,సాంస్కృతికంగా విశిష్ట స్థానం సంపాదించుకున్న ఈ శివక్షేత్రం రాష్ట్రస్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందుతోంది.సంరక్షణ చర్యలు మరింత బలోపేతం చేస్తే దేశవ్యాప్తంగా మరింత ఖ్యాతిని సంతరించుకునే అవకాశముందని భక్తులు,స్థానికులు అభిప్రాయపడుతున్నారు. Uploaded Video:

కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు బైపాస్ మీద వెళ్తున్న ఆటో బోల్తా

మద్యం మత్తులో వాహనం నడుపు ఆటో ట్రాలీ అదుపుతప్పి పొద్దుటూరు బైపాస్ రోడ్డు నందు యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదం నందు ఎవరికి ఎటువంటి గాయాలు జరగలేదు మద్యం మత్తులో లో ఎదురుగా వచ్చే కారును తప్పించబోయి డ్రైవరు ఆటో ప్లల్టీ కొట్టినది చుట్టుపక్కల స్థానికులు గుర్తించి డ్రైవర్ను బయటకు తీసి ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.

ఖమ్మం

మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించు కున్న ఉప ముఖ్య మంత్రి భట్టి:

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారిని తెలంగాణ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ సం దర్భము గా భట్టి విక్రమార్క మాట్లాడు తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మహా శివ రాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ న్నాను అని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. 2047 నాటికి తెలంగాణను ప్రపంచ స్థాయిలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులు కి సూచించారు

తిరుపతి

చంద్రగిరి నియోజకవర్గంలో శివనామస్మరణతో మారు మోగిన శైవ క్షేత్రాలు…

తిరుపతి రూరల్ 15 ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి మంగళం, అవిలాల పంచాయతీలోని శివాలయాలకు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ముందుగా ఆలయాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

ఈ నెల 16వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ*

జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ* జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి* : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, ఫిబ్రవరి 15 పున్నమి ప్రతినిధి ఈ నెల 16వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.* అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.* ఈ నెల 16 వ తేదీన సోమవారం తిరుపతి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ ను చెక్ చేసుకోవాలన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ ను వాట్స్అప్ లో పంపిస్తున్నామని, ఎండార్స్మెంట్ బై రిజిస్టర్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా దానిని పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.* —————————– డి ఐ పి. ఆర్. ఓ, తిరుపతి

కడప

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు*

*రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లి ఆయన నివాసం నందు కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితమ్మ గారు,జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు,మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు,కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి గారు,కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి గారు,పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు,రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు గారితో కలిసి సమావేశమైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు* *ప్రొద్దుటూరు నియోజకవర్గానికి యునాని మెడికల్ కళాశాల 70 కోట్ల రూపాయలతో మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు* *ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయాలను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు* *ఈ సమావేశంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలను వరదరాజుల రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.రోడ్ల విస్తరణ,అండరు డ్రైనేజీ కాలువల ఆధునీకరణ,రైతుల వ్యవసాయ ఉత్పత్తుల కొరకు ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు,నిర్మాణంలో ఉన్న నూతన కూరగాయల మార్కెట్ కొరకు నిధుల మంజూరు,నూతన RTC బస్టాండుకు కావలసిన నిధులు మంజూరు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం,నిర్మాణంలో ఉన్న యోగివేమన ఇంజనీరింగ్ కళాశాల అదనపు భవనాలకు నిధుల మంజూరు,ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనాలకు నిధుల మంజూరు,నియోజక వర్గానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్,నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించి,లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది.*

తిరుపతి

ప్రముఖ శివాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

చంద్రగిరి మండలం. పున్నమి ప్రతినిధి చంద్రగిరి మండలం లోని ప్రముఖ శైవాలయాలను దర్శించుకున్న చంద్రగిరి నియోజక వర్గం వైఎస్ఆర్ సీపీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు ఆలయాల వృద్ధి సాదర స్వాగతం పలికిన స్థానిక నాయకులు, ఆలయ నిర్వాహకులు దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయం అర్చకులు ప్రతి ఏటా తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మహా శివ రాత్రికి పట్టు వస్త్రాలను సమర్పించే ఆనవాయిత చంద్రగిరి మండలంలోని నారావారిపల్లి వద్దనున్న శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం, చంద్రగిరి శ్రీ పుట్టాలమ్మ ఆలయం, రాయల పురం శ్రీ నాగా లమ్మ ఆలయం, మల్లయ్యపల్లి ఆనందంవల్లీ మల్లేశ్వర స్వామి ఆలయం, ముక్కోటి శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలకు పట్టువస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.

తిరుపతి

మహా శివరాత్రి సందర్భంగా యోగిమల్లవరంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుచానూరు , పున్నమి ప్రతినిధి మహా శివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు సమీపంలోని చారిత్రక పుణ్యక్షేత్రం యోగిమల్లవరం శ్రీ పరాశరేశ్వర స్వామి వారిని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న తుడా చైర్మన్ ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ​మహా శివ రాత్రి పర్వదినాన పురాతనమైన పరాశరేశ్వర స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఆలయం లో భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దక్షిణ కాశిగా పేరుగాంచిన ఈ క్షేత్ర అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు తుడా తరపున అవసరమైన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,కార్యకర్తలు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు,అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మహాశివరాత్రి వేళ ప్రయాణికుల భద్రతే ప్రథమ కర్తవ్యం – తాళ్లపూడి ఆటో డ్రైవర్లకు ఆర్టీఏ కఠిన హెచ్చరిక

తాళ్లపూడి,పున్నమి ప్రతినిధి, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని తాళ్లపూడిలో ఆటో డ్రైవర్లతో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు సమావేశం నిర్వహించారు. భక్తుల రాకపోకలు భారీగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొవ్వూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ కే శివ ప్రసాద్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఆటోలలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, డ్రైవర్ పక్కన అదనపు ప్యాసింజర్లను కూర్చోబెట్టరాదని స్పష్టం చేశారు. ప్రతి ఆటోకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని, డ్రైవర్ వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆటోలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా డ్రైవర్లు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల ప్రాణ భద్రతను కాపాడటం ప్రతి డ్రైవర్ బాధ్యత అని స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.