Sunday, 8 March 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తిలో భక్తుల ‘రుద్ర’ రూపం: వీఐపీలకే పెద్దపీట..సామాన్యులకు తప్పని తిప్పలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం భక్తజన సంద్రమైంది. పరమశివుని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే, ఆలయ అధికారుల వైఫల్యం, వీఐపీలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై సాధారణ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కంటి దర్శనం కోసం భక్తులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంటలు గడుస్తున్నా క్యూలైన్ కదలకపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటలతరబడి వేచి ఉన్నా తమను దర్శనానికి అనుమతించడం లేదని భక్తులు వాపోయారు. అధికారులతీరుపైనిరసన.. సాధారణ భక్తులను నిలిపివేసి, సిఫార్సు లేఖలు ఉన్న వీఐపీలను గర్భాలయంలోకి పంపడంపై భక్తుల సహనం నశించింది. ఆలయ ప్రాంగణంలోనే అధికారుల తీరుకు వ్యతిరేకంగా భక్తులు నిరసనకు దిగారు. “ఛైర్మన్ డౌన్ డౌన్.. ఈవో డౌన్ డౌన్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. క్యూలైన్ల నిర్వహణలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, సామాన్య భక్తుల గోడు పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులజోక్యం.. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి భక్తులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. దర్శన ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. అయినప్పటికీ, పవిత్రమైన శివరాత్రి రోజున కూడా గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

శివుని ఉపాసించడానికి తగినది మహాశివరాత్రి……

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శివుని ఉద్దేశించి చేసే వ్రతాధికాలు రాత్రి సమయలలోచేయాలి. అదే ఆదేవదేవుని ప్రీతికరాన్ని కలిగిస్తుంది. మహాశివరాత్రికూడా నవరాత్రులతో సమానమే అని నిర్ణయ సింధువు ద్వారా తెలియవస్తుంది. అంటే దీక్షగా ఉపాసన చేయవలసి ఉంటుంది. ఆ ఉపాసనకు వీలుగా ఆయన మంత్రం ఉద్భవించిది. ఆ దే ఓం నమ:శివాయ. ప్రతి మాసంలో ప్రదోషవేళ కృష్ణ చతుర్దశి ఉంచే దానిని మాస శివరాత్రి అంటారు. మాఘ మా సంలో వచ్చే మాసశివరాత్రిని మహా శివరాత్రి అంటారు. ఇది మహాశివుడు అవిర్భవించిన దినం. ఈ మహాశివరాత్రి సం దర్భంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో హరహర మహాదేవ శంభోశంకర నామస్మరాలతో శ్రీకాళహస్తీశ్వరాలయం మారుమో గింది. శివయ్య దర్శనంతో భక్తులు పులకించిపోయారు. మహాశివరాత్రిని పురష్కరించుకుని ఆదివారం అశేష భక్తజనం శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తి కిటకిటలాడింది. ఆలయంలో ప్రత్యేక వూలు, విద్యుద్దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. ఉత్సవ మూర్తులకు బంగారు ఆభరణాలు అలంకరించారు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల నుంచే స్వామి, అమ్మవార్ల దర్శనం ప్రారంభమైనది. హరహర మహాదేవా శంభోశంకర నామస్మరణాలతో స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. రూ.500,200 టికెట్లతో పాటు సర్వదర్శనంకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలై న్లలో భక్తులకు పాలు, బిస్కెట్లు, మంచినీరు సౌకర్యాలను అధికారులు భక్తులకు అందించారు. క్యూలైన్ల వ్యవస్థ పటిష్టంగా చేపట్టడంతో భక్తులు సాఫీగా దర్శనం చేసుకోగలిగారు. పాలక మండలి అద్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, దేవస్తాన ఇఓ బాపిరెడ్డి, ఆలయాధికారులు, ట్రస్ట్ బోర్డు సబ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్య వేక్షించారు. ఇసుకేస్తే రాలని జనం : మహాశివరాత్రిని పురష్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం భక్తుల తాకిడి పెద్దగా లేకున్నా మద్యాహ్నం నుంచి ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. సుమారు లక్షమందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా. ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు : ఈసారి బ్రహ్మోత్సవాలకు ఆలయాధికారులు ప్రణాళికబద్దంగా ఏర్పాట్లను చేపట్టారు. మహాశివరాత్రి వర్వదినాన ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడ్డారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి టి.బాపిరెడ్డి విఐపిలకు, సామాన్యభ క్తులకు ఎటుంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. పోలీస్ శాఖ వారు పటిష్ట మైన భద్రత చర్యలను చేపట్టారు. ఆదివారం దక్షిణామూర్తి వద్ద నుంచి అడ్డదారిలో భక్తులను పంపవద్దని ఇఓ ఆలయాధికారులను ఆదేశం చారు. అందుబాటులో ప్రసాదాలు : మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు కావాల్సిన పులిహోరా, లడ్డు, వడ, జిలేబీ ప్రసాదాలను సి ద్దం చేశారు. ప్రత్యేకంగా ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలు అందుబాటులోకి తెచ్చారు. ఆలయం నుంచి ఉచిత ప్రసా దాన్ని భక్తులకు అందించారు. ఉచిత బస్సుల ద్వారా భక్తులు తరలింపు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో ఆర్ టిసి అధికారులు పట్టణంలోని బస్సు ల రాకపోకలు నిలిపివేశారు. ఎపిసీడ్స్ కూడలి నుంచి బైపాస్ మీదుగా బస్సులు రాకపోకలు సాగాయి. అయితే ఏపిసీడ్స్ వద్ద బస్సులు దిగే భక్తుల కోసం ప్రయివేటు పాఠశాలలకు చెందిన బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సుల ను ఉచితంగా తరలించారు. దీంతో భక్తులు సమస్యలు లేకుండా ముక్కంటి ఆలయానికి చేరుకోగలిగారు. మార్కెట్ కమిటీ ఆవరణంలో వాస నాలను, పార్కింగ్ చేయడంతో వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పాయి. నందిపై శివుని దివ్యతేజం : మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి అధికార నంది వాహనంపై గంగాదేవి సమేతుడైన శివుడు సింహవాహనంపై జ్ఞానప్రసూనాంబ పురవీధుల్లో విహరించారు. శివరాత్రి పర్వదినాన జాగారం చేసే భక్తులను కటాక్షించేందుకు భక్తవత్సలుడైన సోమస్కందమూర్తి నందీశ్వరునిపై సింహవానం పై పార్వతిదేవని విహరించానున్నారు.

తిరుపతి

పి.సి. ప్రకాశ్‌కు అన్నా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం

తిరుపతి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 15: పుత్తూరులోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ (యాంత్రిక శాస్త్రం) విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న పి. సి. ప్రకాశ్ కు చెన్నైలోని ప్రతిష్టాత్మక అన్నా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. శనివారం నాడు జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన ఈ గౌరవాన్ని ప్రకాశ్ అందుకున్నారు. తిరుపతి వాస్తవ్యులైన పి. సి. ప్రకాశ్, “ఎఫెక్ట్ ఆఫ్ మోడిఫైడ్ నానోగ్రాఫీన్ ఆక్సైడ్ లోడింగ్ ఆన్ ది మెకానికల్ ప్రాపర్టీస్, స్వెల్లింగ్ రెసిస్టెన్స్, అండ్ కంప్రెషన్ సెట్ బిహేవియర్ ఆఫ్ ఈపిడిఎమ్/ఎస్‌బిఆర్ బ్లెండ్ నానోకాంపోజిట్స్” అనే అంశంపై లోతైన పరిశోధన చేశారు. ఈ పరిశోధనను నాగపట్టణంలోని (ఈజీఎస్‌పెక్) ప్రొఫెసర్ డాక్టర్ వి. నవనీతకృష్ణన్ పర్యవేక్షణలో ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. నానో టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన ఈ కృషికి గాను యూనివర్సిటీ ఈ డాక్టరేట్ పట్టాను అందజేసింది. డాక్టరేట్ సాధించిన పి. సి. ప్రకాశ్ గారిని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, తోటి అధ్యాపకులు, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు ఘనంగా అభినందించారు. ఆయన చేసిన ఈ పరిశోధన భవిష్యత్తులో సాంకేతిక రంగానికి ఎంతో దోహదపడుతుందని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

E-పేపర్

శివనామస్మరణతో పులకించిన నక్కర్త మేడిపల్లి

పున్నమి న్యూస్ ప్రతినిధి శివనామస్మరణతో పులకించిన నక్కర్త మేడిపల్లి శివయ్య నామస్మరణతో నక్కర్త మేడిపల్లి పులకించింది. గ్రామస్థులంతా శివయ్య దర్శనానికి పోటెత్తడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. సాయంత్రం భక్తులు, పిల్లా పాపలతో మహేశ్వరుడి సన్నిధి కోలాహలంగా మారింది. ఉపవాసదీక్ష విరమించే వారికి ప్రాంగణంలో పండ్లు అందించారు. లింగోద్భవ వేళ వరకు భజనలతో జాగరణ చేయనున్నారు.

E-పేపర్

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆంక్షలు

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగరెడ్డి జిల్లా తెలంగాణ ఇంచార్జ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆంక్షలు* ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16.02.2026న జరగనున్న మున్సిపాలిటీల చైర్‌పర్సన్ మరియు వైస్-చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికల కోసం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటం కోసం పోలీస్ కమిషనర్ . సుధీర్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన ఆదేశాలు: గుమికూడటంపై నిషేధం 3 మందికి పైగా వ్యక్తులు ఒకచోట చేరకూడదు. ఎన్నికల కోడ్ (MCC) అమలులో ఉన్నందున, అనుమతి లేని సమావేశాలు లేదా ర్యాలీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఆంక్షలు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద విధించబడ్డాయి. ఈ ఆదేశాలు 16 ఫిబ్రవరి 2026న అమలులో ఉంటాయి. ఆంక్షలు వర్తించే ప్రాంతాలు: ఇబ్రహీంపట్నం,షాద్‌నగర్,శంకర్‌పల్లి,మొయినాబాద్, ఆమనగల్.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చెరువు కట్ట వద్ద జంగిల్ క్లియరెన్స్, కాలువల పూడికతీత పనులు పూర్తి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెర్లోపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. చెరువు కట్ట వద్ద జంగిల్ క్లియరెన్స్, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, పంట కాలువల పూడికతీత వంటి పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు సాగునీటి ఉపాధ్యక్షులు పొన్నూరు అశోక్, చెర్లోపల్లి సీనియర్ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి పాల్గొని పనులను పర్యవేక్షించారు. గ్రామ రైతులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

తిరుమల ఫిబ్రవరి 15 పున్నమి ప్రతినిధి తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఆదివారం వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ——————— టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

విశాఖపట్నం

వాహనాల బొగ్గు దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి…వైజంక్షన్ వద్ద గ్రామస్తుల ఆందోళన

విశాఖ…గాజువాక (పున్నమి ప్రతినిధి): భారీ వాహనాల నుంచి ఎగిసిపడుతున్న బొగ్గు,దుమ్ము,దూళి కారణంగా జీవనం దుర్భరంగా మారిందని కర్నవాణిపాలెం గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.గంగవరం పోర్ట్‌కు చెందిన గంగవరం పోర్టు మరియు స్టీల్ ప్లాంట్ కు రోజువారీగా వెళ్తున్న భారీ ట్రక్కుల రాకపోకలతో గ్రామం మొత్తం కాలుష్య మబ్బులో కూరుకుపోతుందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో గ్రామస్తులు వై-జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.బొగ్గు లోడుతో వెళ్తున్న ట్రక్కులను అడ్డుకుని కొంతసేపు రాకపోకలను నిలిపివేశారు.ట్రక్కులకు కవర్లు లేకుండా బొగ్గు రవాణా చేయడం,అధిక వేగంతో దూసుకెళ్లడం వల్ల బొగ్గు కణాలు గాలిలో వ్యాపించి ఇళ్లలోకి చేరుతున్నాయని తెలిపారు.దీంతో చిన్నపిల్లలు,వృద్ధులు శ్వాసకోశ సమస్యలు,అలర్జీలు,కంటి ఇబ్బందులతో బాధపడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో ఇప్పటికే అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని,వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.వెంటనే రోడ్లపై నీటిచల్లి దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టాలని,బొగ్గు రవాణా వాహనాలకు కవర్లు తప్పనిసరి చేయాలని,గ్రామం గుండా కాకుండా ప్రత్యామ్నాయ మార్గం కల్పించాలని డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు.సమస్యను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.అయితే తక్షణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

విశాఖపట్నం

అప్పు కోసం వెలిసిన క్షేత్ర మహిమ…చరిత్ర–పురాణ వైభవంతో వెలుగొందుతున్న అప్పికొండ సోమేశ్వరాలయం

విశాఖ…గాజువాక (పున్నమి ప్రతినిధి): బంగాళాఖాత తీరాన సముద్ర అలల మృదుస్వరాల మధ్య ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్ముతున్న అప్పికొండ సోమేశ్వరాలయం సుమారు 1400ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ప్రాచీన శైవక్షేత్రంగా విశేష ఖ్యాతి గడించింది.ప్రకృతి ఒడిలో,కొండచరియల నడుమ,సముద్రానికి అతి సమీపంలో వెలసిన ఈ దేవాలయం చారిత్రక ప్రాముఖ్యతతో పాటు పురాణగాథలతో భక్తులను ఆకర్షిస్తోంది.చాళుక్యుల కాలానికి చెందిన నిర్మాణశైలి ఈ ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.శిలా స్తంభాలపై చెక్కిన నాజూకైన శిల్పాలు,గర్భగుడి నిర్మాణ తీరు,ముఖమండప శైలులు ఆ కాలపు కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.గర్భగుడిలో స్వయంభూ సోమేశ్వరలింగం భక్తుల పూజలందుకుంటోంది.ఆలయ ప్రాంగణంలో కనిపించే శిలాశాసనాలు,శిల్పచిత్రాలు ఆ కాలపు సాంస్కృతిక,ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.శైవ సంప్రదాయం విశేషంగా అభివృద్ధి చెందిన కాలంలో ఈ క్షేత్రం ప్రధాన పూజా కేంద్రంగా వెలుగొందినట్లు పండితులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ మరింత ఆసక్తికరంగా నిలుస్తోంది.కపిల మహర్షి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు 101శివలింగాలను ప్రతిష్ఠించాలని ఘన సంకల్పం చేశారు.ఆయన తపోబలంతో ఒకదాని తరువాత ఒకటి లింగాలు వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి.అయితే 100లింగాలు ప్రతిష్ఠించగలిగినా చివరి ఒక లింగం మాత్రం దొరకలేదని కథనం.ఆ ఒక్క లింగం(అప్పు)కోసం మహర్షి లోకమంతా అన్వేషించినా ఫలితం లేకపోయిందట.దాంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ఈ కొండ అప్పు కొండగానే మిగిలిపోవాలని శపించారనే విశ్వాసం భక్తుల్లో ఉంది.అప్పటి నుంచి ఈ ప్రాంతం అప్పికొండగా ప్రసిద్ధి చెందిందని ఆలయ అర్చకుడు నాగరాజు వివరించారు.కాలగర్భంలో 100లింగాల్లో 95లింగాలు లీనమైపోయి ప్రస్తుతం ఐదు శివలింగాలు మాత్రమే దర్శనమిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఈ ఐదు లింగాలను దర్శించుకోవడం విశేష పుణ్యప్రదమని భక్తుల నమ్మకం.మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి రాత్రంతా జాగరణ,రుద్రాభిషేకాలు,లింగార్చనలు నిర్వహిస్తారు.పాలాభిషేకం,బిల్వార్చన,లఘురుద్ర,మహారుద్ర హోమాలు ఘనంగా జరుగుతాయి.కార్తీకమాసంలో దీపాలతో ఆలయ ప్రాంగణం ప్రకాశవంతమై ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మధురంగా మారుస్తుంది.సముద్రతీరానికి సమీపంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి.అలల శబ్దం మధ్య శివనామస్మరణ మార్మోగుతుంటే భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోతారు.ప్రకృతి,పురాతన శిల్పకళ,పురాణగాథలు కలగలిసి ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.వార్షిక ఉత్సవాలు,అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.చారిత్రకంగా,ఆధ్యాత్మికంగా,సాంస్కృతికంగా విశిష్ట స్థానం సంపాదించుకున్న ఈ శివక్షేత్రం రాష్ట్రస్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందుతోంది.సంరక్షణ చర్యలు మరింత బలోపేతం చేస్తే దేశవ్యాప్తంగా మరింత ఖ్యాతిని సంతరించుకునే అవకాశముందని భక్తులు,స్థానికులు అభిప్రాయపడుతున్నారు. Uploaded Video:

కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు బైపాస్ మీద వెళ్తున్న ఆటో బోల్తా

మద్యం మత్తులో వాహనం నడుపు ఆటో ట్రాలీ అదుపుతప్పి పొద్దుటూరు బైపాస్ రోడ్డు నందు యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదం నందు ఎవరికి ఎటువంటి గాయాలు జరగలేదు మద్యం మత్తులో లో ఎదురుగా వచ్చే కారును తప్పించబోయి డ్రైవరు ఆటో ప్లల్టీ కొట్టినది చుట్టుపక్కల స్థానికులు గుర్తించి డ్రైవర్ను బయటకు తీసి ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.