Sunday, 22 March 2026

Blog

తెలంగాణ

పంటల సేకరణ పై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన : మంత్రులు

నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం హైదరాబాదు నుండి రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయా, తదితర పంటల సేకరణ పై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ, సాఫీగా కొనసాగుతున్నదని మంత్రులకు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

SA-1 పరీక్షలు పరిసిలించిన ఏం ఈ ఓ

ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సమ్మేటివ్ అస్సిమెంట్ ఓన్ పరిక్షణలను ఏంఈఓ టీ వేంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన మాట్లాడుతూ ప్రశ్న ప్రతాలు విద్యార్ధులకు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని పరిక్షణలలో విద్యార్దులు అత్యుత్తమ ఉత్తమ ప్రతిభ చూపించి ఫలితాలు సాధించాలని కోరారు.

కామారెడ్డి

ఘనంగా లక్షద్వీపార్చన మహోత్సవం

– ఓం ఓం భైరవ బంకల భైరవ మార్మోగిన నినాదాలు కామారెడ్డి,10 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఇస్సనపల్లి శ్రీ కాలభైరవస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో ప్రాముఖ్యంగా శుక్రవారం సాయంత్రం లక్షదీపార్చన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేద పండితుల మంత్రోచ్చారణలతో దీపార్చన మొదల య్యి, కుటుంబాలు, పెద్దలు, యూత్ సభ్యులు కలిసి వివిధ ఆకృతులు సృష్టించి దీపాలను వెలిగించటం దైవభక్తిని ప్రదర్శించారు.ఉత్సవాలు కార్తీక పౌర్ణమి తరువాత ఐదు రోజులపాటు జరుగుతుండటంతో, వీటిలో డోలారోహణం, భజనలు, రథోత్సవం, అగ్ని గుండాల వంటి ప్రధాన కార్యక్రమాలు జరుగుతా యని ఆలయ ఈవో ప్రభుస్వామి తెలిపారు. అలాగే, భక్తుల వసతుల కు ప్రత్యేకంగా వసతి గదులు, స్నాన సౌకర్యాలు, నిత్య అన్నదానం అందుబాటు లో ఉన్నాయని తెలిపారు. కార్తీకమాసం దేవతలైన శివ, విష్ణు పూజ లకు మరింత పావిత్రత కలిగిన మాసం. ఈ కాలం లో శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన పూజలు, 108 పాదయాత్రలు, నందాదీపా లు, ఆకాశదీపాల వంటి ప్రకాశోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. భక్తు లు ఈ పూజల ద్వారా శ్రేయస్సును పొందు తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఉత్సవాల్లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, మహిళలు, యువతులు భక్తులతో కలిసి పాల్గొన్నారు.

రంగారెడ్డి

జర్నలిస్టుల పిల్లల విద్యకు రాయితీ ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ని కోరిన.పద్మారావు కాపు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10 : రంగారెడ్డి జిల్లా కొంగరికలాన్‌లో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి.నారాయణ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన అన్వేషణ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు విలేకరుల పిల్లల స్కూల్ ఫీజులో రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.విలేకరులు సమాజానికి అద్దం పట్టే వృత్తిలో నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని చాలామంది ఆర్థిక ఇబ్బందులతో పిల్లల విద్యాభ్యాసం భరించడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు ప్రభుత్వం మరియు విద్యాశాఖ తరఫున జర్నలిస్టుల కుటుంబాలకు ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని కోరారు.కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా ఈ.పద్మారావు మాట్లాడుతూ విద్య ప్రతి కుటుంబానికి ప్రాధమిక హక్కు.జర్నలిస్టులు ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తారు.అలాంటి విలేకరుల పిల్లల విద్యకు చిన్న సహాయం అయినా పెద్ద ప్రోత్సాహమే అని పేర్కొన్నారు.

రంగారెడ్డి

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన తీగల అనిత రెడ్డి

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దమ్మ తండా లో మిస్టిక్ సెల్ అధ్యక్షుడు నరసింహ నాయక్, నూతన నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా.. మాజీ జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి హాజరై ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల్ అధ్యక్షులు ఆవుల యాదయ్య తోపాటు పెద్దమ్మ తండా మాజీ సర్పంచ్ విట్టల్ నాయక్ చిన్న తుప్పర గ్రామ మాజీ సర్పంచ్ పోలేపల్లి శ్రీనివాస్, చిన్న తుప్పర గ్రామ శాఖ అధ్యక్షులు ఆదిల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డి చంద్రయ్య, సతీష్ చందర్ మరియు తదితర నాయకులు యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేకాట స్థావరాలపై దాడులు

ఉదయగిరి పోలీసు సర్కిల్ పరిధిలోని వరికుంటపాడు దుత్తలూరు మండలాల్లో సీఐ వెంకట్రావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు ఇసుకపల్లిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.4,710 నగదు కోటివర్దన పల్లిలో కోడి పందేల స్తావరపై దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేసి మూడు కోళ్ళు మూడు బైక్లు రూ, ఐదువేలు నగదు దుత్తలూరు బీసీ కాలనీ నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆరు వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి

బాల్యవివాహాలను ఆపండి పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10 : రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 29 ఫిర్యాదులు.. రెవెన్యూ శాఖ -13, ఇతర శాఖలు 16, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 29 ఫిర్యాదులు అందాయి.ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు వినిపిస్తూ అర్జీలు సమర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.రెవెన్యూ శాఖకు 13,ఇతర శాఖలకు 16, మొత్తం 29 దరఖాస్తులు అందాయని తెలిపారు.అనంతరం జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్,సంక్షేమ హాస్టళ్లు గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా అవగాహన కల్పించాలి,పత్తి,వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.తరువాత కలెక్టర్ బాల్యవివాహాలను ఆపండి పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల అధికారులు, మండల తహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

*అందెశ్రీ మరణం తెలంగాణ జాతికి తీరని లోటు – సంగిశెట్టి ధనుంజయ్ —అందెశ్రీ కి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10 : ప్రముఖ కవి రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం మరణించాడని చెప్పడానికి మాటలు రావడం లేదు అందెశ్రీ అందని లోకాలకు వెళ్లాడని చింతిస్తున్నాను దుఃఖిస్తున్నాను బాధిస్తున్నాను శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను అందెశ్రీ జననం, 18,7,1961, సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన ఆయన స్వస్థలం గతంలో వరంగల్ జిల్లా అందెశ్రీ అసలు పేరు ఎల్లన్న పాటలు పాడడం వలన అందెశ్రీగా పేరు పొందాడు అందెశ్రీ పాటలు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది మరియు తెలంగాణ జాతీయ గీతం ఆయననే రచించి పాడిన అందెశ్రీ గారు జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం తెలంగాణ రాష్ట్ర అధికార గీతం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అందెశ్రీ అందుకున్న అవార్డులు, కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు, 2006లో గంగ సినిమాకి నంది పురస్కారం లభించింది, 2017లో దాశరథి సాహిత్య పురస్కారం లభించింది, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది, 2024 లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు తెలంగాణ సాహితి శిఖరం ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని ఆవేదనను కలిగించింది ఆయన మరణం సాహితీ లోకానికే కాదు మన అందరికీ తీరని లోటు తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనం గా మార్చి ప్రజల గుండెల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపజేసిన గొప్ప యోధుడు అందెశ్రీ నిత్యం పేద ప్రజల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికార గీతమైన జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం గేయం నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సీనియర్ జర్నలిస్ట్ నందనవనం పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగిశెట్టి ధనుంజయ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

E-పేపర్

రెడ్ కోట వద్ద పేలుడు – ఢిల్లీలో హై అలర్ట్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 బ్రేకింగ్: రెడ్ కోట వద్ద పేలుడు – ఢిల్లీలో హై అలర్ట్ — ఢిల్లీలో రెడ్ కోట సమీపంలోని పార్క్ చేసిన కారు ఒకటిలో సోమవారం సాయంత్రం (నవంబర్ 10, 2025) జరిగిన భారీ పేలుడులో ఒక వ్యక్తి మరణించగా, శక్తివంతమైన ఆ విస్ఫోటనం వల్ల పలువురు వాహనాలు మంటల్లో కూరుకుపోయాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఢిల్లీ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఘటనాస్థలికి ఏడు ఫైర్ టెండర్లు చేరుకుని, పోలీసు బలగాలు ప్రాంతాన్ని ముట్టడి చేశాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ పేర్కొంది. “రెడ్ కోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు జరిగింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గాయాలు జరిగి ఉండొచ్చని అనుమానం,” అని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఘటన స్థలం నుంచి వచ్చిన దృశ్యాల్లో మంటల్లో కాలి పోతున్న కార్ల నుంచి ఎగసే అగ్ని జ్వాలలు కనిపించాయి. భారీ శబ్దంతో జరిగిన పేలుడు తర్వాత అక్కడి ప్రజల్లో భయాందోళనలు చెలరేగగా, అనేక వాహనాలు దెబ్బతిన్నట్లు కనిపించాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.