Sunday, 22 March 2026

Blog

అన్నమయ్య

చిట్వేల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: హమాల్ కూలీకి తీవ్ర గాయాలు

-అమ్మవారి శాల వద్ద అతివేగం అనర్థం – బైక్ ఢీకొని కాలు విరిగినట్లు సమాచారం చిట్వేల్, నవంబర్ 12: పున్నమి ప్రతినిధి చిట్వేల్ పట్టణంలోని అమ్మవారి శాల సమీపంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన ఒక కేటీఎం బైక్ (నంబర్‌: AP 39 BG 5 98), పనికి వెళ్తున్న ఒక హమాల్ కూలీని ఢీకొనడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. -ఘటన వివరాలు సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హమాల్ కూలీ తన దినసరి పనికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కేటీఎం బైక్ డ్రైవర్ అతివేగంతో నియంత్రణ కోల్పోయి కూలీని బలంగా ఢీకొట్టాడు. ఢీకొట్టిన తీవ్రతకు బాధితుడు అక్కడికక్కడే నేలకూలి, తీవ్ర రక్తస్రావం తో కేకలు వేశాడు. ఈ ప్రమాదంలో బాధితుడి కాలు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -ఆసుపత్రికి తరలింపు – నిందితుడు పరార్ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులుసంఘటన స్థలానికి చేరుకుని, రక్తమోడుతున్న గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి, చిట్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి అక్కడ చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ప్రమాదానికి కారణమైన బైక్‌ను నడుపుతున్న యువకుడు సంఘటన జరిగిన వెంటనే తన బైక్‌ను అక్కడే వదిలిపెట్టి పారిపోయినట్లు తెలుస్తోంది. -పోలీసుల దర్యాప్తు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గురైన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బైక్ నంబర్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సంఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నందున, వాటి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. -స్థానికుల ఆందోళన అతివేగం కారణంగా జరిగే ప్రమాదాలు ఇటీవల చిట్వేల్ పట్టణంలో పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి శాల ప్రాంతంలో తరచుగా యువకులు బైక్‌లను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతున్నారని స్థానికులు ఆరోపించారు. పోలీసులు పహారా పెంచి,అతివేగంగా నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.0

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు — మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా

స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా విశేష కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భారత విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన ఆజాద్ గారు విద్యా విస్తరణ, సమాన అవకాశాలు మరియు జ్ఞాన ప్రబోధానికి అంకితభావంతో పనిచేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా APPTA A సంస్థ తరఫున అధ్యక్షుడు షబ్బీర్ హుస్సేన్ మరియు ప్రధాన కార్యదర్శి షానవాజ్ హుస్సేన్ మాజింద్రాణి గారు ప్రజలకు జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్య ప్రతి ఒక్కరికీ మౌలిక హక్కు అని గుర్తుచేస్తూ, ఆజాద్ గారి ఆశయాలను సాకారం చేయడం మనందరి బాధ్యతగా ఈ దినోత్సవం గుర్తు చేస్తోంది

విశాఖపట్నం

10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు

*అమరావతి:* మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సోమవారం విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు, ఒకేషనల్ విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 13 నుంచి 25 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 3 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 10 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 వరకూ పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ.110, వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా రూ.60, వయసు నిర్ధారణ రుసుము రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పైన పేర్కొన్న గడువు తేదీల్లో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటిస్తే తర్వాతి పని దినాన్ని గడువు తేదీగా పరిగణి స్తారు. https://bse.ap.gov.inలో అందుబాటులో ఉన్న పాఠశాల లాగిన్ ద్వారా మాత్రమే విద్యార్థులు ఫీజు చెల్లించాలి. సీఎఫ్ఎంఎస్ లేదా బ్యాంకు చలాన్ల ద్వారా చెల్లింపులను అంగీకరించరు.

భద్రాద్రి కొత్తగూడెం

అక్రమ ఇసుక రవాణా లారీ సీజ్

అక్రమ ఇసుక రవాణ లారీ సీజ్ అశ్వారావుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు పున్నమి ప్రతినిధి – 12నవంబర్2025 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అశ్వారావుపేట మండల పరిధిలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న టిప్పర్ లారీని పోలీసులు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ యయాతి రాజు నేతృత్వంలో సిబ్బంది రహదారి వెంట వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఊట్లపల్లి సెంటర్ వద్ద ఒక టిప్పర్ లారీ అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా లారీలో పెద్ద మొత్తంలో ఇసుక లోడు చేసి ఉన్నట్లు గుర్తించారు. తదుపరి విచారణలో ఆ లారీ ఆంధ్ర రాష్ట్రంలోని కొవ్వూరు ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది. డ్రైవర్ నుండి పోలీసులు వివరాలు సేకరించి, వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సై యయాతి రాజు మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణాపై ఎటువంటి రాజీ లేకుండా చర్యలు కొనసాగుతాయి. ప్రజలు కూడా ఈ రకమైన అక్రమ రవాణాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణకు పాల్పడుతున్న వారిపై మరింత లోతైన దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.

వనపర్తి

*మామిడి మాడ ఉన్నత పాఠశాలలో చెకుముకి పాఠశాల స్థాయి పరీక్ష

*జిల్లా పరిషత్ మామిడిమాడ ఉన్నత పాఠశాలలో చెకుముకి పరీక్ష రాస్తున్న దృశ్యం* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడ యందు చెకుముకి టాలెంట్ పరీక్షను ప్రారంభిస్తున్న ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు పాఠశాలలోని 8, 9 ,10వ తరగతి చదువుతున్న తెలుగు ఆంగ్ల మాధ్యమ పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన సైన్స్ పట్ల అభిరుచి ఆసక్తి పెంచేందుకు ప్రతి సంవత్సరము టాలెంట్ పరీక్ష నిర్వహించబోతా ఉన్నాము అందులో భాగంగా ఈరోజు చెకుముకి పాఠశాల స్థాయి టాలెంట్ పరీక్షను స్థానిక ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు ఈ పరీక్షకు దాదాపుగా 80 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు ఈరోజు జరిగే పరీక్ష పాఠశాల స్థాయిలో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థిని విద్యార్థులు ఈ నెలలోనే మండల స్థాయి జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందని మండల, జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ గెలుపొందిన వారు రాష్ట్రస్థాయిలో వచ్చే నెలలో పాల్గొనాల్సి ఉంటుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు*

ఆంధ్రప్రదేశ్

తెదేపాలో చేరిన కనిగిరి ఎంపీపీ

కనిగిరి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంతో వైకాపాకు చెందిన కనిగిరి ఎంపీపీ దంతలూరి ప్రకాశo తెదెపాలో చేరారు. మంగళవారం పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు శoకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు కండువా కప్పి ముఖ్యమంత్రి ఫార్టీ లోకీ ఆహ్వానించరు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, తెదేపా మండల అధ్యక్షులు కొండా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్

పెళ్లి కావడం లేదు అని యువకుడి బాలన్మరణం

హన్మకొండ జిల్లా ఆత్మకూర్ కు చెందిన యువకుడు బూర నరేష్ 30సం హైదరాబాదులోని అమీర్పేట్ లో హాస్టల్లో ఉంటూ క్లాత్ స్టోర్ లో వర్క్ చేసేవాడు తనకి పెళ్లి కావడం లేదు అని నిరాశ చెంది ఘట్కేసర్ లోని రైల్వే స్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్ వద్ద రేపల్లె ఎక్స్ప్రెస్ కిందపడి మరణించాడుGRP పోలీసులు కేసు నమోదు చేశారు

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెస్ఎంఈ పార్కులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటించి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 ఎమ్మెస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బహిరంగ సభ దృశ్యాలను లోకల్ యాప్ వీడియో రూపంలో అందిస్తుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.