Saturday, 21 March 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గుబ్బాల సూర్యప్రకాశ్‌ అప్పనపల్లి ZPHS పాఠశాల సందర్శన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను ఈరోజు జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ గుబ్బల సూర్యప్రకాశ్‌ గారు సందర్శించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, బోధనా విధానం, విద్యార్థుల హాజరు, మరియు సమ్మెటివ్‌ అసెస్మెంట్‌-1 పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్ష చేశారు. విద్యార్థులతో పరస్పర ముచ్చట చేస్తూ వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సూచనలు ఇచ్చారు. పాఠశాల ఆవరణను పరిశీలిస్తూ పచ్చదనం మరియు పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థుల్లో పోటీ భావన, నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్శనలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Blog

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు

ఈరోజు రైల్వే కోడూరు.ధర్మపురములో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరియు మాజీ శాసన సబ్యులు. కొరమట్ల. శ్రీనివాసులు గారి ఆదేసాలా మేర కు17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చెస్తునందుకు కుటమి సర్కారు పై నిరా సనాగా కోటి సంతకాలు కార్యక్రమములో పాల్గోని సంతకాలు చేయిస్తున్న వైఎస్సార్‌సీపీ ఏపీ టూరిజం మాజీ డైరెక్టర్‌ మండల నాగేంద్ర. పట్టణ కన్వీనర్ చెనంశెట్టి రమేష్.సర్పంచ్.బి.శివయ్య. రమణ b. నాగరాజు సుబ్బారాయుడు

తెలంగాణ

ఎంపీ గారిని కలిసిన శాలిగౌరారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి) 👉 వంగమర్తి గ్రామం నుండి చిత్తలూరు వరకు (ఆర్ అండ్ బి రోడ్డు ) 👉 శాలిగౌరారం నుండి భైరవుని బండ వయా అమ్మనబోలు (ఆర్ అండ్ బి రోడ్డు ) 👉 గురజాల నుండి ఉప్పలంచ (పి అండ్ ఆర్ రోడ్డు ) 👉 దోనబండ ఎక్స్ రోడ్డు నుంచి సాకర్ల (శాలిగౌరారం) వరకు (పి అండ్ ఆర్ రోడ్డు ) రోడ్ల నిర్మాణం కోసం త్వరగా నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులతో కలిసి శాలిగౌరారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి బుధవారం హైదరాబాదులో గౌరవ భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కోరారు.దీనికి ఎంపీ గారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని త్వరలోనే రోడ్లు మంజూరు అవతాయని మండల కాంగ్రెస్ అధ్యక్షులు తెలిపారు. ఎంపీ గారిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతా ధనంజయ,వడ్లకొండ పరమేష్, ఇంద్రకంటి యాదయ్య, యాదగిరి తదితరులు ఉన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా నిరసన

నందిగామ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ పాదయాత్ర మరియు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ముఖ్య సమన్వ యకర్తలుగా పాల్గొని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది.పోటు వైపున గాంధీ సెంటర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తంచేశారు. పార్టీ నేతలు ప్రస్తుత ప్రభుత్వ ప్రభుత్వ వైద్య విద్యా ప్రైవేటీ కరణతో పేద విద్యార్థులవల్ల ఉద్దేశ్యం నష్టం, కూటమి ప్రభుత్వం మనుషులే సంపద సృష్టించుకోవడం కోసం మాత్రమే ముందడుగు వేస్తోంది, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న సమయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అభివృద్ధి చెందాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగబోతుందని స్పష్టమైనది గా తెలిపారు. రాష్ట్రంలో సర్వాంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం లోపాలని, ప్రజల సమర్ధనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో బహుళంగా పాల్గొన్నారు.

తిరుపతి

ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడమే నా లక్ష్యం…. ఎమ్మెల్యే బొజ్జల

పార్టీ ని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండల , గ్రామ, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్టులు, బూత్ లెవెల్ ఏజెంట్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడం, పార్టీని బలోపేతం చేయడం తన లక్ష్యమని, కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభించేలా బాధ్యతలు కేటాయించామని, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించామని ఆయన స్పష్టం చేశారు. పదవి చిన్నదా, పెద్దదా అన్నది కాదని, బాధ్యతలతో పనిచేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఇవ్వడమే ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురువుగారు. ముత్యాల పెంచలయ్య గారికి. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు స్థానిక రంగనాయకులపేటలోని ఉన్నటువంటి శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురువుగారు.ముత్యాల పెంచలయ్య గారికి. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అధ్యాపకులు విద్యార్థులు ఆయన స్నేహితులు బంధువులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

క్లస్టర్ యూనిట్ ఇన్‌ఛార్జిలు, బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా – పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో క్లస్టర్ యూనిట్ ఇన్‌ఛార్జిలు మరియు బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్ర మం నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాల యంలో బహుళ ఉత్సాహంతో నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, పార్టీ పదవి పొందడం గౌరవప్రదమైన విషయం అని పేర్కొన్నారు. “పార్టీలో చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా కష్టపడిపనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పదు,” అని ఆమె స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ, మనబోతుల శ్రీరామ్ పార్టీ పట్ల విశ్వాసం, నిబద్ధతతో పనిచేసి రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఎంపిక కావడం గర్వ కారణమని అభినందించారు. “కోట్లల్లో మనకూ ఒక పదవి రావడం గౌరవప్రదమైన విషయం. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలి,” అని పిలుపునిచ్చారు. సౌమ్య మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతౌ ల్యంగా ముందుకు తీసుకెళ్తోం దని తెలిపారు. ప్రజల వద్దకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.“బూత్ కన్వీనర్లు, యూనిట్ మరియు క్లస్టర్ ఇన్‌ఛార్జిలు పార్టీకి వెన్నెము కలు. వీరు సమర్థవంతంగా పని చేస్తే పార్టీ మరింత బలపడుతుం ది, ప్రజా విశ్వాసం పెరుగు తుంది,” అని ఎమ్మెల్యేఅన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బొచ్చుల సుబ్రహ్మణ్యం బోసు, లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, మండల పట్టణ తెదేపా నేతలు, గ్రామ వార్డు నాయకులు, కూటమి నేతలు, మహిళా కార్యకర్తలు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్‌ఛార్జిలు, బూత్ కన్వీనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగా నియమితు లైన బాధ్యులు పార్టీ పట్ల అంకితభావంతో పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

జనగాం

హమాలి యూనియన్ జిల్లా మహాసభను జయప్రదం చేయండి. ఆల్ హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రాపర్తి రాజు పిలుపు

Neela Rakesh పున్నమి ప్రతినిధి ఘనపూర్ స్టేషన్ ఘనపూర్ (స్టే):-ఈరోజు స్టేషన్ ఘనపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఐకెపి సెంటర్లను సందర్శించి సెంటర్ లో పనిచేసే హమాలి కార్మికులతో సంఘం జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ ఈనెల 14 వ తేది శుక్రవారం రోజున ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ జనగామ జిల్లా మహాసభ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఉంటుందని ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా హమాలీ కార్మికులు హాజరై మహాసభను జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది హమాలీ కార్మికులు ఉన్నారని జిల్లాలో వేలాదిమంది కార్మికులు హమాలీ పని మీద ఆధారపడి బ్రతుకుతున్నారని. కానీ వారికి ఎలాంటి సౌకర్యాలు గాని పనిభద్రత గాని లేదు అనేక కుటుంబాలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉంది. హమాలీలు మూటలు, బస్తాలు మోసి మోకాళ్లు నడుము నొప్పులతో అలాగే పనిచేసే చోట దుమ్ము ధూళితో తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతున్నారు . హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు ఇల్లు ఇస్తామని ప్రకటించింది. హమాలీ కార్మికుల ఇంటి నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని. కేరళలో కమ్యూనిస్టు వామపక్ష ప్రభుత్వం హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి హమాలీ కార్మికుల ఇంటి నిర్మాణం కోసం 7 లక్షల 80 వేల రూపాయలను కేటాయిస్తుందని అలాగే ప్రమాద బీమాను 16 లక్షల రూపాయలు అందిస్తుందని అలాగే హమాలీ కార్మికులకు రెండు రకాల పెన్షన్లు అమలుపరుస్తుంది ఒకటి కుటుంబ పెన్షన్ రెండవది 60 సంవత్సరాలు దాటిన కార్మికునికి వ్యక్తిగత పెన్షన్ అందిస్తుందని తద్వారా కేరళ వామపక్ష ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తుందని దేశంలోని అన్ని రాష్ట్రాలకు భిన్నంగా కార్మికుల పక్షపాతిగా వ్యవహరిస్తుంది దేశంలోని ఇతర రాష్ట్రాలకు కేరళ ఒక రోల్ మోడల్ గా ఉందని కేరళ తరహా కార్మిక పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు కొడపాక యాకయ్య, హమాలి యూనియన్ నాయకులు బొల్లం యాదగిరి, గుమ్ముల కృష్ణమూర్తి, వెలిశాల రాజు, తోడంగల అనిల్, తెల్దారి దశరథం, కత్తుల రత్నాకర్, అన్నెపు రాజు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

యాచారం మండలం వికలాంగులందరికీ ఉచిత బస్ పాసులు… మండల అధ్యక్షులు డేరంగుల ఈశ్వర్

పున్నమి నవంబర్ 12 రంగారెడ్డి జిల్లా యాచారం మండల: వికలాంగులందరికీ ఉచిత బస్పాసులు అందజేయడం జరుగుతుంది తేదీ 13 నుండి 18 తారీకు వరకు మీ యొక్క గ్రామ శాఖ అధ్యక్షులకు అందజేయవలెను ఒక డిస్టిక్ పాస్ కావాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ సదరం జిరాక్స్స చిన్న సదరం జిరాక్స్ ఒక ఫోటో ఒక సిటీ పాస్ కావాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ సదరం జిరాక్స్ చిన్న సదరం జిరాక్స్ ఒక ఫోటో జతపరిచి మీ యొక్క గ్రామ శాఖ అధ్యక్షులకు అందజేయవలెను ఈ యొక్క సదా అవకాశం యాచారం మండల వికలాంగులు అందరూ వినియోగించుకోవాలని మీ మండల అధ్యక్షులు డేరంగుల ఈశ్వర్

E-పేపర్

నర్సరీ వ్యాపారులు నిబంధనలను పాటించి నాణ్యమైన మొక్కలు అందించాలి రైల్వేకోడూరు ఉద్యాన అధికారి భాస్కర్.

నర్సరీ వ్యాపారులు నిబంధనలను పాటించి నాణ్యమైన మొక్కలు అందించాలి రైల్వేకోడూరు ఉద్యాన అధికారి భాస్కర్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) జిల్లా ఉద్యాన అధికారిణి, సుభాషిని ఆదేశాల మేరకు రైల్వేకోడూరు మండల ఉద్యాన మరియు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా బుధవారం నాడు రైల్వే కోడూరు మండలంలోని పలు బొప్పాయి నర్సిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారి భాస్కర్ మాట్లాడుతూ నర్సరీ వ్యాపారులందరూ కూడా నర్సరీ యాక్ట్ 2010 నిబంధనలు ప్రకారము నర్సరీలను నిర్వహించి రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని కోడూరు ఉద్యాన అధికారి భాస్కర్ తెలియజేశారు. అదేవిధంగా మొక్కల కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించిన రిజిస్టర్లలో తగు వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని, మొక్కలు కోనుగోలుకి సంబంధించి రైతులకు రసీదులు అందించాలని చిట్వేలు ఉద్యాన అధికారి లోకేష్ తెలియజేశారు. బొప్పాయి విత్తనాలకు సంబంధించి ఎలాంటి కల్తీ జరగకుండా నర్సరీ నిర్వాహకులు విత్తనాలకు సంబంధించి రిజిస్టర్ లను నిర్వహించాలని కోడూరు మండల వ్యవసాయ అధికారి, సందీప్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సరీ యజమానులు, రైతులు, రాఘవరాజపురం మరియు అనంతరాజుపేట ఉద్యాన సహాయకులు సుధీర్ కుమార్ వర్మ మరియు హరిబాబు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.