Saturday, 21 March 2026

Blog

తిరుపతి

పుదూరు లక్ష్మణ్ రెడ్డి కర్మ క్రియలలో పాల్గొన్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి బిపి అగ్రహారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుదూరు లక్ష్మణ్ రెడ్డి కర్మ క్రియలలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, పాల్గొని లక్ష్మణ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, రత్నం రెడ్డి, ఆర్కార్డు శంకర్, పటాన్ ఫరీద్, కంట ఉదయ్ కుమార్, ముని కృష్ణారెడ్డి, సాధన మున్నా రాయల్ , బాలా గౌడ్ పాల్గొని తమ సంతాపం తెలియజేశారు.

జోగులాంబ గద్వాల

శ్రీ జోగులాంబ దేవిని దర్శించుకున్న HRPCP తెలంగాణ అధ్యక్షురాలు.

అలంపూర్ : నవంబర్ 12 ( పున్నమి ప్రతినిధి ) హెచ్ఆర్పిసిపి ( హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ ) తెలంగాణ అధ్యక్షురాలు అనురాధ రెడ్డి బుధవారం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం జోగులాంబ దేవి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు, వేదపండితులతో ఆశీర్వచనం పొందారు. అనంతరం అనురాధ రెడ్డి మాట్లాడుతూ …. మానవుల హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నేనుంటానని సగర్వంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ పి సి పి సభ్యులు జ్యోతి, కవిత, రశ్మిత, కవిత, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు తిరుపాల్, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్యను దర్శించిన విశాఖ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుటుంబసమేతంగా విచ్చేశారు. వీరికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి స్వాగతం పలికి ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ గురువేద దక్షణమూర్తి సన్నిధిలో వేదపండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు చేయించి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

పేదోళ్ల సొంతింటికల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో సుఖబ్రాహ్మశ్రమం వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదోళ్ల సొంతింటికల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం మన్నారు. ఒకే రోజులో పేదలకు 3 లక్షల ఇళ్ళ గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో ఇదొక చరిత్రని కూటమి పాలనలో పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మేలు చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని అయన తెలిపారు.

తిరుపతి

టిడిపి మండలాధ్యక్షుని చొరవతో వీధిలైట్లు ఏర్పాటు

తొట్టంబేడు నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు పంచాయతీ పలు ప్రాంతాల్లో మండల టిడిపి అధ్యక్షులు రావిళ్ళ మునిరాజు నాయుడు సూచనల మేరకు , ఎంపీడీవో సురేంద్రనాథ్, డిప్యూటీ ఎంపీడీవో గిరిధర్ ఆదేశాల మేరకు చిలకా వారి కండ్రిగ, మయూరి టవర్స్ రోడ్డు, బంగారమ్మ కాలనీలోని 3,5 వీధులలో బుధవారం వీధిలైట్లు ఏర్పాటు చేశారు. గురువారం బంగారమ్మ కాలనీలోనే మిగిలిన వీధులు, సి ఆర్ ఎన్ కండ్రిగ, సాయి నగర్, రామచంద్రపురం రోడ్డు, మయూర్ అపార్ట్మెంట్, కుర్నగుంట హరిజనవాడ ప్రాంతాల్లో వీధిలైట్లు వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి భార్గవ్, పంచాయతీ సర్పంచ్ సుబ్బయ్య తెలిపారు. ఈ వీధిలైట్లు ఏర్పాటు కార్యక్రమంలో తొట్టంబేడు సింగిల్ విండో చైర్మన్ భీమాల భాస్కర్ ముదిరాజ్, చిలకూరు మనీ, చిలక వారి కండ్రిక కృష్ణయ్య లు పాల్గొన్నారు.

తిరుపతి

వసతి గృహంలో ఆర్.ఓ. ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని బి సి బాలుర వసతి గృహం నందు నూతన ఆర్.ఓ. ప్లాంట్ ను బుధవారం నాడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్ ఆంధ్రప్రదేశ్

పేదల పాలిట పెన్నిధి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!🔹వింజమూరు అశోక్ నగర్ లో నవ వధువుకు 10 వేల రూపాయల పెళ్లి కానుక..

నవంబర్ 12న వింజమూరు మండల కేంద్రంలోని అశోక్ నగర్ లో పాజర్ల చిన్నయ్య – శ్రీమతి శోభా దంపతుల కుమార్తె చి||ల||సౌ|| వనజ వివాహం ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ కాకర్ల చారిటబుల్ ట్రస్టు తరపున రూ.10,000 (పది వేల రూపాయలు) లను పెళ్లి కానుకగా వింజమూరు మండల టీడీపీ పార్టీ నాయకులు ద్వారా వధువు కుటుంబ సభ్యులకు అందజేయించి, తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రతి పేద కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వింజమూరు మండల టీడీపీ అధ్యక్షుడు గూడ నరసారెడ్డి, టౌన్ టీడీపీ అధ్యక్షులు యోగినేని శ్రీనివాసులు, మండల ఎస్సీ సెల్ విభాగం సీనియర్ నాయకులు జి. హజరత్, బూత్ కో-కన్వీనర్ జి. జ్ఞాన కుమార్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పెడోడితో పరిహాసం. ప్రయాణికుడి శాడిజం.

(పున్నమి ప్రతినిధి విశాఖ జిల్లా తేదీ 13-11-2025) *మానవత్వానికి మాయనీ మచ్చ తేచ్చే ఘటన ఇధి.రైల్వే ఫ్లాట్‌ఫారమ్ పై ఒక యువకుడి వడ్డ ఆహారం కొనుగొల్లు చెసినా ఓ ప్రయాణీకుడు దానికి డబ్బు ఇవ్వకుండా శాడిజం చూపించాడు.తనకు రావాల్సిన డబ్బు అడుగుతూ ఆ యువకుడు రైలు వెంట పరిగెత్తి అలిసిపోయి ఆగిపోయాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. వైరల్ అయిన ఈ వీడియో చూసి పేద వాలాతో పరిహాసం అదే ప్రతి వ్యక్తులను శిక్షించాలి అని నేడు పౌరులు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

చందర్లపాడు గ్రామ పార్టీ, బూత్ కన్వీనర్లు ప్రమాణస్వీకారం ఘనంగా

చందర్లపాడు మండలంలో బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, పోలింగ్ బూత్ కన్వీనర్ల ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రధాన అతిథిగా పాల్గొని ప్రసంగం చేశారు. ఆమె మాట్లాడుతూ, “రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక లోటును అధిగమిస్తూసంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తున్నారు. మా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా చూడడం మనందరి బాధ్యత” అన్నారు. క్రమశిక్షణతో, సమన్వయంతో పార్టీ శ్రేణులు పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.క్రమశిక్షణతో జరిగిన ఈ కార్యక్రమంలో కోట వీరబాబు, పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

PPP విధానాన్ని ఉపసoహoరించు కోవాలి మేకపాటి

మెడికల్ కాలేజీలా ప్రివేటికరణను వ్యతిరేకిస్తూ ఉదయగిరి లో ర్యాలీ నిర్వహించారు వైసీపీ యువ నాయకుడు మేకపాటి అభినవ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం PPP విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తే పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు ఈ విధానాన్ని ఉపసoహoరించు కోవాలి డిమాండ్ చేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.