Wednesday, 6 May 2026

Blog

తూర్పు గోదావరి

శ్రద్ధాంజలి

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు పెడసనగంటి బాలకృష్ణ గారు సిపిఐ ఏలూరు జిల్లా సమితి సభ్యులు ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు స్వర్గస్తులైనారు ఏలూరు జిల్లా సమితి సభ్యులు సిపిఐ నాయకులు ఆయనకు నివాళులర్పించారు END

E-పేపర్

సత్య సాయి బాబా మందిర 29వ వార్షికోత్సవానికి ఇదే మా ఆహ్వానం

రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు లోని శ్రీ సత్య సాయి బాబా మందిర 29వ వార్షికోత్సవానికి ఇదే మా ఆహ్వానం వార్షికోత్సవ తేదీ 10/12/2025.(బుధవారం). కార్యక్రమం వివరాలు. ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ఓంకారము 21 సార్లు, ధ్యానం, సుప్రభాతం, అష్టోత్తర శతనామావళి, తదనంతరం నగర సంకీర్తన. 9:30 గంటలకు సాయి వ్రతం. 11:30 గంటలకు భజన మరియు నారాయణ సేవ. (అన్నదానం) సాయంత్రం 4 గంటలకు చిన్మయా ఆశ్రమం. పూజ్యశ్రీ స్వామిని శ్రేయానంద సరస్వతి గారి చే భగవద్గీత పారాయణం తదనంతరం బాలవికాస్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమం 6:00 గంటల నుండి భజన 7:00 గంటలకు మంగళహారతి తదనంతరం ప్రసాద వితరణ. ఓం శ్రీ సాయిరాం కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సత్య సాయి నాధుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ రుక్మిణి కళ్యాణం ఆంగ్ల కవిత్వం ఆవిష్కరణ

—————————————- నెల్లూరుకు చెందిన ఆంగ్ల కవి మైదవోలు వెంకట శేష సత్యనారాయణ రచించిన శ్రీ రుక్మిణి కళ్యాణం ఆంగ్ల కవితా సంపుటి సుజాతమ్మ కాలనీ లోని కృష్ణ మందిరం లో జరిగింది. దేవాలయ ట్రస్టీ డాక్టర్ సర్వేపల్లి అజయకుమార్, బాలాజీనగర్ పూర్వ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గ్రంధం ఆవిష్కరణ చేశారు. గ్రంథ సమీక్ష అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ చేశారు. మహతి కలం పేరుతో నెల్లూరు నుండి భక్తి పరంపరలో రాసిన 8వ ఈ పుస్తకంకు ముందు మాట రాసే భాగ్యం తనకు కలిగింది, అందుకు రచయితకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా రచయిత గ్రంథ ఆవిష్కరణకు విచ్చేసిన టంగుటూరు గోపాల్ రెడ్డి ,డా సర్వేపల్లి అజయ్ కుమార్ ,ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, డా పెరుగు రామకృష్ణ , డా నదీమ్ లను సత్కరించారు. రచయిత మహతి దంపతులను ట్రస్టీ డాక్టర్ అజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు..!

తిరుపతి

ఏడు గంగమ్మలకు ముక్కంటి పట్టు వస్త్రాల సమర్పణ

శ్రీకాళహస్తి రూరల్, డిసెంబర్ 09 : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున మంగళవారం నాడు ఏడు గంగమ్మల జాతర సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం నుండి ఏడు గంగమ్మలకు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయన సతీమణి రిషితమ్మ, దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు కొట్టె సాయి, భాజపా నాయకులు కోలా ఆనంద్, పాలకమండలి సబ్యులు, ఆలయ అధికారులు పాల్గొని ఏడు గంగమ్మలకు ముక్కంటి తరుపున పట్టు వస్త్రాల సమర్పణ చేసారు. వీరికి గంగమ్మ జాతర కమిటీ సభ్యులు స్వాగతం పలికి, ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేసి తీర్ధ ప్రసాదలు అందజెశారు.

తిరుపతి

గ్రామీణ బ్యాంక్ ఎగువవీధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీకాళహస్తి రూరల్, డిసెంబర్ 09 : తొండమనాడులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఎగువవీధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు తిరుపతి అగర్వాల్ మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించగ కార్యక్రమాన్ని రీజినల్ మేనేజర్ పి.ప్రకాశ్ రత్న బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా రీజినల్ మేనేజర్ ప్రకాష్ రత్నబాబు మాట్లాడు… ఈ అవకాశాన్ని గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులు, గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అగర్వాల్ కంటి వైద్య హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 80 మంది ఖాతాదారులకు తిరుపతి అగర్వాల్ మెడికల్ హాస్పిటల్ వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి, అవసరమైన చికిత్సపై సూచనలు ఇచ్చారు. పలు కంటి సమస్యలను గుర్తించి ఖాతాదారులకు తగిన జాగ్రత్తలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎస్.బాల నరసింహం మరియు సిబ్బంది కలిసి శిబిరాన్ని విజయవంతం గా నిర్వహించారు.

తిరుపతి

కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నేతలు

శ్రీకాళహస్తి డిసెంబర్ 09, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు, సోనియా గాంధీ గారి 79 వ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం, రేణిగుంట మండలం,గురవరాజు పల్లి ఎస్టీ కాలనీ నందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిల్లలు నడుమ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ….పేదల కోసం ప్రాణాలు అర్పించి, ప్రజల కోసమే జీవిస్తూ ప్రజలతో మమేకమై నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక కుటుంబం గాంధీల కుటుంబమని పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్, ఏర్పేడు మండల నాయకులు గోపాలరావు, శ్రీకాళహస్తి మండల యువజన అధ్యక్షులు నవీన్, నాగరాజు, మహేష్, సాయి, సారధి, బాబు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

స్కెటింగ్ క్రీడకారుని ప్రోత్సహకం అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి డిసెంబర్ 09, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసనసభసబ్యులు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి ఏర్పేడుకు చెందిన 10 సంవత్సరాల అంధ బాలుడు హర్షవర్ధన్ 220 కిలోమీటర్లు నంగిలి నుంచి శ్రీకాళహస్తికి స్కెటింగ్ ప్రారంభించి శ్రీకాళహస్తికి చేరుకున్న సందర్బంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హర్షవర్ధన్ ను శుభాకాంక్షలు తెలిపి, సన్మానించి రూ 20000/-అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హర్షవర్ధన్ శ్రీకాళహస్తి వాసి అయినందుకు తనకు చాల గర్వాంగవుందని అనుకున్నది సాదించాలంటే ఏది అడ్డు కాదు అని హర్షవర్ధన్ నిరూపించాడని ఈ క్రీడకారుని ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ తో కల్పించి ప్రభుత్వం ద్వార ప్రోత్సహకం అందిస్తామని అయన తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి లోని యాదవ్ పాలెం వి పీ ఆర్ నేత్ర కార్యక్రమం నిర్వహించారు

ఉదయగిరి లోని యాదవ్ పాలెం వి పీ ఆర్ నేత్ర కార్యక్రమం నిర్వహిచారు ఈ కార్యక్రమంలో కంటి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంపీ,ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతులు జిల్లాకు సామాజిక సేవలో ముందు ఉంటారని కొనియాడారు పేద మధ్య తరగతి కుటుంబాల్లో వేమిరెడ్డి దంపతులు ఆశాజ్యోతిగా నిలుస్తారన్నారు

రంగారెడ్డి

* బడంగ్పేటలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 09 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బడంగ్ పేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఉన్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ కే దక్కిందని అన్నారు. త్యాగానికి మారుపేరు సోనియా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ ఎల్మేటి అమరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, నవారు మల్లారెడ్డి, గట్టు బాలకృష్ణ, దిండు శ్రీనివాస్ గౌడ్, క్యారగరి శ్రీధర్, బొల్లపల్లి కుమార్, అమృత నాయుడు, టేకుల సుధాకర్ రెడ్డి, సూర్ణగంటి విజయ్, గిరి ముదిరాజ్, ధనేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.