Saturday, 21 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు మండలంలోని బుక్కాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ అధికారుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (UDA) పథకం కింద మంజూరైన గృహా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, నూతనంగా నిర్మించబడిన గృహామును రిబ్బన్ కటింగ్ చేసి గృహప్రవేశోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ — కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న నూతన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే పథకాల గురించి వివరిస్తూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేద మరియు అర్హులైన కుటుంబాలకు స్వంత గృహం కలిగే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.అలాగే తన నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరయ్యేలా తాను కృషి చేస్తానని, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వింజమూరు మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉదయగిరి హౌసింగ్ డిఈఈ సయ్యద్ పీరన్,దుత్తలూరు వర్క్ ఇన్స్పెక్టర్ S. పోలయ్య, వింజమూరు వర్క్ ఇన్స్పెక్టర్ K.సందీప్ రాజ్,డిపార్ట్మెంట్ అధికారులు డీఈవో. ప్రసాద్, బాలాజీ, ఆన్సర్, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొని, నూతన గృహాల నిర్మాణం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

E-పేపర్

క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ.

వ్యాధిగ్రస్తులు వైద్యులు సిబ్బంది సూచనలు సలహాలు పాటించడంతోపాటు ఆరు నెలల పాటు మందులు వాడితే పూర్తిస్థాయిలో క్షయ వ్యాధి దూరమవుతుందని నందలూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ప్రభుత్వ వైద్యులు శరత్ కార్తీక్ లు అన్నారు. ప్రధానమంత్రి టీబి ముక్తాభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నందలూరు మండలంలోని 13 మంది టీబీ పేషెంట్లను నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ దత్తత తీసుకున్నారు. గురువారం నందలూరు ప్రభుత్వ వైద్యశాల లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వ్యాధి సోకిన వారు ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచితంగా అందించే మందులను వాడడంతో పాటు బహిరంగ ప్రదేశాలలో ప్రజలలో తిరగకుండా మాస్కులు కచ్చితంగా వాడాలన్నారు. తద్వారా వ్యాధి నుండి బయటపడవచ్చున్నారు.మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో అధిక శక్తి లభిస్తుందన్నారు. క్షయ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంట్లో కూడా మాస్కు ధరించి ఉండాలన్నారు. అనంతరం రెండు నెలలకు సరిపడా పౌష్టిక ఆహార పదార్థాలను సర్పంచ్ జంబు సూర్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి సుబ్రహ్మణ్యం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రణీత్ శివరాం సిహెచ్ఓ వెంకటనారాయణ ఆరీఫ్. మాజీ మార్కెటింగ్ డైరెక్టర్లు బె స్త సుబ్రహ్మణ్యం తెలుగుదేశం నాయకులు తుమ్మాది శివకుమార్ తాజ్ మార్ట్ సయ్యద్ అఫ్జల్ శివ నరసింహులు పఠాన్ మేహార్ ఖాన్ ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

E-పేపర్

అన్నదాన సత్రం కు 50,000 విరాళం ఇచ్చిన కుంచా సుధాకర్

అన్నదాన సత్రం కు 50,000 విరాళం ఇచ్చిన కుంచా సుధాకర్ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండలం, బుడుగుంటపల్లె గ్రామంలో వేలసిన అయ్యప్ప స్వామి ఆలయం ప్రక్కన నిర్మిస్తున్న అన్నదాన సత్రమునకు సింగిరివారిపల్లి వాస్తవ్యులు కీll శేll కుంచా జయరామయ్య, కుంచా వెంకట సుబ్బమ్మ జ్ఞాపకార్థం కుమారుడు కుంచా సుధాకర్ బాబు, కోడలు కళావతమ్మ రూ. 50,000/- ల విరాళమును, ఆలయ ధర్మకర్త, పూజారి అదునుకోట నరసింహస్వామి వారికి అందించారు. వీరికి వీరి కుటుంబానికి ఆ హరి హర సుతుడైన అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవం ఆశీస్సులు ఎల్ల వేళల ఉండాలనికోరుతున్నాను. దాతలు ఇంకా ముందుకు వచ్చి అన్నదాన మండపం నిర్మాణమునకు పూర్తిగా సహకరించ వలసినదిగా కోరుతున్నానని తెలుపుతున్నాను. ఆలయాలు అభివృద్ధి జరగాలంటే భక్తుల సహాయ సహకారాలు ఎంతో అవసరమున్నది. కావున భక్తులు తమకు తోచిన, శక్తి కొలది విరాళములు ఇవ్వవలసినదిగా కోరుతున్నాను.

అనకాపల్లి

అనకాపల్లి జిల్లా లో వరుస చోరీల కేసుల పరిష్కారంలో కీలక విజయాన్ని సాధించిన జిల్లా పోలీసులు: ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్

అనకాపల్లి, (చోడవరం) నవంబర్ 13: ఇటీవల చోడవరం, బుచ్చయ్యపేట, వి.మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో వరుసగా రాత్రి వేళల్లో దేవాలయాల్లో హుండీ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను చోడవరం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి మొత్తం 26 కేసుల్లో దొంగతనాలకు గురైన 10.32 గ్రాముల బంగారం, 26 తులాల వెండి, నగదు 44,218 రూపాయలు — మొత్తం 66,418 రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు పెద్దవాడు కాగా, మిగిలిన ముగ్గురు మైనర్లు. నిందితులు జల్సాలకు అలవాటు పడి, దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని రాత్రి వేళల్లో హుండీలను దొంగిలించేవారు. నేర స్థలాల్లో లభించిన ఆనవాళ్ల ఆధారాలతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో విజయం సాధించారు. నిందితులు: 1. రాసూరి పోతురాజు, తండ్రి అప్పారావు, 20 సంవత్సరాలు, బుడబుక్కల (ఎస్టీ), దొరబాబు కాలనీ, వడ్డాది గ్రామం, బుచ్చయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లా. మైనర్ నిందితులు (జువెనైల్): 1. బుచ్చయ్యపేట మండలం 2. బుచ్చయ్యపేట మండలం 3. బుచ్చయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లా (పరారీలో ఉన్నాడు) నిందితులు చెడు వ్యసనాలకు బానిసై ఈ హుండీ చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన బంగారం, వెండి, నగదులో కొంత ఖర్చు చేసి, మిగతా సొత్తును విజయరామరాజుపేట ప్రాంతంలో దాచి ఉంచారు. ఈ రోజు ముగ్గురు బైక్‌పై వడ్డాది నుండి చోడవరం వైపు వస్తుండగా చోడవరం పోలీసులు గౌరిపట్నం వద్ద వారిని పట్టుకున్నారు. వీరిలో మొదటి ముగ్గురు అన్ని కేసుల్లో పాల్గొనగా, నలుగవ వ్యక్తి ఒక కేసులో మాత్రమే పాల్పడ్డాడు. కేసులు నమోదు అయిన పోలీస్ స్టేషన్లు: చోడవరం – 2, బుచ్చయ్యపేట – 11, వి.మాడుగుల – 9, చీడికాడ – 2, దేవరాపల్లి – 2, మొత్తం – 26 కేసులు. ఈ కేసులను ఎస్పీ తుహిన్ సిన్హా మార్గదర్శకత్వంలో, అదనపు ఎస్పీ క్రైమ్స్ ఎల్. మోహనరావు పర్యవేక్షణలో, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం. శ్రావణి ఆధ్వర్యంలో చోడవరం ఇన్స్పెక్టర్ పి. అప్పలరాజు, ఎస్సై బి. నాగకార్తీక్, ఎస్సై బి. జోగారావు మరియు సిబ్బంది ఆధునిక సాంకేతిక పద్ధతులతో ఛేదించారు. అధికారులు వారిని అభినందిస్తూ ప్రశంస పత్రాలు అందజేశారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ — ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించాలని సూచించారు. ఇళ్లలో విలువైన వస్తువులు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బయట ప్రాంతాలకు వెళ్ళేవారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎం‌ఎస్) సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భద్రత లేని దేవాలయాల్లో విలువైన వస్తువులు, నగదు ఉంచరాదని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్పీలు ఎం. దేవ ప్రసాద్, ఎల్. మోహనరావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం. శ్రావణి, చోడవరం ఇన్స్పెక్టర్ పి. అప్పలరాజు, ఎస్సై బి. నాగకార్తీక్, ఎస్సై బి. జోగారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వరంగల్

వరంగల్ బస్టాండ్ లో పడవ ప్రయాణం

వరంగల్ బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వరంగల్‌ బస్టాండ్‌ పేరుతో నయవంచన చేస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ అసమర్థతతో బస్టాండ్‌ నిర్మాణానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. చారిత్రక నగరమైన వరంగల్‌కు బస్టాండ్‌ నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో వరంగల్‌ ఆత్మగౌరవ పోరాటం మహా ధర్నా- 2 పేరుతో గురువారం బీజేపీ వరంగల్‌ బస్టాండ్‌ ఏర్పాటు ప్రాంతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులకు ఉచిత పడవ ప్రయాణం వినూత్న నిరసన చేపట్టింది

అనకాపల్లి

నెలవారీ నేర సమీక్షా సమావేశం దర్యాప్తు పురోగతిపై ఎస్పీ తుహిన్ సిన్హా సూచనలు

ఉత్తరాంధ్ర ప్రతినిధి నవంబర్ 13 అనకాపల్లి జిల్లా పోలీసు అధికారి తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉప విభాగాధికారులు, వృత్తాధికారులు, ఉప నిరీక్షకులు పాల్గొన్నారు. సమావేశంలో గత నెలలో నమోదైన నేర కేసులపై దర్యాప్తు పురోగతి, పెండింగ్‌లో ఉన్న వారెంట్లు, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా, మత్తు పదార్థాల కేసులు, సైబర్ నేరాలు, అణగారిన వర్గాలపై నేరాలు, బాలలపై దాడులు, మరణ దర్యాప్తు కేసులు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, రవాణా నియమాల అమలు వంటి అంశాలను విపులంగా సమీక్షించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ “ఒక కేసు నమోదైన నాటి నుంచి చార్జ్‌షీట్ దాఖలు అయ్యే వరకు విచారణాధికారులు సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాలు, పత్రాధారాలను సమగ్రంగా సేకరించి, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సమన్వయంగా పనిచేయాలి. కేసుల్లో శిక్షలు పడేలా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి,” అని సూచించారు. మత్తు పదార్థాల కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, పట్టుబడిన నిందితులపై వెంటనే చార్జ్‌షీట్ దాఖలు చేయాలని, ఇంకా పట్టుబడని నిందితులు అరెస్ట్ అయిన వెంటనే వేరుగా చార్జ్‌షీట్ వేయాలని ఆదేశించారు. కోర్టుల్లో శిక్షలు పడే విధంగా అన్ని దశల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. యు ఐ కేసుల వేగవంతమైన పరిష్కారం, మత్తు పదార్థాలు విక్రయించే వారు, వినియోగించే వారిపై కఠిన చర్యలు, ఆస్తుల గుర్తింపు, ఆర్థిక దర్యాప్తు వంటి అంశాలలో నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. ముఖ్యమైన కేసులు, ముఖ్యంగా మరణ దర్యాప్తు కేసుల్లో మృతదేహ పరిశీలన, ఫోరెన్సిక్ నివేదికలు, సాక్షుల వాంగ్మూలాల సేకరణలో ఆలస్యం లేకుండా ప్రతి కేసును పూర్తిగా దృష్టిలో ఉంచాలని సూచించారు. సైబర్ నేరాల విషయంలో బాధితులకు వెంటనే స్పందించడం, వారి ఖాతాల్లోని డబ్బు నిలిపివేయడం, 1930 హెల్ప్‌లైన్ ప్రచారాన్ని మరింత బలపరచాలని ఆదేశించారు. 112 అత్యవసర సేవ స్పందన సమయాన్ని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని, వాహనాలపై నిబంధనల అమలు, బహిరంగంగా మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో వేగం చూపి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని ఎస్పీ ఆదేశించారు. అన్ని విచారణాధికారులు తమ పరిధిలోని కేసు దస్తావేజులను పరిశీలించి, పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించి నేర నియంత్రణతో పాటు ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన జిల్లా అదనపు పోలీసు అధికారి ఎల్.మోహనరావు, అనకాపల్లి ఉపవిభాగ అధికారి ఎం.శ్రావణి, నర్సీపట్నం ఉపవిభాగ అధికారి పి.శ్రీనివాసరావు, నిరీక్షకులు బెండి వెంకటరావు, ఆర్.మల్లికార్జునరావు, ఎల్.రేవతమ్మ, పి.అప్పలరాజు, టి.విజయ, ఎల్.మన్మధరావు, అలాగే ఉపనిరీక్షకులు సహా మొత్తం 44 మందికి ఎస్పీ తుహిన్ సిన్హా ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు అధికారులు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, అనకాపల్లి ఉపవిభాగ అధికారి ఎం.శ్రావణి, నర్సీపట్నం ఉపవిభాగ అధికారి పి.శ్రీనివాసరావు, పరవాడ ఉపవిభాగ అధికారి వి.విష్ణు స్వరూప్, మహిళా పోలీసు కేంద్ర అధికారి ఈ.శ్రీనివాసులు, న్యాయ సలహాదారు రాఘవరావు, నిరీక్షకులు లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యరావు, లక్ష్మీ, గఫూర్, రామకృష్ణారావు, మన్మధరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వేచలం గ్రామం టిడిపి అధ్యక్షుడిగా రెడ్డి మల్లు నాయుడు ప్రమాణ స్వీకారం

ఉత్తరాంధ్ర ప్రతినిధి నవంబర్ 13 (దేవరాపల్లి) దేవరాపల్లి మండలం దేవరాపల్లి లో గురువారం టెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షులు, ఇతర పదవిదారుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం కిలపర్తి భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించగా, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని గ్రామాల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, యూనిట్ ఇన్‌చార్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. వేచలం గ్రామానికి టిడిపి అధ్యక్షునిగా రెడ్డి మల్లు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, సభా ప్రాంగణం జైజై అర్సతనాలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గ్రామాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డి మల్లు నాయుడుకు పలువురు నాయకులు, అభిమానులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

కామారెడ్డి

కామారెడ్డి మాజీ ఫ్లోర్ లీడర్ నా.రెడ్డి మోహన్ రెడ్డి – ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి భేటీ

కామారెడ్డి, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి ) : జిల్లా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతు న్న వేళ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమం లో గురువారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా.రెడ్డి మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు. బోధ న్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వ కంగా కలిశారు.పట్టణంలో విశ్రాంతి గృహంలో జరిగిన ఈ భేటీలో నా.రెడ్డి మోహన్ రెడ్డి నేతకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంలో పార్టీ బలోపేతంపై, ప్రభుత్వం చేపడుతున్న పథకా లు ప్రజలకు చేరే విధానంపై వారు చర్చించినట్లు సమాచారం. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగితేనే ప్రజాభిమా నాన్ని నిలబెట్టుకోవచ్చని సూచించారు.అర్హులకు ప్రభుత్వ పథకాలు న్యాయంగా అందేలా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పదని, పార్టీ అధిష్టానం నిబద్ధతతో పనిచేసే నేతలను తప్పక ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.నా.రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టానికి తాను సిద్ధంగా ఉన్నట్లు, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా సుదర్శన్ రెడ్డి ప్రోత్సాహం కీలకం అవుతుందని పేర్కొన్నారు. ఈ భేటీతో జిల్లా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలైనాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.