Saturday, 21 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు

ఉదయగిరి ఏం ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ నారాయణ స్వామి జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు ఆయన మాట్లాడుతూ గ్రంధాలయాలు విజ్ఞాన భాండగారలన్నారు గ్రంధాలయాలా ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించలన్నారు పాఠాశాల, కళాశాలలో ఉన్న గ్రంధాలయాలు ను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు అని ఆయన కోరారు

E-పేపర్

డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు.

నందలూరు మండలంలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (డబ్ల్యూ హెచ్ ఆర్సీ) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి బాపులే ఆంధ్ర ప్రదేశ్ బి. సి. గురుకుల పాఠశాల & జూనియర్ కాలేజ్ (గర్ల్స్), నందలూరు మరియు గొబ్బిళ్ళ అక్షర స్కూల్ లో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తూ మెడల్స్, మోమెంటోస్, సర్టిఫికేట్స్. ప్రదానం చేసి విద్యార్థినులను సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలుసయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ ప్రతి బాలిక స్వప్నం నిజం కావాలి. వారికి విద్యతో పాటు స్ఫూర్తి, ప్రోత్సాహం, సమాన హక్కులు కల్పించడం సమాజం యొక్క బాధ్యత” అని తెలిపారు. అలాగే, డబ్ల్యూ హెచ్ ఆర్సీ చేపడుతున్న మానవహక్కుల అవగాహన కార్యక్రమాలు, బాలిక విద్య, భద్రత పై సంస్థ కట్టుబాటును వివరించారు. డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ కూడా ఇరువురు పాఠశాల లోని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తు పై దృష్టి పట్టి చదివి , ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. హక్కులను రక్షించే బాధ్యత అని పేర్కొన్నారు. డబ్ల్యూ హెచ్ ఆర్సీ టీమ్ మరియు స్కూల్ నిర్వాహకుల పాత్ర ప్రశంసనీయం ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూ హెచ్ ఆర్సీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జుల్ఫికర్, రాయలసీమ జోన్ ఎడ్యుకేషన్ సెల్ ప్రెసిడెంట్ వరప్రసాద్, స్టేట్ సెక్రెటరీ రవితేజపాల్గొని విద్యార్థినులను అభినందించారు. ఇరువురు స్కూల్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*తెదేపా నేతలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శ*

చెవిటికల్లు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందిన తరువాత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెదేపా నేతలు గోగులగుంట త్రినాధ్ గోపి, గుజ్జర్లపూడి వినయ్, వెలగలేటి మల్లికార్జునరావు (ఆటో మల్లి) ను కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు మరియు ఇతర కూటమి నేతలతో కలిసి వారి స్వగృహం లో పరామర్శించారు. ఈ సందర్శనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశారు.

కడప

మైదుకూరు 18వ వార్డులో బురద రోడ్లు, సమస్యల వలయం

మైదుకూరు మున్సిపాలిటీ 18వ వార్డులోని సీతారామాంజనేయపురం ప్రజలు, ఎర్రచెరువు రైతులు తమ సమస్యలపై శుక్రవారం మునిసిపల్ కమీషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత 20 ఏళ్లుగా ఇంటి పన్ను కడుతున్నా సీసీ రోడ్లు, వీధి లైట్లు, కుళాయిలు లేవని వాపోయారు. వీధిలో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో ప్రయాణం కష్టమైంది. విష సర్పాల భయంతో పాటు, కార్తీక మాసంలో జరిగే భీమేశ్వరస్వామి తెప్పోత్సవం కూడా దారి లేక నిలిచిపోయిందని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కూడా కోరారని తెలిపారు.

తిరుపతి

ఆలయ నిత్యవసర సరుకుల స్టోర్ లో తనిఖీలు చేపట్టిన ట్రస్ట్ బోర్డ్ సబ్యుడు

శ్రీకాళహస్తి నవంబర్ 14, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు ట్రస్ట్ బోర్డు సభ్యులు వాకచర్ల గుర్రప్ప శెట్టి శుక్రవారం నాడు నాడు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఉన్న నిత్యవసర సరుకుల స్టోర్, అన్నదాన సత్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాలకమండలి సబ్యుడు స్టోర్ లోని పలసరుకుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించి స్టోర్ నిర్వహుకులకు పలు సూచనలు చేశారు. అనంతరం అన్నదాన సత్రంలో తనిఖీలు నిర్వహించి అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదం నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డ్ సబ్యుడు గుర్రప్ప శెట్టి మాట్లాడుతూ… గతంలో తాను కిరాణా దుకాణం నిర్వహించేవాడని ఫలసరకుల నాణ్యత ప్రమాణాలు గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు. స్టోర్ లోని సరుకులు నాణ్యత బాగుందన్నారు. తనపై ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక ఎమ్మెల్యే సలహాలు సూచనల మేరకు ప్రతినిత్యం ఆలయంలో పూజా టిక్కెట్ల కౌంటర్ల వద్ద, పూజ మందిరాల్లో తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నాని అయన పేర్కొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

చెవిటికల్లు గ్రామంలో గృహప్రవేశం… కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య

కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో శుక్రవారం జరిగిన గృహప్రవేశ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన మూడు లక్షల గృహప్రవేశాల మహోత్స వంలో భాగంగా గ్రామానికి చెందిన షేక్ జాన్ సైదా కుటుంబం తమ నూతన గృహంలో ప్రవేశించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై కుటుంబాన్ని ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడిన ఆమె—పేదవారి కలలను నిజం చేయడం ప్రభుత్వం ధ్యేయమని చెప్పారు. “ఇల్లు అనేది ప్రతి పేద మనిషి జీవితంలో పెద్ద ఆశయం. ఆ ఆశయాన్ని సాకారం చేయాలని మా ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతోంది. మూడు లక్షల గృహప్రవేశాలు గణాంకాలు మాత్రమే కావు; వేలాది కుటుంబాల సంతోషకన్నీళ్ల ప్రతిబింబం” అని పేర్కొన్నారు. గృహాల నిర్మాణం లో నాణ్యత, వేగం, పారదర్శకత కు ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యత ఇస్తోందని సౌమ్య తెలిపారు. ప్రజలకు మరింత చేరువవుతూ పథకాల అమలులో పారదర్శకతను పెంచుతున్నట్టు, త్వరలోనే గ్రామాల వరకూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, PACS అధ్యక్షులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైదా కుటుంబానికి గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేయగా, గ్రామంలో పండుగ పోలిన వాతావరణం చోటుచేసుకుంది.

ఎన్ టి ఆర్ జిల్లా

గ్రామ సమస్యలపై సౌమ్య గారు సీరియస్… అధికారులు వెంటనే యాక్షన్‌కు ఆదేశం

చెవిటికల్లు(కంచికచర్ల): చెవిటికల్లు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌ జోరుగా సాగింది. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వయంగా పాల్గొన్నారు. ప్రజలు అందించిన వినతిపత్రాలను ఒక్కొక్కటిగా పరిశీలించిన ఆమె, వాటిని సంబంధిత అధికారులకు అప్పగిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే “గ్రామంలో ఎక్కడా చెదారం పేరుకుపోకూడదు. శానిటేషన్ పనులు రెగ్యులర్‌గా కొనసాగాలి” అని స్పష్టం చేశారు. త్రాగునీటి సమస్యలపై కూడా అధికారులు సత్వర స్పందన కనబరచాలని సూచిస్తూ… “ప్రతి ఇంటికి పరిశుభ్రమైన త్రాగునీరు అందేలా వెంటనే చర్యలు తీసుకోండి” అని ఆదేశించారు. రాత్రి వేళల్లో గ్రామ ప్రజల భద్రత దృష్ట్యా వీధి దీపాల నిర్వహణపై సౌమ్య ప్రత్యేక దృష్టిసారించారు. చెడిపోయిన దీపాలను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు చేరువై, వారి సమస్యలకు తక్షణ పరిష్కారం అందించడం తమ లక్ష్యమని సౌమ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

జి.ఎస్.టి. ఆధికారులకు ఘనసత్కకారం

శ్రీకాళహస్తి నవంబర్ 14, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణం పానగల్లు రోడ్డు వద్ద గోకులం గ్రాండ్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాణిజ్య పన్నుల శాఖ (జి. ఎస్. టి) కార్యాలయంలో శుక్రవారం నాడు ఆ శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్లుగా గునిశెట్టి మురళీకృష్ణ, లక్ష్మీదేవి లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రేణిగుంట, తిరుపతి, శ్రీకాళహస్తి కి చెందిన డిస్టిక్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వీరిని ఘనంగా సత్కరించారు. రేణిగుంటకు చెందిన మురళీకృష్ణ తొలి ప్రయత్నం లోనే గ్రూప్ 2 లో అర్హత సాధించి, వాణిజ్య పనుల శాఖలో ఏ సిటీవోగా ఉద్యోగం సాధించి వాణిజ్య పనుల శాఖలో కర్నూల్ అనంతపురం ప్రాంతాలలో పనిచేశారు. అక్కడినుంచి పదోన్నతి పొంది డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గా శ్రీకాళహస్తి సర్కిల్ లో బాధ్యతలు చేపట్టారు.

ఎన్ టి ఆర్ జిల్లా

టిడిపి కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని ఉక్కు కళావేదిక వద్ద శుక్రవారం టిడిపి మండల, పట్టణ, క్లస్టర్, యూనిట్, బూత్, వార్డు, గ్రామ మరియు అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అధ్యక్షత వహించారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతా లకు కట్టుబడి ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహానేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టడంతో పార్టీలో ఉత్సాహం నెలకొన్నట్లు కార్యకర్తలు తెలిపారు. *కార్పొరేషన్ డైరెక్టర్లకు సన్మానం* విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం డైరెక్టర్‌గా నియమితు లైన మన్నే కళావతి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శేషగిరిరావు (చిన్న), వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ తాళ్లూరి పార్వతిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందించారు. *ప్రజలకు చేరువ కావాలి: ఎమ్మెల్యే సూచన* ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ— నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి –సంక్షేమ కార్యక్రమాలు ప్రతిింటికీ చేరేలా పనిచేయాలని, కుటుంబ సాధికార సారధుల నుంచి బూత్ స్థాయి వరకూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గత కమిటీలు కష్టపడి భారీ మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించాయనిపేర్కొంటూ, కొత్త కార్యవర్గం కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. టిడిపి క్రమశిక్షణ గల పార్టీ అని, బాధ్యతలు పొందిన నాయకులు అంకిత భావంతో వ్యవహరించాలని ఆయన అన్నారు. చంద్రబాబు–లోకేష్ నాయ కత్వంలో అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడు లు, ఉద్యోగావకాశాలు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల దూరదృష్టి ఫలిత మన్నారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రజల్లోనే ఉండి పనిచేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో రంగాపురం రాఘవేంద్ర, ముల్లంగి రామకృష్ణారెడ్డి, కొఠారు సత్యనారాయణ ప్రసాద్, నూకల కుమార్ రాజా, మేక వెంకటేశ్వర్లు, కట్టా వెంకట నరసింహారావు, వడ్లమూడి రాంబాబు, చింతల సీతారామయ్య తదితర నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో గ్రంథాలయ వారోత్సవాలకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ శ్రీకారం

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గ్రేడ్–శాఖ గ్రంథాలయంలో శుక్రవారం ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు అర్పించి ఆయన నివాళులు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ “విద్య మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే శక్తి. రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు సంస్కరణలు అమలు చేస్తున్నారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌ లు, ఈ–లైబ్రరీలు, డిజిటల్ లెర్నింగ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది” అని చెప్పారు. జగ్గయ్యపేట గ్రంథాలయాన్ని వినియోగించి డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే— “ఇలాంటి విజయాలు పెరగాలంటే గ్రంథాలయాలను బలోపేతం చేయాలి. కొత్త పుస్తకాలు, డిజిటల్ వనరులు, చదవడానికి అనువైన వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. యువత పఠన సంస్కృతిని అలవర్చు కోవాలి” అని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కౌన్సిలర్లు గొట్టే నాగరాజు, పేరం సైదేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇనుపనూర్తి రాజు, పితాని శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.