Saturday, 21 March 2026

Blog

నిర్మల్

“హలో మాదిగ… చలో ఢిల్లీ” – దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనకు పిలుపునిచ్చిన మందకృష్ణ మాదిగ

నిర్మల్ నవంబర్ 15 (పున్నమి ప్రతినిధి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దళితుల ఆత్మగౌరవం, అస్తిత్వం మరియు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కోసం దేశవ్యాప్తంగా దళితులు ఏకం కావాల్సిన అవసరం ఉందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. దాడిని నిరసిస్తూ నవంబర్ 17న ఢిల్లీలో నిర్వహించనున్న “చలో ఢిల్లీ – దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన”ను విజయవంతం చేయాలని ఆయన దళితులను ఆహ్వానించారు. దక్షిణ భారత బలహీన వర్గాల ఐక్యత బలపడాలని, సామాజిక న్యాయం సాధించడానికి ఇది కీలక సమయం అని మందకృష్ణ మాదిగ తెలిపారు. “నిర్మల్ జిల్లా నుంచి MRPS నాయకులు కత్తెరపాక శంకర్, రాజన్న, శనిగారపు రవి, కొలగని రాజు, నమాత్కర్ లక్ష్మన్, పత్రి వెంకటరమణ తదితరులు ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఏర్పాట్లలో పాల్గొనడానికి బయలుదేరారు.” MRPS నేత కత్తెరపాక శంకర్ మాట్లాడుతూ జస్టిస్ గవాయి‌పై జరిగిన దాడి కేవలం వ్యక్తిగతంపై దాడి కాదు, అది దళిత గౌరవం మీద దాడి అని పేర్కొంటూ, హక్కుల కోసం ఈ ఉద్యమం కీలక మలుపు అవుతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

రూ. 5 లక్షల చెక్కును అందజేసిన నాయకులు

CSపురం: మండలం లోని గుంతచెన్నంపల్లి గ్రామ జనసేన కార్యక్రత్త తోట జయరాములు రైలు ప్రమాదంలో మృతి చెందారు. విషయాన్ని కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ వరికూటి నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జయరాములు కుటుంబం సభ్యులకు నాగరాజు రూ. 5 లక్షల భీమా చెక్కు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్

బంగారు భవితకుకు బాలల హక్కులు * షేక్ ఆశా బేగం*

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోబాలల దినోత్సవం పురస్కరించుకొని సియస్ పురం మండలం దర్శకుంట పేట అంగనవాడి కేంద్రంలో బాలల దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది బాలల సంరక్షణ అధికారిని శ్రీమతి షేక్ అమీషా బేగం మొదటగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి సత్కరించారు వాళ్లతో అంగన్వాడి కేంద్రంలో నేర్చుకున్న ఆట పాటలను వీక్షించారు బాలలకు వివిధ పోటీలు నిర్వహించి వారికి ప్రోత్సాహకరంగా ఉండునట్లు మెమౌంట్ లు మెడల్స్ తో సత్కరించారు తదుపరి కేజీబీవీ సిఎస్పురం బాలల దినోత్సవకార్యక్రమంలో బాలల హక్కులపై బాలల చట్టాలపై అత్యవసర పరిస్థితిలో ఉపయోగించాల్సిన టోల్ ఫ్రీ నెంబర్స్ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ ఓ సూపర్వైజర్ దేవా కృపావరం డీఈవో రసూల్ బిపిసి సామ్యూల్ ఘర్షం అంగన్వాడి కార్యకర్త వడ్డే సరళ రెడ్డి రమ కస్తూరిబా స్కూల్ సిబ్బంది అంగన్వాడి కార్యకర్తలు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు

కాకినాడ

శ్రీ మరిడమ్మ అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో పూజ

శ్రీ మరిడమ్మ అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో శుక్రవారం ఉదయం వేద పండితులు ఆలయ మండపంలో కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కే. విజయ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో పూజ నిర్వహిస్తారని తెలిపారు. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవచ్చు అన్నారు. ఆలయ వేద పండితులు i.v ప్రసాద్ శర్మ,s.v. శాస్త్రి, శంకర్ శాస్త్రి అసాధులు రాయ రామచంద్ర ప్రసాద్,రాయ విజయ కుమార్, సిబంది వెంకట రమణ, లోవ రాజు, భక్తులు , పెద్దాపురం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామ్ కుమార్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చెల్లిబోయిన రత్నం, కాకి భార్గవి పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

కడప

కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మొహమ్మద్ ఉస్మాన్

కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించబడిన మొహమ్మద్ ఉస్మాన్ అన్నగారికి శుభాకాంక్షలు మరియు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తకు తగిన పదవి రావడం పట్ల మన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మాధవి రెడ్డి గారికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ మార్కెట్ యార్డ్ కమిటీలో మహిళలకు కూడా మంచి స్థానాలు కల్పించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.

కడప

అడవి దొంగ పెద్దిరెడ్డి

వై.ఎస్.ఆర్.సి.పి. శాసనసభ్యుడు రామచంద్రారెడ్డి పై కేసు నమోద్ ఆటవి షాక అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించి అడవిలో ఇల్లు కట్టాడు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వీడియో దృశ్యకావ్యం ఆదరం గా కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లో మంగళంపేట అడవిలో 76.6 ఏకరాలు మేరకు అక్రమించిన అటవీ అధికారులు పేర్కొన్నారు వీటీపై విచారణకు హాజరు కావాలి అని పెద్దిరెడ్డికి నోటీసులు పంపిన అధికారులు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ నెల 19న రైతుల ఖాతాల్లో రూ.2000 జమ ! పీఎం కిసాన్ 21వ విడత !

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2000 చొప్పున సంవత్సరానికి మొత్తం రూ.6000 సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ 21వ విడత (2025) విడుదల తేదీగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19న ప్రకటించింది. ఈ విడత కింద అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2000 నేరుగా జమ కానున్నాయి. రైతులు తమ పేరు 21వ విడత లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చాలా సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఎంచుకుని మీ పేరు లిస్ట్‌లో ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, పేమెంట్ మీ ఖాతాలో జమ అయ్యిందా? పెండింగ్‌లో ఉందా? అనే విషయాలను కూడా స్టేటస్ చెక్ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు 🔍 పిఎం కిసాన్ 21వ విడత స్టేటస్ చెక్ చేయండి👇 https://studybizz.com/pm-kisan-scheme

సక్సెస్ స్టోరీస్

10వసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న నితీష్ కుమార్

2024లో నితీష్ కుమార్ తన రికార్డు స్థాయి పరుగును కొనసాగిస్తూ, పొత్తులను మారుస్తూనే మరోసారి ముఖ్యమంత్రి పదవిని నిలుపుకుంటున్నారు, ఇప్పుడు, 2025లో మరో విజయంతో, ఆయన తన అద్భుతమైన రాజకీయ ప్రయాణానికి మరో అధ్యాయాన్ని జోడించారు. ఇప్పటికే తొమ్మిది సార్లు ప్రమాణ స్వీకారం చేసి, 19 సంవత్సరాలకు పైగా సేవలందించిన ఆయన, బీహార్‌లో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ తాజా విజయంతో, ఆయన 10వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఇది రాష్ట్ర రాజకీయాల్లో సాటిలేని విజయం. శీఘ్ర నిష్క్రమణల నుండి నాటకీయ పునరాగమనాల వరకు, పొత్తులను విచ్ఛిన్నం చేయడం నుండి రాత్రికి రాత్రే కొత్త వాటిని ఏర్పరచుకోవడం వరకు, నితీష్ కుమార్ బీహార్ అధికార వలయంలో సర్దుబాటు చేసుకోవడానికి, మనుగడ సాగించడానికి మరియు కేంద్రంలో ఉండటానికి అసాధారణ సామర్థ్యాన్ని చూపించారు. ఆయనను ప్రేమించినా లేదా విమర్శించినా, ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు: రాష్ట్ర రాజకీయాలపై ఆయన ప్రభావం ఎప్పటిలాగే బలంగా ఉంది

కడప

నేడు విచారణకు రావాలని వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు..

తిరుమల: కల్తీ నెయ్యి కేసు విచారణ నేడు విచారణకు రావాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది గతంలో జరిగిన కల్తీ నెయ్యి విషయంలో ఈయన పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయని కనుక ఈయన విచారణకు హాజరు కావాల్సిందిగా వారు నోటీసులో తెలిపారు

Blog

ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల అభివృద్ధి పనులను సందర్శించిన ఎన్ఎండి ఫయాజ్

నంద్యాల స్థానిక రాజకీయాలు మరియు విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సాధించే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఈ రోజు నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న బిల్డింగ్ అభివృద్ధి పనుల పురోగతిని ఫయాజ్ క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల నాణ్యత మరియు వేగం గురించి ఆయన నేరుగా బిల్డింగ్ కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. పనులు నిర్ణీత గడువులోగా, ఎలాంటి రాజీ లేకుండా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు తెలిపారు. అలాగే పాఠశాలలో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై ఫయాజ్ ఆరా తీశారు. భోజనం నాణ్యత, విద్యార్థులకు అందిస్తున్న వంటకాల వివరాలు, మరియు పరిశుభ్రత గురించి ఉపాధ్యాయురాలును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో అధికారులు మరియు ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ వహించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని , వీటిని పర్యవేక్షించడం తమ కర్తవ్యమని ఎన్ఎండి ఫయాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ రవి, ఈశ్వర్, దీపక్ రెడ్డి, అలీ, బషీర్ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.