Friday, 20 March 2026

Blog

E-పేపర్

భారీగా పెరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ధరలు, బైక్ రిజిస్ట్రేషన్ ఫీజులు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 భారీగా పెరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ధరలు, బైక్ రిజిస్ట్రేషన్ ఫీజులు 9999 ఫ్యాన్సీ నెంబర్ ధర రూ.50 వేల నుండి రూ.1.50 లక్షల వరకు పెంపు బైక్ రిజర్వేషన్ ఫీజులను రూ.3000 నుండి రూ.6000కు పెంపు ఫ్యాన్సీ నెంబర్ల ధరలను మూడు రేట్లకు పెంచుతూ, 1989లోని రూల్ 81ను సవరిస్తూ జీవో 77ను విడుదల చేసిన ప్రభుత్వం గతంలో ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపుతో రవాణా శాఖకు ఏటా రూ.120 కోట్ల ఆదాయం రాగా.. పెంచిన ధరలతో మూడింతల ఆదాయం పెరిగే అవకాశం 1,9,6666 నెంబర్ల ధరలను రూ.30-50 వేల నుండి రూ.1 లక్షకు పెంపు 99,999,3333,4444,5555,7777 నెంబర్ల ధరలను రూ.30 వేల నుండి రూ.50 వేలకు.. 2222,8888 నెంబర్ల ధరలను రూ.20 వేల నుండి రూ.40 వేలకు పెంపు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ.. రవాణా శాఖ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు ఒక నెంబర్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే అదే రోజు వేలం నిర్వహించనున్న అధికారులు

E-పేపర్

వివాహ వేడుకల్లో రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు/రాష్ట్ర TUFIDC కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చల్లా నరసింహారెడ్డి

వివాహ వేడుకల్లో మాజీ ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు/రాష్ట్ర TUFIDC కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చల్లా నరసింహారెడ్డి వారితోపాటు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆదిలాబాదు

ఏఐటియుసి రిమ్స్ సూపర్ స్పెషాలిటీ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక

ఏఐటియుసి అనుబంధం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అధ్యక్షులుగా నల్ల శివన్న, ప్రధాన కార్యదర్శిగా పెందూర్ దిలీప్ లు ఎన్నికయ్యారని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సిర్ర దేవేందర్ తెలిపారు. ఈ సందర్భంగా శివన్న, దిలీప్ లు మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తమ మీద నమ్మకం తో కార్మికుల పట్ల పోరాడే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కోసం మరియు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. పలువురు కార్మికులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: మిగుల సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సర డిగ్రీ కోర్సులో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ ఆదివారం తెలిపారు. బి.కాం(జనరల్), బి.కాం(సీఏ), బి.యస్సీ మేథ్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులలో సీట్లు ఉన్నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 17వ తేదీ నుండి అర్హత ధ్రువపత్రాలు, పాస్ ఫొటోలతో కళశాల ఆఫీసు లో సంప్రదించాలన్నారు.

E-పేపర్

మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ ఏటీఎం పనిచేయడం లేదు

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ : 9640204826 : మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ ఏటీఎం పనిచేయడం లేదు మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ క్యాష్ రీసైకిలయర్ (RECYCLER ) ATM రెండు రోజులుగా పనిచేయకపోవడంతో ఖాతాదారులు ఇబ్బంది ఇండియన్ బ్యాంక్ అధికారులు స్పందించి బ్యాంక్ ఎటిఎం ని మరమ్మతులు చేసి ఖాతాదారులకు అందుబాటులో తేవాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఇండియన్ బ్యాంకు నూతనంగా ఏర్పాటు చేసిన డబ్బులు రీసైక్లింగ్ ( నగదు జమ, డిపాజిట్) ఏటీఎంను ఏర్పాటు చేసిన సందర్భంగా ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ రెండు రోజులుగా క్యాష్ డిపాజిట్ తీసుకోవడం లేదు .మరియు డబ్బులు తీసుకోవాలనుకున్న ఏటీఎం నుండి క్యాష్ రావడం లేదు క్యాష్ రా ఒక పోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొంబత్తుల స్టాన్లీ భీమ్ (అరుల్) మొదటి పుట్టినరోజు సందర్భంగా

కొంబత్తుల స్టాన్లీ భీమ్ (అరుల్) తొలి పుట్టినరోజు ఈ ప్రత్యేక రోజున ప్రేమతో, ఆనందంతో నిండిన హృదయపూర్వక శుభాకాంక్షలు. అరుల్ జీవితంలో మొదటి సంవత్సరం అతనికి మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ఎంతో విలువైన జ్ఞాపకాలను అందించిన ఒక అందమైన ప్రయాణం. ప్రతి చిరునవ్వు, ప్రతి చిన్న అడుగు, ప్రతి మురిపెంగా చేసిన చిలిపి నడక—all these moments have turned into precious memories. ఈ తొలి పుట్టినరోజు అరుల్ భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసే కొత్త ఆశలుకు నాంది కావాలి. ఆరోగ్యంగా, ఆనందంగా, విద్యలో రాణిస్తూ, కుటుంబానికి గర్వకారణంగా ఎదగాలి. దేవుడు స్టాన్లీ భీమ్ (అరుల్) కు ఆయురారోగ్యాలతో కూడిన, సుఖసంతోషాలతో నిండిన జీవితం అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. హ్యాపీ 1st బర్త్‌డే స్టాన్లీ భీమ్ (అరుల్

ఆంధ్రప్రదేశ్

పెడన లో హిందువు ల పై జరుగుతున్న దాడుల పై రాష్ట్ర హోం శాఖ దృష్టి సారించాలి :హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు

అర్ధరాత్రి అరెస్టుతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన పెడన తీవ్ర ఆందోళన చేపట్టిన హిందూ సంఘాలు కృష్ణాజిల్లా హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరావు మాట్లాడుతూ గొడవలు చెలరేగే అవకాశం ఉందని ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టానని, దానికే నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పెడన పోలీసులు అరెస్టు చేశారని, ఇదే పెడనలో శివాలయం పై దాడులు చేస్తే వారి మీద ఎటువంటి చర్యలు లేవని, కక్ష కట్టి నన్ను ఒక్కసారి అంతమొందించాలని స్కెచ్ వేస్తే స్థానిక పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారని సాక్షాత్తు జిల్లా ఎస్పీ గారి దగ్గర నుండి రక్షణ పొందానని అటువంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు లేవని,పోలీసుల పక్షపాత వైఖరిపై ఆయన తీవ్ర నిరసన తెలియజేశారు. ఇదే విషయం పై ఆయనకు మద్దతు తెలియచేయడానికి వచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు మరియు హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పట్ల పోలీసుల తీరు సరిగ్గా లేకపోవడంతో వారందరూ రోడ్డుపై బైఠాయించడంతో ఒకానొక పరిస్థితిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెడనలో గోవధ జరుగుతుందని కేసులు పెడితే వారి మీద ఎటువంటి చర్యలు ఉండటం లేదని పిర్యాదు చేస్తున్న హిందువులు ను అక్రమంగా కాళ్ళకు చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేస్తున్నారని, ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర హోంశాఖ పెడనపై దృష్టి పెట్టాలని ఆయన తెలియజేశారు. హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఈ విషయం గురించి మా పెద్దలు డిఎస్పి గారితో చర్చిస్తుంటే ఆయన గట్టిగ అరుస్తూ బెదిరిస్తున్నారని, పెడన ఎస్సై,మిమ్మల్ని కొడతాము,తిడతాము, అరెస్టులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని, అదే ముస్లింలకు అయితే ఆయన కొమ్ముకాస్తున్నారని పెడనలో ఇవే కొనసాగితే హిందూ బంధువులు అందరూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

కడప

వైభవంగా కార్తీక మాసం జ్యోతుల మహోత్సవం

*కార్తీక మాసం జ్యోతుల మహోత్సవం సందర్భంగా స్థానిక సుబ్బిరెడ్డి కొట్టాల చౌడేశ్వరి దేవస్థానం,వసంతపేట చౌడేశ్వరి దేవస్థానాల నందు అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు,మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు* *రామేశ్వరం శ్రీ భద్రావతి భావన్నారాయణ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు,మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు* *ఈ కార్యక్రమాలలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు గారు,ఇవి సుధాకర్ రెడ్డి గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ Vs ముక్తియార్ గారు,తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,అమర్ నాథ్ సింగ్,K.C కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురివి రెడ్డి గారు,కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి,ఘంటసాల వెంకటేశ్వర్లు,సోమా బాలయ్య,మార్తల గురివి రెడ్డి,మీగడ చంద్ర,నాగేంద్ర,గురు శేఖర్ రెడ్డి,శ్రీకాంత్,శివ,బాబు,శ్రీనివాసుల రెడ్డి,వద్దిరెడ్డి రామముని రెడ్డి,ఉప్పు మల్లిఖార్జున,ఈఓ జగన్ మోహన్ రెడ్డి గారు,పల్లేటి ప్రభాకర్ రెడ్డి,నందం రామయ్య,పల్లేటి శేఖర్ రెడ్డి,నందం కుమార్,రంగడు,పల్లేటి రాముడు,పగిడాల సుబ్బారెడ్డి,మేరువ మూర్తి,శ్రీనివాసుల రెడ్డి తదితరులు*

కడప

కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణ

ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్ గ్రామంలో కొనసాగుతోంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కార్యదర్శి నొస్సం వెంకట రమణా రెడ్డి గారు గ్రామంలో నిర్వహించారు కార్యక్రమం లో శివ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

కానిస్టేబుల్ ను గుడ్డి వెళ్లిపోయిన కారు.

(పున్నమి ప్రతినిధి విశాఖ జిల్లా తేదీ 17-11-2025) *సూర్యాపేట జిల్లా: నగరం సివారులో వాహనాల తనిక్కి చేపట్టినా పోలిసులు.వీధి నిర్వాహనలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్ ను వేగంగా ఢి కొట్టి వెళ్ళిపోయిన కారు. ప్రమదంలో కానిస్టేబుల్ కి రెండు కాళ్ళు విరిగిపోగా.హాస్పిటల్‌కి తరాలింపు. కారు కోసం వెతుకుతూనా పోలీసులు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.