Friday, 20 March 2026

Blog

విశాఖపట్నం

61వ వార్డు శ్రీ గౌరీ దేవి మహోత్సవాలు

విశాఖ నవంబర్ పున్నమి ప్రతినిధి:- 61 వ వార్డు అన్నసంతర్పణ మల్కాపురం  జీవీఎంసి   61వ వార్డు శ్రీ గౌరీ దేవి మహోత్సవాలు సందర్భంగా ప్రకాష్ నగర్ లో శ్రీ గౌరీ సేవ సంఘం వారి అద్వర్యం లో అదివారం   అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అన్నసమారాధన కార్యక్రమం నకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు .వచ్చిన భక్తు లకు మల్కాపురం పోలీస్ లు అలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు .కార్యక్రమంలో మహిళలు యూత్ సభ్యులు కమిటి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఎర్ర చందనం రక్షణకు సంకల్పం తీసుకుందాం

*ఎర్ర చందనం రక్షణకు సంకల్పం తీసుకుందాం* *అమరావతి ( విశాఖ పున్నమి ప్రతినిధి) • అమూల్యమైన సంపదను భావి తరాలకు అందించాలి • గత ప్రభుత్వ హయాంలో వన సంపదనూ వదల్లేదు… లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేశారు • అక్రమ రవాణా నిరోధానికి డ్రోన్లతో పహారా • ఎర్ర చందనం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్ర చందనం వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయింపు • ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్సుకు జీవం • పోలీసు-అటవీ శాఖల సమన్వయం ప్రధానం • ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద. పర్యావరణపరంగానూ, ఆధ్యాత్మికంగానూ, ఆర్థికంగానూ దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలి. ఎర్ర చందనం విక్రయాల ద్వారా సమకూరే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్ర చందనం విత్తనాలు జల్లడం, ఎర్ర చందనం వనాలు అభివృద్ధి, సంరక్షణకు కేటాయించే ఆలోచన చేస్తున్నాము’ అని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదనీ, దీని కోసం ఓ పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తే అక్రమార్కుల ఆటకట్టించడం అసాధ్యం కాదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొన్న కింగ్ పిన్స్ ను చట్టం ముందు నిలపడానికి ప్రత్యేక బృందాలను పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెట్లను నరకడానికి వస్తున్న కూలీలు, మేస్త్రీలు, సూపర్ వైజర్లు, గోదాము కీపర్లు వంటి కిందిస్థాయి వారిని గుర్తించి, వారికి చట్టంపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేసి, ఇతర ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం మధ్యాహ్నం అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్ర చందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… ‘‘2015లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే దీని కోసం ప్రత్యేకంగా ఆలోచించి రెడ్ సాందర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారు. కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఐజీ స్థాయి అధికారిని టాస్క్ ఫోర్స్ కు నియమించి, అటవీ-పోలీసు అధికారులతో ప్రత్యేకంగా దళం ఏర్పాటు చేయించి ముందుకు వెళ్లారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత టాస్క్ ఫోర్సును ఓ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేశారు. తత్ఫలితంగా అక్రమ రవాణాకు ద్వారాలు తెరిచినట్లయింది. ఫలితంగానే 2019-24 మధ్య లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారు. నేను ఇటీవల సందర్శించిన తిరుపతిలోని 8 గోదాముల్లో 2,63,267 ఎర్రచందనం దుంగులున్నాయి. కేవలం పట్టుబడిన దుంగలను బట్టి చూస్తేనే సుమారు 2 లక్షల చెట్లు నరికినట్లు అర్ధమవుతోంది. మరి అక్రమ మార్గాల్లో ఎన్ని లక్షల చెట్లను నరికివేశారో ఊహకు అందటం లేదు. ఎర్రచందనం అనేది పర్యావరణహితమైన చెట్టు. అత్యంత పటిష్టంగా శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన వృక్షం. ఇక నుంచి ఎర్రచందనం ఒక్క దుంగ కూడా బయటకుపోకుండా చేయాలి. దీనికి మన ముందున్న దారులన్నీ వినియోగించుకుందాం. మళ్లీ టాస్క్ ఫోర్సుకు జీవం పోసి, అక్రమ రవాణా నిరోధించే ప్రణాళికపై గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను. స్మగ్లర్లపై పెట్టిన కేసుల్లోనూ న్యాయస్థానాల నుంచి వేగంగా తీర్పులు రావడం శుభసూచకం. అటవీ శాఖ సిబ్బంది ఎర్ర చందనం సంరక్షణను ఒక సంకల్పంలా తీసుకోవాలి. • కేంద్ర సాయంతో ఎర్రచందనం వెనక్కు వస్తోంది వైసీపీ హయాంలో అంతర్రాష్ట్ర ఒప్పందాలను పట్టించుకోలేదు. ఫలితంగా ఎర్రచందనం సరిహద్దులు దాటి వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకున్నా, దాన్ని వెనక్కు తీసుకురాలేకపోయారు. ఇటీవల కర్ణాటకకు వెళ్లినపుడు రూ.140 కోట్ల ఎర్రచందనం వారు పట్టుకొని, అమ్ముకున్నట్లు చెప్పడం నన్ను ఆలోచింప చేసింది. అంతర్రాష్ట్ర ఒప్పందాలను పటిష్టంగా అమలు చేసి ఉంటే, ఆ సంపద మనకు దక్కేది. ఈ అంశంపై కేంద్ర అటవీశాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారితో చర్చించాను. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మన రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా అయిన ఎర్రచందనం దుంగలు దేశంలో ఎక్కడ దొరికినా మనకు చెందేలా ప్రత్యేకంగా ఆదేశాలను ఇప్పించాం. దీంతోనే ఇటీవల గుజరాత్ లో 5 టన్నులు, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల్లో 7 టన్నులు, కర్ణాటకలో 6 టన్నులు, ఢిల్లీలో 10 టన్నులు సీజ్ చేశాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నేపాల్ లో ఉన్న 173 టన్నల ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి రప్పించే ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు వివిధ రాష్ట్రాల్లో 2019-24 ప్రాంతాల్లో పట్టుబడిన 407 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. • సాంకేతికతకు తోడు మానవ కృషి అవసరం ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అందుబాటులో ఉన్న సాంకేతిక వినియోగానికి తోడు సిబ్బంది కృషి చాలా అవసరం. టెక్నాలజీతోపాటు సంకల్పం తోడైతేనే ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించగలం. పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో నిరంతరం ఎర్రచందనం స్మగ్లింగు జరిగే అవకాశం ఉన్న ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ డ్రోన్లతో నిఘాను పెంచాలి. అటవీ చెక్ పోస్టులను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను అమర్చి, నిత్యం పర్యవేక్షణ చేయాలి. సరికొత్త బ్యారికేడ్లను చెక్ పోస్టుల వద్ద అమర్చి, బేస్ క్యాంపులు, వాచ్ టవర్లలో గస్తీ ముమ్మరం చేయాలి. వన సంరక్షణ సమితి వాలంటీర్ల ఆధ్వర్యంలో చైతన్య సదస్సులను శేషాచలానికి ఆనుకొని ఉన్న అన్ని గ్రామాల్లో నిర్వహించాలి. గ్రామస్థులకు అక్రమ రవాణా నిరోధానికి సహకరించాలని ప్రత్యేక సదస్సుల ద్వారా విన్నవించాలి. పాత కేసుల్లో ఉన్న వారి వివరాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని, వారి కదలికలను రికార్డు చేయాలి. ఎర్రచందనం కేసుల పరిష్కారానికి వేగం పెంచాలి. 60 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు చేయాలి. ఆర్మ్డ్ బేస్ క్యాంపులను విస్తృతం చేయాలి. ఎక్కువగా అక్రమ రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక కూంబింగ్ లను నిర్వహించాలి. అడవిలో ఎలాంటి అలికిడి, అలజడి గుర్తించినా, రక్షణ దళాలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. అక్రమార్కుల ఆట కట్టించాలి. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం విషయంలో సమన్వయం అనేది ప్రధానం. పోలీసు-అటవీ అధికారులు ఈగోలకు తావు లేకుండా జాతి సంపదను రక్షించాలనే అంకిత భావంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు కాని ప్రత్యేక నిఘా ద్వారా వారిని పట్టుకుంటాం. ప్రత్యేక ఇంటిలిజెన్స్ ఏర్పాటు చేసి, సమాచారాన్ని అక్రమార్కులకు చేరవేసేవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.

E-పేపర్

పెండ్యాల విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు

కోడూరు టౌన్ శ్రీ పొట్టి శ్రీరాములు వారి వీధి నందు ఆర్యవైశ్య సమాజం అధ్యక్ష ఎన్నికలలో పెండ్యాల విజయ్ కుమార్ గారు 111 ఓట్ల ఆధిక్యతతో కామిశెట్టి సత్య గారిపై విజయం సాధించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు

విశాఖపట్నం

విశాఖపట్నం ఆర్థిక కారిడార్ సమావేశం” సందర్భంగా, ఇరవై సూత్రాలు

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* విశాఖపట్నంలో దొండపర్తి వద్ద ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో “చార్టర్డ్ ఇంజనీర్లు (వాల్యూయర్స్) – విశాఖపట్నం ఆర్థిక కారిడార్ సమావేశం” సందర్భంగా, ఇరవై సూత్రాల కార్యక్రమాలు (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్ర) అమలు చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఇంజనీర్లు, వాల్యూయర్స్ దేశ ఆర్థిక బలానికి కాపలాదారులు. ప్రతి ప్రాజెక్ట్, ప్రతి ఆస్తి, ప్రతి పెట్టుబడి వెనుక మీ సంతకం, మీ నైపుణ్యం, మీ భరోసా ఉంది. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి కేంద్రంగా ఎదుగుతున్న ఈ సమయంలో, మీ భాగస్వామ్యం అత్యంత కీలకం” అని పేర్కొన్నారు. వికసిత్ భారత్ @2047 సాధనలో ఇంజనీర్ల పాత్ర నిర్ణాయకమని హితవు పలికిన ఆయన— “ప్రధాని నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ సంకల్పంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి 40% వాటా విశాఖపట్నం ప్రాంతానిదే. ఈ అభివృద్ధి యాత్ర మీ నైపుణ్యం లేక పూర్తికాదు” అన్నారు. భవిష్యత్ సాంకేతికతల ప్రాముఖ్యతను వృద్ధి చేస్తూ— “AI, GIS మ్యాపింగ్, డ్రోన్ ఇన్స్పెక్షన్స్, డిజిటల్ ట్విన్స్, 3D మోడలింగ్ — ఇవి రేపటి సాధనాలు కాదు, ఇవే నేటి అవకాశాలు. సాంకేతికతను సద్వినియోగం చేసే నైతికత కలిగి నిపుణులే నిజమైన అభివృద్ధిని నిర్మిస్తారు” అని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం పరిశ్రమలు, ఇన్నోవేషన్, లాజిస్టిక్స్, ఫార్మా, ఎనర్జీ, డిఫెన్స్ మరియు బ్లూ ఎకానమీ కేంద్రంగా ఎదుగుతున్నందున— “ఇంజనీర్లు వాల్యూయేషన్ వ్యవస్థలో నైతికతకు ఆదర్శంగా, యువ ఇంజనీర్లకు మార్గదర్శకులుగా, ప్రభుత్వం–పరిశ్రమలతో విశ్వసనీయ భాగస్వాములుగా పనిచేయాలి. మీ ప్రతిభ ఈ ప్రాంత అభివృద్ధికి ఇంధనం కావాలి” అని లంకా దినకర్ పిలుపునిచ్చారు. “స్వర్ణ ఆంధ్రకు భారతదేశాన్ని ప్రేరేపించే శక్తి, వికసిత్ భారత్‌కు ప్రపంచాన్ని ప్రేరేపించే శక్తి ఇవ్వాలి. మన నైపుణ్యం, మన దక్షత, మన నిబద్ధతతో ఈ లక్ష్యాలను చేరుకోవాలి” అని ఆయన ప్రతిజ్ఞకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్ ఛైర్మన్ కేవీ రామమోహనరావు, సెక్రటరీ చల్లా సురేష్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ రీజనల్ మేనేజర్ రవికుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక*

* *కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి *జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *విశాఖపట్నంనవంబర్ పున్నమి ప్రతినిధి:- * సోమవారం విశాఖపట్నం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమం జరుగుతుందని, అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోను చెక్ చేసుకోవచ్చన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ ను వాట్స్అప్ లో అందజేస్తున్నామని, ఎండార్స్మెంట్ ను రిజిస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపిస్తున్నామని చెప్పారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో కోరారు. *కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి* అర్జిదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను సంప్రదించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

గంజాయి రవాణా కేసు06 సంవత్సరాలు నుండి ముద్దాయి తప్పించుకు తిరుగుతున్నా గంజాయి రవాణా కేసు ముద్దాయి పట్టివేత

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- 06 సంవత్సరాలు నుండి ముద్దాయి తప్పించుకు తిరుగుతున్నా గంజాయి రవాణా కేసు ముద్దాయి పట్టివేత గంజాయి రవాణా కేసుకు సంబందించి తేదీ 13.02.2020 న 12:30 నిమిషాలకు పిర్యాది దారుడు అయిన తెర్లి తమ్మి నాయుడు, సిఏస్ఓ , కోరమాండల్ కంపెనీ, శ్రీహరిపురం, మల్కాపురం, విశాఖపట్నం సిటీ వారు ఇచ్చిన కంప్లైంట్ ఏమనగా ముద్దాయి అయినా బిజే కబాసి,వయసు 37 తండ్రి సానియా కబాసి , ఆదివాసీ కులం, కరస్తాగూడ గ్రామం, కంవాడ, మల్కాన్గిరి జిల్లా, ఒడిషా రాస్ట్రం. బిజే కబాసి అతని యొక్క లారీ నెంబర్ AP16 TJ 4627 లో 50.200 Kg ల గంజాయిని అక్రమంగా తరలించే క్రమంలో కోరమండల్ కంపెనీలో సదరు లారీ ని లోడింగ్ నిమిత్తం కోరమాండల్ 4 వ గెట్ వద్ద పెట్టగా సెక్యూరిటీ వారికి గంజాయి తో పాటు పట్టుబడినట్లు ముద్దాయి వెంటనే తప్పించుకుని పారిపోయినట్లు దానిపై తెర్లి తమ్మి నాయుడు, మల్కాపురం పోలీసు వారు పైన తెలిపిన కేసు ని 1 3 వ ఫిబ్రవరి 2020 వ సంవత్సరం లో నమోదు చేసినట్లు, దర్యాప్తులో భాగంగా పోలీసు వారు సదరు ముద్దాయిని తన స్వగ్రామం అయిన కరస్తాగూడ గ్రామం మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా రాష్ట్రంలో నాలుగు సార్లు పట్టుకునే ప్రయత్నం కు వెళ్ళగా అక్కడ గ్రామస్తులు పోలీస్ వారికి సహకరించకపోగా తిరిగి పోలీస్ వారిపై తిరగబడడం చేయడం వలన ఇప్పటి వరకు ముద్దాయి పోలీస్ లకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. పిమ్మట విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకాబ్రతా బగ్చి ఆదేశాల మేరకు ఒరిస్సా పోలీస్ ల సహకారం తీసుకుని, మల్కాపురం సి ఐ గొలగాని అప్పారావు వారి సిబ్బందితో గత వారం రోజులుగా మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా రాష్ట్రంలో మాటువేయించి ముద్దాయి యొక్క సమాచారాన్ని సేకరించి కీలక సమాచారం రాబట్టి దానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయి మాచర్ల, పల్నాడు జిల్లాలో లారీ డ్రైవరు గా పనిచేస్తున్నట్లు తెలుసుకోగలిగారు

విశాఖపట్నం

అమరావతి నిర్మాణానికి విశాఖ ఉక్కు వినియోగించండి. సెయిల్ మాజీ డైరెక్టర్ వీరన్న చౌదరి .

అమరావతి నిర్మాణానికి విశాఖ ఉక్కు వినియోగించండి. సెయిల్ మాజీ డైరెక్టర్ వీరన్న చౌదరి . విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకునేందుకు, నష్టాలనుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సెయిల్ మాజీ సభ్యులు, బిజెపి నేత వీరన్న చౌదరి అన్నారు. అమరావతి నిర్మాణానికి విశాఖ ఉక్కును వినియోగిస్తే పరిశ్రమకు ఆర్థిక సహకారం అందుతుందని, నష్టాల బాట నుంచి బయట పడుతుందని ఆయన అభిప్రాపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. సొంత గనులు ఉంటే అభివృద్ధి చెందుతుందని తాము డిమాండ్ చేసిన మేరకు గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు రాజస్థాన్లో గనులు కేటాయించడం జరిగిందన్నారు . అప్పట్లో తాము దీనిని వ్యతిరేకించామన్నారు. స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాలన్నీ చేస్తున్న పోరాటాన్ని ఆయన అభినందించారు. అమరావతితో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు, ఇతర నిర్మాణాలన్నిటికీ విశాఖ స్టీల్ నే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. దీనిపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్మ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దృష్టి సారించాలన్నారు.

E-పేపర్

పెండ్యాల విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్విక శుభాకాంక్షలు. మీ .. సనిసెట్టి నవీన్ కుమార్ రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్. అద్యక్షుడు-అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ వాణిజ్య విభాగం.

రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం అద్యక్ష ఎన్నికల్లో అత్యాదిక 111 ఓట్ల మెజారిటీ థో విజయం సాదించిన నాకు అత్యంత ఆప్తులు మరియు సోదరుడు అయిన శ్రీ పెండ్యాల విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్విక శుభాకాంక్షలు. మీ .. సనిసెట్టి నవీన్ కుమార్ రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్. అద్యక్షుడు-అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ వాణిజ్య విభాగం.

E-పేపర్

అఖండ మెజారిటీతో గెలుపొందిన పెండ్యాల విజయ్ కుమార్

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి విజయ్ అన్న కోసం విజయాన్ని చేకూర్చే దానికి పది రోజుల నుంచి ఎన్నికల ప్రచారం కోసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాపారాలు వదులుకొని ఈరోజు ఎన్నికల్లో మెజార్టీ కనివిని ఎరుగని మెజార్టీ విజయన్న గారికి 191 సత్యం గారికి 80 ఓట్లు తేడా 111 ఓట్లు మెజార్టీతో గెలిపించి విజయ అన్న మొహంలో ఆనందాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

E-పేపర్

అఖండ మెజారిటీతో గెలుపొందిన పెండ్యాల విజయ్ కుమార్

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి విజయ్ అన్న కోసం విజయాన్ని చేకూర్చే దానికి పది రోజుల నుంచి ఎన్నికల ప్రచారం కోసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాపారాలు వదులుకొని ఈరోజు ఎన్నికల్లో మెజార్టీ కనివిని ఎరుగని మెజార్టీ విజయన్న గారికి 191 సత్యం గారికి 80 ఓట్లు తేడా 111 ఓట్లు మెజార్టీతో గెలిపించి విజయ అన్న మొహంలో ఆనందాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.