Friday, 20 March 2026

Blog

తిరుపతి

శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

శ్రీకాళహస్తి నవంబర్ 17, పున్నమి న్యూస్ : తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజిక వర్గంలో రాయల చెరువుకు గండి పడటంతో దాదాపుగా 20 అడుగుల మేర చెరువు కట్ట తెగి దగ్గరలో ఉన్నటువంటి కెవిబిపురం మండలం కళత్తూరు గ్రామం, పాతపాలెం అనే గ్రామాలు నీట మునిగిపోయాయి ఈ కారణంగా కళత్తూరు గ్రామ ప్రజలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, పశువులను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేక వారం రోజులపాటు ఇబ్బందులను ఎదోర్కొంటున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్, సేవా భారతి (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో కళత్తూరు గ్రామంలోని 450 కుటుంబాలకు, పాతపాలెం నందలి 60 కుటుంబాలకు చీరలు, దుప్పట్లను పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సమాజ సేవకులు మాట్లాడుతూ….ఎక్కడైనా ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎటువంటి లాభాపేక్ష లేకుండా తక్షణమే ముందుండి సేవ చేయడంలో ఆర్ఎస్ఎస్, శ్రీ సరస్వతి శిశు మందిరాలు ముందు ఉంటాయని అందులో భాగంగానే కళత్తూరు నందు సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామ ప్రజలకు సహాయ సహకారాలను అందించడం జరిగిందని మానవసేవయే మాధవసేవ అనే భావంతో ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజూరు బాలసుబ్రమణ్యం, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల అధ్యక్షులు చాగణం భక్తవత్సలయ, మంగిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగరాజులు, ఉమా శంకర్, అమరావతి, పద్మశ్రీ, కిషోర్, తరుణ్, చందు, ప్రసాద్, సుధాకర్ పాఠశాల మాతాజీలు పాల్గొన్నరు.

తిరుపతి

రాష్ట్ర స్థాయి టెన్నీస్ పోటీలలో విక్రమ్ కళాశాల విద్యార్థాల ప్రతిభ

శ్రీకాళహస్తి నవంబర్ 17, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థాలు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పాతపట్నంలో రాష్ట్ర స్థాయి సాఫ్టి టెన్నీస్ పోటీలలో B. జయసాయి లాన్ టెన్నీస్ లో 2వ స్థానం, సాఫ్ట్స్ టెన్నిస్ నందు 3వ స్థానం, C. బాలాజి జెట్టి సాఫ్స్ టెన్నిస్ లో 5 వస్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైనారు. వీరిని కళాశాల డైరక్టర్ DT. G. చంద్రశేఖర్, కరసాండైట్, మునిలక్ష్మి, అధ్యాపక సిబ్బంది అభినదించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ మల్లి కార్జున్ , సునీల్ కుమార్, గోదరన, రామకృష్ణ, విద్యార్థాల తల్లి,తండ్రులు పాల్గోన్నారు.

తిరుపతి

కళ్ళతూరు గ్రామస్తుల సహాయ కార్యక్రమంలో పాల్గొన్న కోలా ఆనంద్

శ్రీకాళహస్తి నవంబర్ 17, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజిక వర్గంలోని పెద్దరాయల చెరువు నీటి ప్రవాహానికి అతలాకుతలమైన కళత్తూరు దళితవాడను బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పరిశీలించి కాట్రపల్లి గ్రామస్తులతో కలిసి ప్రజలకు అవసరమైన ప్లేట్స్, గ్లాసులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా బాధితులకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

E-పేపర్

అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న ముక్కా వరలక్ష్మి

అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న ముక్కా వరలక్ష్మి రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు పట్టణం శ్రీ అయ్యప్ప స్వామి వారి గుడి నందు భక్తులు ప్రజలు ఆహ్వాన మేరకు శ్రీ అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి అనంతరం స్వాములు ముక్కా వరలక్ష్మి ని ఆశీర్వదించి, సన్మానించి, తీర్థప్రసాదాలు అన్నజేయడం జరిగింది, ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు పాల్కొన్నారు.

E-పేపర్

పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం..

పున్నమి ప్రతినిధి: దుర్గేష్ ఆలంపల్లి: 9640204826 పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం… 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం… గ్రామ పంచాయతీ, వార్డు మెంబర్ల ఎన్నికలకు ఏర్పాట్లు… ఎన్నికలకు సిద్ధమని ఈసీకి తెలపనున్న రాష్ట్ర ప్రభుత్వం… ఒకట్రెండు రోజుల్లో డెడికేషన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ల నివేదిక… దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది…

E-పేపర్

ఆర్యవైశ్య దేవస్థానంలో పరమేశ్వరుడికి అన్నంతో అన్నాభిషేకం

పరమేశ్వరుడికి అన్నంతో అన్నాభిషేకం రైల్వే కోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బాలాలయంలో అన్నాభిషేకం దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నది శివుడు అభిషేక ప్రియుడు. శివుని ఒక్కొక్క ద్రవ్యంతో అర్చిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. పంచభూతాలకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని పంచభూతాల శక్తితో ఆవిర్భవించినట్టు అన్నంతో అభిషేకిస్తే అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశయించబడతారు. చర్మ వ్యాధులు తొలగిపోతాయి. అధికారం ప్రాప్తి కలుగుతుంది మోక్షాన్ని పొందుతారు. పంచామృతాలతో అభిషేకించిన తరువాత మెత్తని అన్నంతో అభిషేకించి ,శాఖములతో అలంకరించి షోడశ ఉపచార పూజలు నిర్వహిస్తారు. పూజ అయిన పిదప ఆ అన్నమును ప్రసాదంగా మనము, మనఇంటి వారు ,పసుపక్షాదులకు పెట్టాలి. “అన్నం పరబ్రహ్మస్వరూపం” అనేది వేదనానుడి. మనలో శక్తి చైతన్య పరచడానికి పంచభూతాలను శక్తిని ఈ అన్నం కలిగి ఉంటుంది. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టి వారి యొక్క ఆయును పెంచిన వారికి సకల శుభాలు చేరిపోతాయి అందుకే ఎవరైనా అన్నం పెట్టినప్పుడు వారిని ఈ విధంగా ఆశీర్వదిస్తారు ” అన్నదాత సుఖీభవ”. అన్నాదానం చేసిన వారికి సకల శుభాలు చేకూరతాయి. సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరి సృష్టిలో ఉన్న ప్రతి జీవికి అన్నప్రదాయుని.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

నందిగామ బస్టాండ్‌లో సోమవారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి మర్మమైన రీతిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సుమారు 55–60 ఏళ్ళు వయస్సు గల వ్యక్తి పెనుగంచిప్రోలు నుంచి నందిగామకు వచ్చిన బస్‌లో ప్రయాణించి, బస్ దిగిన కొద్ది సేపటికే అక్కడికక్కడే కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. తెలుసుకునే సరికి అతడి తల వెనుక భాగంలో రక్తగాయం కనిపించడంతో అక్కడున్నవారు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అతన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ డ్యూటీ డాక్టర్ ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు తెల్లని నిండు చేతుల చొక్కా, బ్లూ రంగులో తెలుపు– ఎరుపు పూల డిజైన్ ఉన్న లుంగీ ధరించి ఉన్నాడు. అతని జేబులో పెనుగంచిప్రోలు నుండి నందిగామ వరకు ఉన్న RTC టికెట్ మాత్రమే లభించిందని పోలీసులు వెల్లడించారు. పేరు–ఊరు తెలియని ఈ వ్యక్తి ఎత్తు సుమారు 5 అడుగులు, రంగు చామనచాయగా ఉన్నాడని పోలీసులుతెలిపారు. ఈ వ్యక్తిని గుర్తించగల వారు క్రింది నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా నందిగామ పోలీసులు కోరుతున్నారు: CI/SHO Y.V.V.L.నాయుడు – 8332983808 SI Y.V. సాతకర్ణి – 9440796456 SI B.మొంహనా రావు – 9440796457 నందిగామ పోలీస్ స్టేషన్ – 08678-275233

E-పేపర్

అనాధ పిల్లలకు మరియు వృద్ధులకు ఇష్టం సెంట్రల్ స్కూల్ యాజమాన్యం బియ్యం దుస్తులు సహాయం

అనాధ పిల్లలకు మరియు వృద్ధులకు ఇష్టం సెంట్రల్ స్కూల్ యాజమాన్యం బియ్యం దుస్తులు సహాయం రైల్వే కోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరులోని విస్డం సెంట్రల్ స్కూల్ ఆధ్వర్యంలో తిరుపతి లోని అనాధ పిల్లల మరియు వృద్ధుల కోసం చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం తమ వంతు సహాయం చేస్తున్న విస్డం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కేవలం చదివే కాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనాధలను వృద్ధులను తమకు ఉన్నదాంట్లో సహాయం చేయడం కూడా నేర్పిస్తున్న ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు. ఇది కేవలం ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని అలాగే డిసెంబర్ నెలలో రైల్వే కోడూరులో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలియజేసిన విస్టం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ టి ప్రదీప్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ ప్రియాంక, అడ్మిన్ డైరెక్టర్ మదన్, డీన్ ఇంచార్జ్ ముఖేష్, ఉంగరాల శివ ప్రకాష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

E-పేపర్

అనాధ పిల్లలకు మరియు వృద్ధులకు ఇష్టం సెంట్రల్ స్కూల్ యాజమాన్యం బియ్యం దుస్తులు సహాయం

అనాధ పిల్లలకు మరియు వృద్ధులకు ఇష్టం సెంట్రల్ స్కూల్ యాజమాన్యం బియ్యం దుస్తులు సహాయం రైల్వే కోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరులోని విస్డం సెంట్రల్ స్కూల్ ఆధ్వర్యంలో తిరుపతి లోని అనాధ పిల్లల మరియు వృద్ధుల కోసం చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం తమ వంతు సహాయం చేస్తున్న విస్డం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కేవలం చదివే కాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనాధలను వృద్ధులను తమకు ఉన్నదాంట్లో సహాయం చేయడం కూడా నేర్పిస్తున్న ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు. ఇది కేవలం ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని అలాగే డిసెంబర్ నెలలో రైల్వే కోడూరులో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలియజేసిన విస్టం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ టి ప్రదీప్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ ప్రియాంక, అడ్మిన్ డైరెక్టర్ మదన్, డీన్ ఇంచార్జ్ ముఖేష్, ఉంగరాల శివ ప్రకాష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

చందర్లపాడులో అయ్యప్ప మాలదారులకు అన్నదానం, మాజీ ఎమ్మెల్యేలు ఘనంగా పాల్గొనడం

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు గ్రామంలో అయ్యప్ప మాలదారుల కోసం సద్ది (అన్నదానం) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మరియు ఎంఎల్‌సి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. చందర్లపాడు మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో హాజరై మాలదారులకు ఆధ్యాత్మికంగా మరియు సాంఘికంగా మద్దతు అందించారు. ఈ కార్యక్రమం గ్రామస్తులందరికి ఆనందాన్ని నింపిన ఘన సంఘటనగా నిలిచింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.