Friday, 20 March 2026

Blog

అల్లూరి సీతారామరాజు

అరకు: సిరగం పంచాయతీ వర్రా గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:17 అరకులోయ మండలం సిరగం పంచాయతీ వర్రా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఆ గ్రామంలో సుమారుగా 300 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు సోమవారం తెలుగుదేశం పార్టీ అరకు ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ దొన్నుదొర తెలుగుదేశం కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపిటిసి కొర్ర పోలన్న ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన వారిలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు జన్ని మధు, జన్ని అఖిల్, జన్ని రామచంద్ర, జన్ని అప్పారావు, వంతల సద్దు, జన్ని బొండన్న, వంతల కొండబాబు, జన్ని అంకులు, జన్ని సత్తిబాబు, కొర్ర అప్పారావు, జన్ని సోయితీ, జన్ని సుబ్బారావు, కిల్లో పవన్, జన్ని బుద్దు, జన్ని సీతారాం, వంతల కన్నయ్య, వంతల శివ, వంతల బద్దు (పెస), వంతల దొంబు, జన్ని సీతారాం, జన్ని సోమీ, మామిడి నీలమ్మ, జన్ని అంజీలు, కొర్ర సావిత్రి, కొర్ర కొండమ్మ, శిరీష, కొర్ర కల, వంతల రాధిక, జన్ని పద్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సియ్యారి దొన్నుదొర మాట్లాడుతూ.. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే సమాజానికి ఉపయోగకరమన్నారు. అటువంటి వ్యక్తి కొర్ర రత్నమ్మ అని తను బిఏ బీఈడీ చదువుకుని తమ గ్రామ అభివృద్ధి కోసం తపించిన మహిళ అన్నారు. ఆమె పార్టీలోకి వచ్చి ప్రజాసేవ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం శుభపరిణామం అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం తన ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి సమాజాభివృద్ధికి కృషి చేసే వారికి ఎప్పుడూ కూడా గౌరవం ఉంటుందన్నారు. కాస్త ఓపిక పట్టి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. తానే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రజల ఆదరించారని కానీ సిరగం పంచాయతీలో ఎక్కువమంది తాను గెలవాలని తపించి ఎలక్షన్ నిర్వహించిన వారిలో ఉండటం విశేషం అన్నారు. మహిళల్లో చైతన్యం పెరిగిందని అనేందుకు ఈ సమావేశమే సాక్ష్యం అన్నారు. వారిలో ఇంకా రాజకీయ సామాజిక చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. గిరిజనుల కోసం చేపట్టిన నూతన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లోకోయి మహాదేవ్, డుంబ్రిగూడ మండల అధ్యక్షుడు కిల్లో ఆనందరావు, కోపరేట్ బ్యాంక్ చైర్మన్ పెట్టెలి రాము, టిడిపి మండల మాజీ అధ్యక్షులు శెట్టి బాబురావు, టిడిపి సీనియర్ నాయకుడు వై సర్పంచ్ పాడి చందు నిర్మల, వంతల వెంకట్రావు, కూన నాగరాజు, సిరిగం పంచాయతీ టిడిపి అధ్యక్షుడు పూజారి మాణిక్యం, ఉప సర్పంచ్ పాంగి మిన్ను, బిజెపి నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కామారెడ్డి తెలంగాణ

శ్రీరాం సాగర్ రెండవ దశ కాలువకు భీంరెడ్డి నరసింహారెడ్డి పేరును పెట్టాలి

 కామారెడ్డి 17 నవంబర్ పున్నమి ప్రతినిధి  శ్రీజ శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువకు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని కామారెడ్డి ఎం సి పి ఐ యు జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలు తెలుపుతూ, నవంబర్ 19న ఇందిరాపార్క్ వద్ద ధర్నా – ఎంసిపి ఐ (యు) పార్టీ పిలుపునిచ్చారు.  జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి జబ్బార్ మాట్లాడుతూ, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ భీంరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ విముక్తి కోసం అనేక త్యాగాలు చేశారని, ఆయన నాయకత్వంలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడి లక్షల ఎకరాల భూమి పేద రైతులకు చేర్చబడ్డాయని పేర్కొన్నారు. అయ న పేరును ఎస్సారెస్పీ రెండవ దశ కాలువకు పెట్టకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఆ యోధుడి త్యాగాలను ప్రభుత్వం గుర్తించి ట్యాంక్ బండ్ వద్ద ఆయన కాంస్య విగ్రహం, శృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పాఠ్యాంశాల లో తెలంగాణ రైతాంగ పోరాట యోధుల చరిత్రను చేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ కార్యదర్శి సత్తయ్య, రాజమణి, నరేష్, రాజు, ఆసిఫ్, సత్యవా నరేష్ తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

నూతన సీఐ చంద్రశేఖర్ ను సన్మానించిన ఆర్యవైశ్య సంఘ0 అధ్యక్షుడు పెండ్యాల విజయ్ కుమార్

రైల్వేకోడూరు నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండ్యాల విజయ్ కుమార్ రైల్వేకోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కి సిఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ ను పెండ్యాల విజయ్ కుమార్ శాలవాతో ఆయనను సన్మానించడం జరిగినది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద 2 వీలర్ బైక్ యాక్సిడెంట్ ఒకరు దుర్మరణం

17/11/25 మనుబోలు న్యూస్ ప్రగతి నగర్ పొదలకూరు రోడ్ సెంటర్ చెందిన రహంతుల్లా కి ఒక కొడుకు , కుమార్తె కొడుకు సుహాల్ 20 సంవత్సరముల వయసు గల కుర్రవాడు బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు ఈ కుర్రవాడు గూడూరు కి వెళ్లే మార్గమధ్యంలో వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద AP40FU6441 అనే ఆర్ వన్ ఫైవ్ టూ వీలర్ బైక్ పై అధిక వేగంతో డివైడర్ ని ఢీకొట్టడంతో అవతలి రోడ్డులోకి ఎగిరి పడే సమయంలో అటువైపు వెళుతున్న కంటైనర్ మీద పడటంతో తలకు ఎలిమెంట్ కూడా లేనందువలన తల రెండు భాగాలుగా పగిలినది అక్కడికక్కడే మరణించినాడు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద 2 వీలర్ బైక్ యాక్సిడెంట్ ఒకరు దుర్మరణం

17/11/25 మనుబోలు న్యూస్ ప్రగతి నగర్ పొదలకూరు రోడ్ సెంటర్ చెందిన రహంతుల్లా కి ఒక కొడుకు , కుమార్తె కొడుకు సుహాల్ 20 సంవత్సరముల వయసు గల కుర్రవాడు బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు ఈ కుర్రవాడు గూడూరు కి వెళ్లే మార్గమధ్యంలో వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద AP40FU6441 అనే ఆర్ వన్ ఫైవ్ టూ వీలర్ బైక్ పై అధిక వేగంతో డివైడర్ ని ఢీకొట్టడంతో అవతలి రోడ్డులోకి ఎగిరి పడే సమయంలో అటువైపు వెళుతున్న కంటైనర్ మీద పడటంతో తలకు ఎలిమెంట్ కూడా లేనందువలన తల రెండు భాగాలుగా పగిలినది అక్కడికక్కడే మరణించినాడు

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ గత ఆరు నెలల కింద వేసిన హై లెవెల్ ఫ్లైఓవర్ రోడ్డు గుంతల మయంగా మారిన పట్టించుకోని అధికారులు

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ గత ఆరు నెలల కింద వేసిన హై లెవెల్ ఫ్లైఓవర్ రోడ్డు గుంతల మయంగా మారిన పట్టించుకోని అధికారులు

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ గత ఆరు నెలల కింద వేసిన హై లెవెల్ ఫ్లైఓవర్ రోడ్డు గుంతల మయంగా మారిన పట్టించుకోని అధికారులు

పున్నమిప్రతినిధి : దుర్గేష్ ఆలంపల్లి 9640204826 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ గత ఆరు నెలల కింద వేసిన హై లెవెల్ ఫ్లైఓవర్ రోడ్డు గుంతల మయంగా మారిన పట్టించుకోని అధికారులు

E-పేపర్

రైల్వేకోడూరు అభివృద్ధికి పరిశ్రమలు అత్యవసరం: పంతగాని నరసింహ ప్రసాద్

కోడూరు అభివృద్ధికి పరిశ్రమలు అత్యవసరం: పంతగాని నరసింహ ప్రసాద్ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన అత్యవసరమని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అనేక మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వేలాది కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషి చేశారని తెలిపారు.

తిరుపతి

వాయులింగేస్వరుని దర్శించిన ఐటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

శ్రీకాళహస్తి నవంబర్ 17, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం ఐటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవభక్తుని శివకృష్ణ కుటుంబ సభ్యులతో ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు, టిడిపి నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించి వేదపండితులు శివకృష్ణ గారికి వేదాశీర్వచనం అందించి, ఆలయ అధికారులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షులు యాచేంద్ర, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలాజీ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు ఖాదర్, పవన్, గుణ స్వామి (గుణశేఖర్ రెడ్డి) మాజీ కార్యదర్శి కందుల రూపేష్ ఆర్టీసీ చంద్రశేఖర రావు, రిపబ్లిక్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు పార్థసారథి గజేంద్రనాయుడు అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

శ్రీకాళహస్తి నవంబర్ 17, పున్నమి న్యూస్ : తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజిక వర్గంలో రాయల చెరువుకు గండి పడటంతో దాదాపుగా 20 అడుగుల మేర చెరువు కట్ట తెగి దగ్గరలో ఉన్నటువంటి కెవిబిపురం మండలం కళత్తూరు గ్రామం, పాతపాలెం అనే గ్రామాలు నీట మునిగిపోయాయి ఈ కారణంగా కళత్తూరు గ్రామ ప్రజలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, పశువులను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేక వారం రోజులపాటు ఇబ్బందులను ఎదోర్కొంటున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్, సేవా భారతి (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో కళత్తూరు గ్రామంలోని 450 కుటుంబాలకు, పాతపాలెం నందలి 60 కుటుంబాలకు చీరలు, దుప్పట్లను పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సమాజ సేవకులు మాట్లాడుతూ….ఎక్కడైనా ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎటువంటి లాభాపేక్ష లేకుండా తక్షణమే ముందుండి సేవ చేయడంలో ఆర్ఎస్ఎస్, శ్రీ సరస్వతి శిశు మందిరాలు ముందు ఉంటాయని అందులో భాగంగానే కళత్తూరు నందు సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామ ప్రజలకు సహాయ సహకారాలను అందించడం జరిగిందని మానవసేవయే మాధవసేవ అనే భావంతో ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజూరు బాలసుబ్రమణ్యం, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల అధ్యక్షులు చాగణం భక్తవత్సలయ, మంగిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగరాజులు, ఉమా శంకర్, అమరావతి, పద్మశ్రీ, కిషోర్, తరుణ్, చందు, ప్రసాద్, సుధాకర్ పాఠశాల మాతాజీలు పాల్గొన్నరు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.