Friday, 20 March 2026

Blog

తెలంగాణ

చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలన్న : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నెలలు గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలలు గుర్తింపును పూర్తి చేయాలని, అనంతరం జిల్లా స్థాయి కమిటీ సూచనలు మేరకు చిత్తడి నేలల సర్వే, నిర్ధారణ, నోటిఫికేషన్ వంటివి పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.

రంగారెడ్డి

* భవిష్యత్ భాగ్యనగరం ఫ్యూచర్ సిటీనే: కిచ్చన్న —గ్లోబల్ సమ్మిట్ తో మారనున్న మహేశ్వరం ముఖచిత్రం *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రం లో ప్రపంచంలో ఉన్న ప్రముఖ విద్య, ఆరోగ్య సహా ఇతర సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారని కేఎల్ఆర్ గుర్తు చేశారు.మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు భారత్ ఫ్యూచర్ సిటీలో పరిపాలన భవన్ నిర్మాణం సహా గ్లోబల్ సమ్మిట్ కోసం ఎంపిక చేసే స్థలాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ భాగ్యనగరం ఫ్యూచర్ సిటీనే కాబోతుందని మరోమారు స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థలు, పెట్టుబడులను.ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారీ సదస్సు నిర్వాహణకు హైదరాబాద్ నగరంలో 4 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీ, ఇతర భవనాల పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న మ్యాప్ లను కేఎల్ఆర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* పత్తి రైతుల సమస్యలు తీర్చేదాక బిఆర్ఎస్ పోరాటం ఆగదు.. సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : రాష్ట్రవ్యాప్తంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం నాడు పరిగి నియోజకవర్గం పరిధి పూడూరు మండల కేంద్రంలో పత్తి రైతులు కోసం పూడూరు పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిగి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ తో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్షత చూపుతున్నాయని అన్నారు అకాల వర్షాలతో, అననుకూల వాతావరణ పరిస్థితులతో ఇప్పటికే దిగుబడి రాక అతలాకుతలమవుతున్న పత్తి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందిందని. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రాష్ట్రంలో ఏ మార్కెట్లో కూడా అమలు కావడం లేదని. తేమశాతం పేరుతో పత్తి రైతులను వ్యాపారులు, ప్రభుత్వము నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన పత్తిని అన్ని మార్కెట్లలో తేమ శాతంతో సంబంధం లేకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నమయ్య

శ్రీ హజరత్ ఖాదర్ వల్లీ సాహెబ్ 469వ ఉరుసుకు పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్‌కు ఆహ్వానం

టంగుటూరు గ్రామంలో ప్రతి సంవత్సరం సంప్రదాయంగా నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖాదర్ వల్లీ సాహెబ్ వారి 469వ ఉరుసు షరీఫ్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ధార్మిక వాతావరణంలో జరుగుతున్నాయి.ఈ సందర్భంగా టంగుటూరు ముస్లిం కమిటీ పెద్దలు, అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ సాయి లోకేష్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో ముస్లిం కమిటీ పెద్దలు వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, షేక్. షావలి,కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్,మంచా మురహరి,కమిటీ సెక్రటరీ షేక్ ఖాదర్ బాషా,షేక్ పూల బాషా, నవీన్ పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ ఉరుసు షరీఫ్ కార్యక్రమం అన్నివర్గాల ప్రజలు పాల్గొనగల సామరస్య, శాంతి,సౌహార్దత సందేశాన్ని తీసుకెళ్తుందని తెలిపారు.అదేవిధంగా,ఉరుసు మహోత్సవం సందర్భంగా వివిధ ప్రార్థనా కార్యక్రమాలు, ఝండా ఉంచడం,ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

E-పేపర్

రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్ హైదరాబాద్ – సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్ ఇద్దరు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

ఎన్ టి ఆర్ జిల్లా

వేమూరి ఆనంద్ సూర్య – అనురాధ దంపతుల వివాహ వార్షికోత్సవం ఘనంగా నిర్వహితం

రాష్ట్రం వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాహ్మణ హితైషి సంస్థ (ఆర్ బి యస్) కేంద్ర కార్యాలయంలో, బ్రహ్మశ్రీ వేమూరి ఆనంద్ సూర్య – అనురాధ వారి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గార్లపాటి విజయకుమార్ మరియు డి ఏ సి చైర్మన్ జి.వి. హనుమంతరావు ప్రత్యేక నేతృత్వంలో కార్యక్రమం నిర్వాహించబడింది. వివాహ దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి, వారి ఆశీస్సులు స్వీకరించడం జరిగింది. కార్యక్రమంలో జి. మాణిక్యాంబ, జాతీయ మహిళ కార్యదర్శి విజయలక్ష్మి, రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్పన, జనరల్ సెక్రెటరీ వారణాసి దుర్గా సారథి, డి ఏ సి కన్వీనర్ శ్రీమన్నారాయణ, కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు మరియు ప్రముఖ అతిథులు ఈ వేడుకను హృదయపూర్వకంగా ఆహ్లాదకరంగా నిర్వహించారు.

అల్లూరి సీతారామరాజు

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే శిశు మరణాలు : అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

ముంచింగిపుట్టు(పున్నమి), నవంబర్:18 నెల రోజుల వ్యవధిలో 5 మంది అభం శుభం తెలియని గిరిజన శిశువులు మరణించడంపై అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విచారం వ్యక్తం చేశారు. నియోజకవర్గం లోని ముంచంగిపుట్టు మండలం దారేల పంచాయితీ కుమారిపుట్టు గ్రామంలో నెల రోజుల వ్యవధిలో 5 మంది శిశువులు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర కుమారిపుట్టు గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే శిశు మరణాలు జరుగుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పేదల ప్రాణాలకు రక్షణ లేదని విమర్శించారు. నెల రోజుల వ్యవధిలో 5 మంది అభం శుభం తెలియని గిరిజన శిశువులు మరణించినా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండడం చాల బాధాకరమని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళినా సరైన వైద్యం అందించకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శిశు మరణాలపై సుదీర్ఘంగా దర్యాప్తు చేసి శిశు మరణాలు జరగకుండా చూడాలని కోరారు. చలి కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వలన గిరిజన ప్రాంతంలో ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ సమయంలో గిరిజనుల ఆరోగ్యపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. కుమారిపుట్టు గ్రామాన్ని సందర్శించిన వారిలో పాడేరు మాజీ ఎమ్మెల్యే కోట్టగుల్లి భాగ్యలక్ష్మి, ముంచంగిపుట్టు వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పద్మారావు, వైసీపీ అల్లూరి జిల్లా జేసీఎస్ కన్వీనర్ అరభిర జగబంధు, వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి పాంగి పులిరాజు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు ఉన్నారు.

అనకాపల్లి

ప్రముఖ భక్తకవి శ్రీ కనకదాసు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అనకాపల్లి జిల్లా పోలీసులు

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రముఖ భక్తకవి శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో కలిసి కనకదాసు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, భక్తి మార్గం, నైతికత, మానవతా విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన కనకదాసు వంటి మహనీయులు మన సమాజానికి శాశ్వత ప్రేరణ అని పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు. కనకదాసు బోధనలు నేటికీ అన్వయించుకునే విధంగా ఉండి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది, యువత అందరూ ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ప్రజాసేవలో నిజాయితీ, అంకితభావం, వినయంతో పనిచేయాలనే స్పూర్తిని కనకదాసు జీవితం అందిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు వ్యవస్థలో సాంస్కృతిక, నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ ఇటువంటి కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో పి.సి.ఆర్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు ప్రసాద్, సురేష్ బాబు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కార్మిక, రైతు, కూలీల ద్రోహి సిఎం సిఎం చంద్రబాబు పై కార్మిక సంఘాల మండిపాటు. 26న జిల్లా కేంద్రాల్లో నిరసన, ప్రదర్శనలకు పిలుపు

విజయవాడ: కార్మికుల, రైతుల, వ్యవసాయకూలీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర స్థాయి నాయకత్వ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్శింగ్ రావు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ఫ్లాంట్ కార్మికులనుద్ధేశించి సిఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఫ్లాంట్ ని వైట్ ఎలిఫెంట్ అని, కార్మికులు పనిచేయని దొంగలని, వారిపై పిడి యాక్ట్ లు పెడతానని హెచ్చరించటం సిఎం కి సహేతుకం కాదని తప్పు పట్టారు. కార్మిక ద్రోహులు, అధికారమదంతో ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, అధికారం అధిష్టానం పీఠం ఎక్కినాకా బోడి మల్లయ్య చందంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రాంపల్లి రవీంద్ర నాథ్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికులకు పనిగంటలను పెంపుదల చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోరాడిసాధింంచిన కార్మిక హక్కులను, చట్టాలను తుంగలో తొక్కుతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల, రైతు, కార్మిక, కూలీల వ్యతిరేక విధానాలు అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని విమర్శించారు. పారిశ్రామిక రంగంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కొడ్స్, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 26న జరిగే జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన లు, జిల్లా కలెక్టర్ లకు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాలు అందజేయాలని పిలుపు నిచ్చారు. మాజీ మంత్రి, ఏపి రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ బడా కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్ర వనరులను పప్పుబెల్లం వలె పంచుతున్నారని, సిఎం చంద్రబాబు పై మండిపడ్డారు. చంద్రబాబు అధికారం కైవసం చేసుకున్న తొలిరోజుల నుండి అన్ని రంగాలను ప్రైవేటీకరణకే పెద్దపీఠ వేసి, ప్రభుత్వ రంగాన్ని నాశనం చేశారని విమర్శించారు. వ్యవసాయం దండగా అంటూ దుంపనాశనం చేశారని ఏద్ధేవా చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తానా అంటే తందానా అంటూ డు..డు.. బసవన్నలాగా తయారయ్యడని దుయ్యబట్టారు. ప్రజా పోరాటాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన మార్కేట్ విధానం, నూతన విత్తన చట్టం, విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులను, కూలీలను, కార్మికులకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి సి ఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ, ఏఐకెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యం. వెంకటరెడ్డి, ఐఎఫ్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. రామకృష్ణ, సిఐటియు రాష్ట్ర నాయకులు వెంకటసుబ్బమ్మ, ఏఐయుటియుసి రాష్ట్ర అధ్యక్షులు సుధీర్, యుటియుసి రాష్ట్ర అధ్యక్షులు జూపల్లి జానకీరాములు, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చలసాని రామారావు, ఉపాధ్యక్షులు కృష్ణ మూర్తి, నగర అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, ఏఐసిటియు రాష్ట్ర నాయకులు లక్ష్మి నారాయణ, ఏఐకెఎఫ్ రాష్ట్ర నాయకులు కాసాని గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

వసతి గృహాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలి : అరకు ఎమ్మెల్యే రేగం

ముంచింగిపుట్టు(పున్నమి ప్రతినిధి), నవంబర్:18 ముంచింగిపుట్టు మండలం, బంగారుమెట్ట టీడబ్ల్యూ ఆశ్రమ(బాలికలు) పాఠశాల, కిలగడ జీటీడబ్ల్యూ ఆశ్రమ(బాలురు) పాఠశాలలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు ఆయ పాటశాలల రికార్డు లను తనిఖీ చేసి, విద్యార్ధుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయడంలేదని ఎమ్మెల్యే అన్నారు. వసతి గృహాలలో మెనూ అమలుపై అధికారుల పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. మెనూ పరిమాణాలు సరైన విధంగా ఉంటే విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని,ఆరోగ్యంగా ఉంటారని, విద్యార్థులకు ఇచ్చే మెనూలో కోతలు విధించడంతో విద్యార్థులకు ఏ రకంగా పౌష్టికాహారం అందుతుందని ప్రశ్నించారు. మెనూ సక్రమంగా అమలు కాకపొతే పౌష్టికాహారం అందక విద్యార్ధులు అనారోగ్యాలకు గురవుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.