Friday, 20 March 2026

Blog

తెలంగాణ

నషా ముక్త భారత్ :కలెక్టర్

నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) యువత మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్, జిల్లా సంక్షేమశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాదక ధ్రవ్యాల దుర్వినియోగం పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మత్తుమందులు, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు యువత బానిసలు కావద్దని, ఇవి స్లో పాయిజన్ లాంటివని, ఒకసారి అలవాటైతే వదులుకోవడం కష్టమని, దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. నిషేధిత పదార్థాలను తీసుకోవడం తప్పు అని, జీవితం బాగుండాలంటే కష్టపడి చదువుకోవాలని, చదువు వదిలేసి, మత్తుమందులకు అలవాటు పడితే జీవితాంతం ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని, అందువల్ల క్రమశిక్షణతో, ఓపికగా చదువుకోవాలని, మంచి పౌరులుగా ఎదగాలని, చదువుతోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉందని అన్నారు.

తిరుపతి

*హంస వాహనంపై సరస్వతి అలంకారంలో

*హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి* కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు , కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు. నవంబర్ 19వ తేదీన ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహ వాహనంపై శ్రీ పద్మావతీ అమ్మవారు విహరిస్తూ భక్తులను ఆశీర్వదించనున్నారు. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి.మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ రమేష్, అర్చకులు, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

తిరుపతి

కోలా దంపతులను ఘనంగా సన్మానించిన దేవాంగ సంఘం

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద సతీమణి విశాలి కోలా నియమితులైనందున శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేట నందు శ్రీ చాముండేశ్వరి కళ్యాణ మండపంలో దేవాంగ సంఘం వారు కోలా దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

తిరుపతి

రాష్ట్రీయ సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

శ్రీకాళహస్తి నవంబర్ 18, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలో రాష్ట్రీయ సేవాసమితి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. వెంకటరత్నం ఆదేశానుసారం, పొదుపు సంఘాల సంచాలకులు వి. నాగరాజు సలహాల మేరకు పెద్ద కన్నలి గ్రామ శివాలయం నందు, కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకొని, 17వ తేదీ సాయంకాలం రాస్ మహిళా పొదుపు సంఘాల సభ్యుల నడుమ, పురోహితులు మనోహర్ శర్మ వారి బృందం చే ప్రత్యేక పూజా మంత్రాలతో, అత్యంత భక్తి పారవశ్యంతో , ఉపవాసం తోటి అందరూ పిండి దీపాలను ఆలయంలో వెలిగించి, తమ భక్తిని ,ముక్తిని, శివనామ స్మరణలతో చాటుకోవడం, గ్రామస్తుల ద్వారా వేసిన కోలాటాలు భక్తులను చాలా ఆకట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న మహిళలందరికీ పూజా అనంతరం అన్ని రకాల ప్రసాదాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమము నందు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కరుణాకర్ నాయుడు ఫీల్డ్ అధికారులు వినోద్ ముఖేష్ సుబ్బారావు నాగలక్ష్మి తదితర రాస్ సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

నాట్య కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేత

శ్రీకాళహస్తి నవంబర్ 18, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారు శ్రీ కార్తీక మాసం పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో నాట్య కళాకారులు వాళ్ళ యొక్క నాట్య కళను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పంచ వేద కూచిపూడి విద్యాలయ మాస్టర్ వేణుగోపాల్, శ్రీకాళహస్తి స్వామి వారి దేవస్థానం సాంస్కృతిక కార్యక్రమాల ఇంచార్జ్, దేవస్థానం సిబ్బంది పాల్గొని నాట్య కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

తిరుపతి

టిడిపి జోనల్ ఏరియా కోఆర్డినేటర్ ని సన్మానించిన మురళి నాయుడు

శ్రీకాళహస్తి నవంబర్ 18, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు గాలి మురళి నాయుడు మంగళవారం నాడు తిరుపతి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు దీపక్ రెడ్డిని కలిసి, తాము 21 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షులుగా వైస్ ఎంపీపీగా, తమ కుటుంబం నుంచి జెడ్పిటిసిగా అనసూయమ్మ, తమా గ్రామానికి చెందిన ఎంపీపీ కోవిపోలమ్మ,దివంగత నేత మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి హయాంలో నాలుగు దఫాలుగా మండలంలోని తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలను మండలానికి అందించిన ఘనత తమ కుటుంబానికి ఉందని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించిందని దీపక్ రెడ్డికి వివరించారు. అనంతరం తన బయోడేటాను ఇవ్వమని కోరగా దీపక్ రెడ్డికి బయోడేటాను అందించి, శాలువాతో సత్కరించగా మీకు తగిన న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అంకయ్య చౌదరి, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి చెన్న రాఘవులు యాదవ్ తదితర నాయకులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

తిరుపతి

కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఆవరణలో సహకారపతాకావిష్కరణ

శ్రీకాళహస్తి నవంబర్ 18, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఆవరణలో తిరుపతి జిల్లా సహకార శాఖ తరపున శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ కో ఆప్ ఆఫీసర్, విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యాంకు పాలకమండలి చైర్మన్ ఖాదర్ బాషా అధ్యక్షతన ప్రతి సంవత్సరం నవంబర్ 14 వ తేది నుండి 20 వ తేది వరకు జరుపబడు అఖిల భారత సహకార వారోత్సవాలలో భాగముగా మంగళవారం నాడు రాష్ట్ర సహకార శాఖ వారి ఆదేశాల మేరకు పాలకమండలి సభ్యులు బ్యాంకు CEO ధనంజయులు, అకౌంటెంట్ రవి అందరు కలసి సహకారపతాకమునకు పూజ నిర్వహించి సహకారపతాకావిష్కరణ చేసి అనంతరం గౌరవ వందనం సమర్పించారు.

తెలంగాణ

చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలన్న : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నెలలు గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలలు గుర్తింపును పూర్తి చేయాలని, అనంతరం జిల్లా స్థాయి కమిటీ సూచనలు మేరకు చిత్తడి నేలల సర్వే, నిర్ధారణ, నోటిఫికేషన్ వంటివి పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.

రంగారెడ్డి

* భవిష్యత్ భాగ్యనగరం ఫ్యూచర్ సిటీనే: కిచ్చన్న —గ్లోబల్ సమ్మిట్ తో మారనున్న మహేశ్వరం ముఖచిత్రం *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రం లో ప్రపంచంలో ఉన్న ప్రముఖ విద్య, ఆరోగ్య సహా ఇతర సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారని కేఎల్ఆర్ గుర్తు చేశారు.మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు భారత్ ఫ్యూచర్ సిటీలో పరిపాలన భవన్ నిర్మాణం సహా గ్లోబల్ సమ్మిట్ కోసం ఎంపిక చేసే స్థలాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ భాగ్యనగరం ఫ్యూచర్ సిటీనే కాబోతుందని మరోమారు స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థలు, పెట్టుబడులను.ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారీ సదస్సు నిర్వాహణకు హైదరాబాద్ నగరంలో 4 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీ, ఇతర భవనాల పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న మ్యాప్ లను కేఎల్ఆర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* పత్తి రైతుల సమస్యలు తీర్చేదాక బిఆర్ఎస్ పోరాటం ఆగదు.. సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : రాష్ట్రవ్యాప్తంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం నాడు పరిగి నియోజకవర్గం పరిధి పూడూరు మండల కేంద్రంలో పత్తి రైతులు కోసం పూడూరు పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిగి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ తో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్షత చూపుతున్నాయని అన్నారు అకాల వర్షాలతో, అననుకూల వాతావరణ పరిస్థితులతో ఇప్పటికే దిగుబడి రాక అతలాకుతలమవుతున్న పత్తి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందిందని. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రాష్ట్రంలో ఏ మార్కెట్లో కూడా అమలు కావడం లేదని. తేమశాతం పేరుతో పత్తి రైతులను వ్యాపారులు, ప్రభుత్వము నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన పత్తిని అన్ని మార్కెట్లలో తేమ శాతంతో సంబంధం లేకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.