Friday, 20 March 2026

Blog

E-పేపర్

వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమo

వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమo రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి ఓబులవారిపల్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఓబులవారిపల్లె మండలం వై కోట పంచాయతి నందు జరిగినది. ,మాజీ జెడ్పిటిసి మాజీ టూరిజం డైరెక్టర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తుచేశారు,గత జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి అని ,ఈ ప్రభుత్వం పేదలు అంటే చులకన గా చూస్తుంది అని, నెలల తరబడి ఆఫీస్ లు చుట్టూ తిరుగుతున్నా కూడా పనులు కావటం లేదు అని గుర్తు చేశారు,ఆంధ్రప్రదేశ్ రాష్టం కలిసి ఉన్నపుడు మెడికల్ కాలేజీలు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో వచ్చాయని, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు వైద్యం అందాలని, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో ఎక్కువ అయ్యాయని, వాటిలో పేదలు ఖర్చు భరించలేరని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 17 మెడికల్ కళాశాలలో మంజూరు చేయించారని, ఐదు మెడికల్ కళాశాలను పూర్తి చేయగా, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రవేట్ పరం చేయాలి అని చూస్తున్నారు కాబట్టి మనం అందరం కలిసి కట్టిగా పోరాడాలి అని గుర్తుచేశారు దానిలో భాగంగా కోటి సంతకాలు చేసి గవర్నర్ కి సమర్పించాలి అని తెలియచేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ మల్లెం ఈశ్వరయ్య,కో ఆప్షన్ నంబర్ మౌల,చింతకుంట గురవయ్య, గడ్డం రఘురామయ్య ,గడ్డం వెంకటేష్ ,మల్లెం దేశయ ,మారే సుకుమార్,మాచినేని శంకర ,సూరాల చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రైతులకు 16.50 లక్షలు రైతుల అకౌంట్లో జమ డిసిఎంఎస్ చైర్మన్ జయ ప్రకాష్

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు ఎమ్మార్వో ఆఫీస్ నందు జరిగిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ కోడూరు నియోజకవర్గ రైతులకు మొత్తం 16 కోట్ల 50 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది. మొత్తం 24,622 మంది రైతులు లబ్ధి పొందడం జరిగినది. జయప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షంగా ఎన్నో కార్యక్రమాలను సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలియజేశారు. సందేప్ మండల వ్యవసాయ అధికారి రైల్వే కోడూరు మరియు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతులు, పీఎం కిసాన్ అన్నదాత లబ్ధిదారులు,రైల్వే కోడూరు నియోజకవర్గ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ మనీ గారు, నియోజకవర్గ మండల వ్యవసాయ మరియు ఉద్యాన అధికారులు, విలేజ్ అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ అసిస్టెంట్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, నాయకులు పాల్గొనడం జరిగినది.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ రైతుల కోసం పిఎం కిసాన్–అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల

నందిగామ: రాష్ట్రంలోని రైతులు పిఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నందిగామ పాత బస్టాండ్ సెంటర్, బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్‌లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. కార్యక్రమం లో ప్రకృతి వ్యవసాయ, పశువర్ధక శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అలాగే రైతులతో కలిసి భోజనం చేశారు. నందిగామ నియోజక వర్గంలోని 30,216 మందిరైతుల ఖాతాల్లో రెండో విడతగా సుమారు ₹20.42 కోట్లు జమ చేయబడినట్లు ఎంపీ శివనాథ్ తెలిపారు. ఇందులో కేంద్రం వాటా ₹2,000, రాష్ట్రం వాటా ₹5,000 గా ఉండి, ఒక్కో రైతు ఖాతాలో మొత్తం ₹7,000 చొప్పున జమ చేయబడింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం లో భాగంగా, పథకం ద్వారా ఆధునిక వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగా లకు ప్రోత్సాహం, వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు సరైన మార్కెట్ ధర, ఆర్థిక మద్దతు వంటి ముఖ్యసేవలను రైతులకు అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్థానిక పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ శివనాథ్ వివరించినట్లు, త్వరలో దేవినేని వెంకటరమణ వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం కూడా రైతుల కోసం అందుబాటులోకి వస్తుంది.

E-పేపర్

మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఫర్దిన్ అహ్మద్ దంపతులు.

బెంగళూరు : ఎంబస్సి స్టార్ హోటల్లో మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఫర్దిన్ అహ్మద్ దంపతులు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరాలయ గోశాలకు రూ. 101116 విరాళం

శ్రీకాళహస్తి నవంబర్ 19, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న గోశాలలోని గోవుల సంరక్షణ కోసం బుధవారం నాడు పాగాల రామకృష్ణయ్య కుమారుడు దీపు కుమార్ దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి చైర్మన్ కొట్టేసాయి, కోలా ఆనంద్ కుమార్ వారల ఆద్వర్యంలో రూ.. 101116/-లను విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చరిత, పాదాల రామకృష్ణయ్య, గుణశేఖర్ పాల్గొన్నారు.

తిరుపతి

శక్తీ యాప్ పై మహిళలకు అవగాహన కార్యక్రమం

శ్రీకాళహస్తి నవంబర్ 19, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేట సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శి ఆధ్వర్యంలో, పోలీస్ కోటర్స్ 4, 5, 7, 8వ వార్డుల్లో శక్తీ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి సమాజంలో మహిళల భద్రతకు శక్తీ యాప్ ఎంత ముఖ్యమో సిబ్బంది వివరించడంతో స్థానిక మహిళల్లో మంచి అవగాహన కలిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసు సులోచన, శ్రీహిత బృందం పాల్గొని స్థానిక మహిళలకు శక్తీ యాప్ వినియోగం, అత్యవసర సమయాల్లో ఎలా ఉపయోగపడుతుందో, అందుబాటులో ఉండే భద్రతా సేవలను వివరించారు. మహిళల రక్షణ, వెంటనే స్పందించే పోలీస్ సేవలు, SOS ఫీచర్ వంటి అంశాలపై ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యక్ష ప్రదర్శనతో అవగాహన కల్పించారు.

తిరుపతి

రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కు లను పంపిణి చేసిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి నవంబర్ 19, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం ఏర్పేడు నందు రైతుల సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని అన్నదాత సుఖీభవ పి. యం. కిసాన్ 2వ విడత ద్వారా 22 వేల 552 కుటుంభాలకు 18 కోట్ల 64 లక్షల రూపాయల చెక్కు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలలో ఒక్కోక్కటి అమలు చేస్తుందని అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు 20 వేలు అందిస్తామని చెప్పిన విధంగా మొదటి విడత లో భాగంగా 7000 వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేసాం. ఈ రోజు రెండో విడత లో భాగంగా రాష్ట్ర ప్రభుతం 5000 వేలు, కేంద్ర ప్రభుత్వం 2000 వేలు రూపాయలు జమ చేస్తుందని చెప్పున మాట ప్రకారం ఒక్కో పథకం అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం లాగ మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అధికారులు, నాయకులు కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

Annadaata-PM kissan నిధులు విడుదల

సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం పచ్చగా ఉంది:గుడివాడ ఎమ్మెల్యే వేనిగండ్ల రాము* *నియోజకవర్గ పరిధిలోనీ రైతాంగానికి మంజూరైన… అన్నదాత సుఖీభవ చెక్కును ఆవిష్కరించిన ఎమ్మెల్యే* *రైతే రాజన్నది మొదటి నుంచి టిడిపి సిద్ధాంతం…* *మంచి చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు….చెడు చేస్తే పాతాళానికి తొక్కేస్తారు* గుడివాడ నవంబర్ 19: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం పచ్చగా ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం గుడివాడ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లా చినదాసరిపల్లిలో సీఎం చంద్రబాబు పాల్గొన్న అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులు మరియు కూటమినేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు. అనంతరం గుడివాడ నియోజకవర్గ పరిధిలోని 11వేల 168 మంది రైతులకు మంజూరైన రూ.7.44 కోట్ల జంబో చెక్కును రైతులు మరియు కూటమినేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడారు…రైతే రాజన్నది మొదటి నుండి టిడిపి సిద్ధాంతమన్నారు.విజన్ ఉన్న చంద్రబాబు నాయకత్వంలో, ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందనడానికి మరో నిదర్శనమే రైతాంగానికి రెండో విడత అన్నదాత సుఖీభవ – పీ.ఎం కిసాన్ నిధులు విడుదల చేయడమేనన్నారు. గత ప్రభుత్వంలో రైతాంగ అనుబంధ వ్యవస్థలను సర్వ నాశనం చేశారని, కనీసం పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడేవారని, కొద్దిపాటి వర్షాలకే కాలువలు పొంగి రైతాంగం ఎంతో నష్టపోయారని నాటి రోజులను ఎమ్మెల్యే రాము గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో కాలువలను ఆధునికరించడం, రైతాంగ సమస్యలను పరిష్కరించడంతో పాటుగా, అనుబంధ వ్యవస్థలన్నిటిని గాడిలో పెట్టిన సీఎం చంద్రబాబు తమది రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. తుఫాన్ సమయంలో స్పూర్తి దాయకంగా పనిచేసిన కూటమి నాయకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అభినందించారు. మంచి చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని…. చెడు చేస్తే పాతాళానికి తొక్కేస్తారని ఆయన అన్నారు. ప్రధాని మోడీ – సీఎం చంద్రబాబు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్న ఎమ్మెల్యే రాము గుడివాడ అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టిడిపి అబ్జర్వర్ నూకాలమ్మ యాదవ్, గుడివాడ ,గుడ్లవల్లేరు మార్కెట్ యార్డుల చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, గుడివాడ బిజెపి కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు,గుడివాడ,రూరల్ నందివాడ మండలాల టిడిపి అధ్యక్షులు దింట్యాల రాంబాబు, వాసే మురళి, దానేటి సన్యాసిరావు, సీనియర్ టిడిపి నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్రావు, పండ్రాజు సాంబయ్య, కళింగా కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, తెలుగు మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరిపర్తి సుబ్బారావు,కొండలమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఈడే మోహన్,గోకవరపు సునీల్, వ్యవసాయ శాఖ ఏడిఏ కరుణ, డి.సిలు కుటుంబరావు, ఆంజనేయులు, బొమ్మనబోయిన ఏసుబాబు, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని రైతు సంఘ నాయకులు, నీటి సంఘాల కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

నిర్మల్

*మహబూబ్ హుస్సేన్ జిగర్ అవార్డు

*మహబూబ్ హుస్సేన్ జిగర్ అవార్డు గ్రహీత – అబు జియా సయ్యద్ జలీల్ అజార్‌కు వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ ఘన సన్మానం.* నిర్మల్ నవంబర్ 19. ఇటీవల ప్రతిష్ఠాత్మక మహబూబ్ హుస్సేన్ జిగర్ అవార్డు అందుకున్న అబు జియా సయ్యద్ జలీల్ అజార్‌ను, తెలంగాణ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ ఘనంగా సన్మానించారు. నిర్మల్ పట్టణంలోని తన నివాసంలో ఆయన్ని ఆహ్వానించి, శాలువా కప్పి స్మారక చిహ్నం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ మాట్లాడుతూ—సాహిత్యం, సామాజిక సేవ రంగాల్లో అజార్ చేసిన కృషి ప్రశంసనీయమని, యువతకు ఆయన నిజమైన ఆదర్శమని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో Md. జీషణ్ అలీ, కాంగ్రెస్ లీడర్ అనీస్ అహ్మద్ ఖాన్, అల్మాస్ ఖాన్, Md. జాహెద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ

51వ వార్డు కళింగ నగర్ 241 బూత్ పరిదిలో స్థానిక నాయకులు ఎర్పాటు చేసిన మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ పాల్గొని ప్రతి గడపకు వెళ్ళి మెడికల్ కాలేజ్ ప్రవేటికరణ వ్యతిరేకరణ సంతకాల సేకరణ చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గ్రామీణ ప్రాంతాలలో పెద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.ప్రైవేటీకరణ వల్ల వైద్యం ఖరీదైపోయి సామాన్యులకు అందకుండా పోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాలి.కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వానికి మన నిరసనను తెలియజేసే ఒక శక్తి వంతమైన మార్గంమని ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మన హక్కులను కాపాడుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ అప్పారావు మాస్టర్, బుడుమూరు తిరుమలరావు, మెట్ట దమయంతి,ఎద్దు పైడి రాజు, కింతల వరాహలరాజు, ఆర్ వెంకటరమణ,చిన్నారావు,భాను చందర్,గణేష్,సాదు,ఎర్ని బాబు,తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.