Thursday, 19 March 2026

Blog

తిరుపతి

గ్రంథాలయ వారోత్సవాల్లో విజేతలకు బహుమతుల ప్రధానం

తొట్టంబేడులో 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భముగా శాఖా గ్రంధాలయం, తొట్టంబేడు నందు గ్రంథాలయ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వము, చిత్రలేఖనం, మ్యూజికల్ చైర్ పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి .సురేంద్రనాథ్ చేతులమీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా మెడల్స్, జాతీయ ప్రముఖుల గురించిన పుస్తకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధి సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు జ్ఞాన సముపార్జనకు నిలయాలని ఒక మంచి పుస్తకం వంద మంది మంచి స్నేహితులతో సమానమని నేటి యువత గ్రంథాలయాలను చక్కగా వినియోగించుకొని ఉన్నత శిఖరాలు కు చేరుకోవాలన్నారు. అనంతం గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ.. ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లలకి గ్రంథాలయ సభ్యత్వము తీసుకుని బాల్య దశ నుంచే గ్రంథాలయాలు సందర్శించే విధముగా ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో గర్ల్స్ హాస్టల్ వెల్ఫెర్ ఆఫీసర్ యం.జయసుధ, రీడర్స్ క్లబ్ సభ్యులు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కార్తీకమాస భోజనాలు

శ్రీకాళహస్తి నవంబర్ 20, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తీశ్వర పరిరక్షణ సమితిపరిరక్షణ సమితి అధ్యక్షులు అట్ల పురుషోత్తం గౌడ్ ఆధ్వర్యంలో గురువారము నాడు స్థానిక సుఖ బ్రహ్మాస్త్రంలో కార్తీకమాస వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ.. గతంలో గతంలో మొదటగా నది ప్రక్షాళన చేపట్టగా అనంతరం దేవస్థానం వారు ముందుకు వచ్చి నది ప్రక్షాళన చేశారన్నారు. దేవాలయంలోని సమస్యలను పరిష్కారం దిశగాతీసుకెళ్లామని తిరుమలలో ఆర్టీసీ బస్సులపై నమో వెంకటేశాయ అని రాశారో అదేవిధంగా శ్రీకాళహస్తి డిపో బస్సుల పైన కూడా రాయలని ఆలయ ఈవోకి, ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బి,వెంకయ్య, ఈశ్వర్ స్వామి, రమేష్, డాక్టర్ లక్ష్మీనారాయణ,,శంకర్, కొండుగోరుకృష్ణ ప్రసాద్, మోహన్ గౌడ్, పి ఎం చంద్రగారు, త్యాగణం భక్తవత్సలు, వి సుబ్రహ్మణ్యం, జె,దుర్గాప్రసాద్, త్యాగనంశైలిజా, బి రేణుకా దేవి, పరమేశ్వరయ్య, ముని సుబ్బారెడ్డి, పరిరక్షణ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వరద బాదితులకు చీరల పంపిణీచేసిన రెడ్డి సంక్షేమ సంఘం

శ్రీకాళహస్తి నవంబర్ 20, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజిక వర్గంలోని కే. వి. బి పురమ మండలంలో ఇటివల కురిసిన భారివర్షాల కారణంగా చేరువు తెగిపోయి సర్వం కోల్పోయిన పాతపాలెం అరుంధతి వాడ, కలతూరు హరిజనవాడలోని మహిళలకు శ్రీకాళహస్తి రెడ్డి సంక్షేమ సంఘం ద్వార 600 చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు. బి.చెంచురెడ్డి కార్యదర్శి డి.సునీల్ కుమార్ రెడ్డి నిధి. డి.మునిరెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ. డి.రవికుమార్రెడ్డి. ఉపాధ్యక్షుడు. ఐ.మహీంద్రనాథ్ రెడ్డి మరియు భాస్కరరెడ్డి రామచంద్రారెడ్డి రాజారెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

తిరుపతి

విద్యాశాఖ తరపున అధ్యయన యాత్రకి ఉపాధ్యాయుడు బాలు

తొట్టంబేడు నవంబర్ 20, పున్నమి న్యూస్ :: ఈ సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ నందు పనిచేస్తున్న ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యంను రాష్ట్ర పరిశోధన శిక్షణా మండలి (ఎస్.సి.ఇ.ఆర్.టి) రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ తరపున విద్యా అధ్యయన యాత్రకి సింగపూర్ కి పంపిస్తున్నట్టు విద్యాభవన్ విజయవాడ కార్యాలయం నుండి సమాచారాన్ని అందించారు. ఈ నెల 27 నుండి డిసెంబర్ 2 లో తేది వరకు వారం రోజులు సింగపూర్ లో విద్యా శాలలను సందర్శించి అక్కడి విద్యా సంస్కరణల స్థితిగతుల పై అధ్యయనం చేసి రాష్ట్ర విద్యా శాఖ కు ఒక నివేదికను ఇవ్వనున్నారు.సింగపూర్ అధ్యయన యాత్రకి ఆహ్వానం రావడం పట్ల బాలు ఆనందాన్ని వ్యక్తం చేసారు. సహచర ఉపాధ్యా యులు, మండల విద్యాశాఖ బాలుకి అభి నందనలు తెలిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన రంగినేని చెంచయ్యనాయుడు

శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా గంగినేని చెంచయ్య నాయుడు గారు నియమితులయ్యారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్త బాధ్యతలను ప్రజల అభ్యున్నతికి వినియోగిస్తానని చెంచయ్య నాయుడు వెల్లడించారు. ఈరోజు శ్రీకాళహస్తిలోని టిడిపి సభ్యులంతా కలిసి ఆనంద ఉత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు. పదేపదే బొజ్జల కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Featured

విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు ఏమాత్రం సరికాదు* ..!

20 నవంబర్ ( పున్నమి ప్రతినిధి) ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి..ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్..! ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టటం ఎంత మాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. విమర్శనాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను దేశ అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది.. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం విచారించి.. ‘ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను అందరూ గౌరవించాలి.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

E-పేపర్

తైక్వాండ్ రాష్ట్రస్థాయి పోటీలలో ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు

తైక్వాండ్ రాష్ట్రస్థాయి పోటీలలో ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన విద్యార్థులు ఈ నెల 16,17,18 వ తేదీలలో కాకినాడ సూర్యకళ మందిర లో తైక్వాండ్ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించఆరు ఇందులో కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు వారి లో డి. ధనుష్, టీ.జయ శంకర్, డి మధీహ, బి జయదేవ్, కాంస్య పతకం మరియు స్.సులేమాన్,ఈ.చందన, డి.హెవనిక, యం.లేహ్య వెండి పతకాలు టీ. సోహిత, డి సుప్రియ బంగారు పతకాలు సాధించారు అని కోచ్ ఎస్ కె మౌలా అభినందించారు .

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా సాగునీటి అధ్యక్షుడు జన్మదిన వేడుకలు

మనుబోలు మండలం కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థి విద్యార్థినుల మధ్యలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్న పచ్చిపాల రామిరెడ్డి టిడిపి నాయకులు సాగు నీటి సంఘం అధ్యక్షులు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పచ్చిపాల రాము రెడ్డి యువసేన అభిమానులు తదితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ స్టాపింగ్ కోసం డిఆర్ఎంకు వినతి పత్రం

నందలూరు రైల్వే స్టేషన్‌లో తిరుపతి–కాచిగూడ మధ్య నడిచే వెంకటాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలంటూ దక్షిణ మధ్య రైల్వే గుంటకల్ డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్ గుప్తా కు నందలూరు మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు మరియు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తరఫున వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ— వెంకటాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నందలూరులో ఆగితే ఈ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు,ఉద్యోగస్తులకు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.రైల్వే ప్రయాణం మరింత సౌకర్యవంతమవుతుందని, తిరుపతి మరియు హైదరాబాద్ దిశగా వెళ్లే వారికి ఇది పెద్ద సదుపాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నరసింహస్వామి ఆధ్వర్యంలో డిఆర్ఎంను శాలువాతో సన్మానించి,అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.వినతిపై స్పందించిన డివిజనల్ మేనేజర్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ విషయాన్ని పరిశీలిస్తాము అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రావులపాలెం రూరల్ సీఐ హెచ్చరిక —పవిత్ర ఆలయంలో దొంగతనానికి తావులేదు

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీ లెక్కింపు సమయంలో దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అక్కడికక్కడే పట్టుకున్నారు. రామచంద్రాపురం మండలం వేగేయమ్మపేటకు చెందిన వాసంసేట్టి శ్రీనివాసరావు (49) హుండీ లెక్కింపు పనుల్లో గుమిగూడిన సిబ్బంది కళ్లుగప్పి రూ.60,000 దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించగా, ఆలయ E.O, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రదర్ రావు సిబ్బందితో కలిసి అతన్ని పట్టుకొని ఆత్రేయపురం పోలీసులకు అప్పగించారు. తదుపరి SI ఎస్. రాము కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఆదేశాలు అందుకున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా SP రాహుల్ మీనా, IPS మార్గదర్శకత్వంలో, కొత్తపేట DSP సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం రూరల్ CI విద్యాసాగర్, SI ఎస్. రాము కేసును వేగంగా విచారించి నిందితుడిని అరెస్టు చేశారు. తరువాత కొత్తపేట గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా, మేజిస్ట్రేట్ జస్వంత్ యాదవ్ నిందితుడికి 14 రోజుల న్యాయ పరిరక్షణ (జ్యుడీషియల్ రిమాండ్) విధించారు. అనంతరం అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. పవిత్ర ఆలయ ప్రాంగణంలో ఇలాంటి చర్యలకు తావులేదని, ఎవరైనా ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని రావులపాలెం రూరల్ CI విద్యాసాగర్ స్పష్టంచేశారు. End

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.